ఆంధ్రప్రదేశ్‌

త్వరలో తిరుపతిలో పారిశ్రామిక సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 20: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎం ఎస్ ఎం ఈ పార్కులను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో తిరుపతిలో త్వరలోనే పెద్ద ఎత్తున పారిశ్రామిక సదస్సును నిర్వహించనున్నామని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుపతి మానస సరోవర్ హోటల్‌లో ఏర్పాటు చేసిన సీఐఐ తిరుపతి జోన్ సదస్సులో పరిశ్రమల శాఖామంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఈజ్ ఆప్ డూయింగ్ బిజెనెస్‌లో రాష్ట్రం ప్రథమస్థానంలో ఉండడానికి కారణం పారిశ్రామిక వేత్తల స్పందనేనన్నారు. ఇప్పటికే విశాఖపట్టణంలో మూడుసార్లు పారిశ్రామిక సదస్సులు నిర్వహించామని, ఇక్కడ పెద్ద పరిశ్రమలకే అవకాశం కలిగిందన్నారు. దేశంలోనే వినూత్నంగా కొత్త నిర్ణయంతో ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక వాడలు దాదాపు 135 ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇందులో దేశంలోని, రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలకు అవకాశం కల్పించి ప్రోత్సహించే దిశగా తిరుపతిలో సెప్టెంబర్ మొదటి వారంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక సదస్సు నిర్వహించనున్నామన్నారు. రాస్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడానికి అనుభవమున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే కారణమన్నారు. ప్రతి ఎం ఎస్ ఎం ఈ పార్కులలో సీ ఎఫ్ సీ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరిశ్రమలకు రావాల్సిన రాయితీలు 2004 నుండి పెండింగ్‌లో ఉంటే పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించి కొత్త రాష్ట్రం అయినా 2014లో ఒకేసారి అందించామని గుర్తు చేశారు. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు సహకారంతో 5544కోట్ల రూపాయలతో విశాఖపట్టణం, చెన్నై కారిడార్ పనులు చేపట్టామని తెలిపారు. నేడు ఏ డీబీ వైస్ చైర్మన్ భారతదేశం పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చారని వారితో కూడా ఎంఎస్‌ఎం ఈలకు ప్రోత్సాహం ఇవ్వాలని, రుణ సదుపాయం కల్పించాలని ప్రతిపాదించగా వారి నుండి సానుకూల స్పందన వచ్చిందని అన్నారు.
సీఐఐ ప్రతినిధులు ఏపీఐఐ సీసీ ద్వారా అభివృద్ధి చేయకుండా భూమిని ఇవ్వగలిగితే పరిశ్రమల స్థాపనకు కొంత భారం తగ్గుతుందని, అలాగే ప్రతి పారిశ్రామిక వాడలకు రవాణా సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ సదస్సులో సీ ఐ ఐ ఏపీ చైర్మన్ రుద్రరాజు, ఏపీ వైస్ చైర్మన్ గల్లా విజయ్‌నాయుడు, తిరుపతి జోన్ వైస్ చైర్మన్ గల్లా రాజశేఖర్, రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన సీ ఐ ఐ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.
పరిశ్రమల స్థాపనకు మరింత సాయం అందించండి
ఇదిలావుండగా ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు మరింత రుణ సహాయం అందించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్‌జాంగ్‌ను కోరారు. ఇండియా పర్యటనలో ఉన్న ఏడీబీ వైస్ చైర్మన్ చిత్తూరులో త్వరలో ఏర్పాటవుతున్న పరిశ్రమల నోడ్స్‌ను పరిశీలించడనాకి విచ్చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని హోటల్ గ్రాండ్ రిడ్జ్‌లో సమావేశమై రాష్ట్రంలో పరిశ్రమల కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.