ఆంధ్రప్రదేశ్‌

డ్రైవింగ్‌లో కునుకుకు ఇక చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 5: అలసట, నిద్రలేమి కారణంగా వాహనాలను నడుపుతున్నప్పుడు డ్రైవర్లకు లిప్తకాలం పాటు నిద్ర మత్తులో కళ్లు మూతపడటం, వేగంగా వాహనం వెళ్తున్న సమయంలో ఈ నిద్ర అనేక ప్రమాదాలకు దారి తీయడం తెలిసిందే. ఈ తరహా నిద్రతో జరిగే ప్రమాదాల్లో అనేక మంది జీవితాలు తెల్లారి పొతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని డ్రైవర్ శరీరం, ముఖం తదితర కదలికలను ప్రత్యేక పరికరాల ద్వారా గుర్తించి అప్రమత్తం చేసే వ్యవస్థ త్వరలో అందుబాటులోకి రానుంది. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎస్‌ఐఆర్-సీఈఈఆర్‌ఐ (పిలాని) చీఫ్ సైంటిస్టు, పీఎంబీడీ విభాగాధిపతి డాక్టర్ ఎస్.అక్బర్ ఈ దిశగా జరుగుతున్న పరిశోధనల గురించి ‘ఆంధ్రభూమి’కి శుక్రవారం వివరించారు. అలసట, నిద్రలేమి, స్థూలకాయం తదితర కారణాలతో వాహనాలు నడిపే సమయంలో లిప్తపాటు నిద్ర (మైక్రో స్లీపింగ్) వస్తుంది. ఈ నిద్ర సెకను నుంచి 2 నిమిషాల వరకూ ఉంటుంది. వేగంగా వాహనం నడుపుతున్న సమయంలో ఈ నిద్రవల్ల ప్రమాదం జరిగే వీలు ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశీయంగా డ్రైవర్ నిద్రపోయే సమయాన్ని ముందే గుర్తించి అప్రమత్తం చేసే వ్యవస్థను అందుబాటులోకి సీఎస్‌ఐఆర్-సీఈఈఆర్‌ఐ తీసుకురానుంది. సీఎస్‌ఐఆర్-సీఈఈఆర్‌ఐ పిలాని, చెన్నై శాఖలు దీనిపై పరిశోధనలు చేస్తున్నాయి. వీపుభాగం, నాడి, ముఖం కదలికలను గుర్తించే ప్రత్యేక సెన్సర్లను ఏర్పాటు చేస్తారు. ఈ శరీర భాగాల కదలికల ద్వారా డ్రైవర్ నిద్ర పోయే పరిస్థితిని (మైక్రో స్లీపింగ్‌ను) సెన్సర్లు పసిగట్టి, అక్కడ ఉన్న అలారం మోగించి అప్రమత్తం చేస్తాయి. దీని వల్ల డ్రైవర్ నిద్రపోకుండా చేయడం ద్వారా ప్రమాదం తప్పే వీలు కలుగుతుంది. ఈ వ్యవస్థను స్టీరింగ్ వద్ద డ్యాష్‌బోర్డుతో అనుసంధానం చేస్తారు. ప్రయోగాశాలల్లో ఈ విధానం మంచి ఫలితాలు ఇచ్చింది. దీంతో ప్రోటోటైప్‌ను సిద్ధం చేశారు. క్షేత్ర పరీక్షలకు సిద్ధమైందని ఆయన తెలిపారు. అయితే తమ వద్ద క్షేత్ర పరీక్షలు చేసే వ్యవస్థ ఉండదని, కేవలం ప్రోటోటైప్ తయారు చేసి ఏదైనా సంస్థకు వాణిజ్యపరమైన ఉత్పత్తి చేసేందుకు టెక్నాలజీ బదలాయిస్తామని తెలిపారు. ప్రస్తుతం వాణిజ్యపరమైన ఉత్పత్తిచేసేందుకు అనువైన సంస్థను గుర్తించాల్సి ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రయోగాల అనంతరం ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. ఇందుకు సంవత్సర కాలం పట్టే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.