ఆంధ్రప్రదేశ్‌

బాలికలపై పెరిగిన అత్యాచారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 5: బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో బాలికలపై అత్యాచారాలు పెరిగాయని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నుంచి మహిళలు, ఆడపిల్లలను కాపాడుకోవాలని ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం దావలె అన్నారు. బీజేపీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్ నేరస్థులను కాపాడుతున్నాయన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరుగుతున్న ఐద్వా రాష్ట్ర మహాసభల్లో పాల్గొనడానికి వచ్చిన ఆమె శుక్రవారం విలేఖర్లతో మాట్లాడారు. ఐద్వా 14వ రాష్ట్ర మహాసభలు దేశంలో మహిళలపై జరుగుతున్న హింస, మహిళల భద్రత, ఆడపిల్లల భద్రత గురించి చర్చించాయన్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్టు ప్రకారం ప్రతి నలుగురు రేపిస్టుల్లో ముగ్గురు శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారన్నారు. అత్యాచారాలు చేసిన వారిని, పౌర హత్యలు చేసిన వారిని, అణగారిన తరగతులపై దాడిచేసిన వారిని బీజేపీ కంటికి రెప్పలా కాపాడుతోందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో పాఠశాలల నుంచి వస్తున్న బాలికను దుండగులు కిడ్నాప్ చేసి అత్యాచారంచేస్తే పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయలేదని ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొందరు పోలీసులు అతినీతిపరులుగా, గూండాలుగా, మతోన్మాదులుగా తయారవుతున్నారన్నారు.
దేశంలో ఆహార భద్రత కరువైందని దావలె అన్నారు. ఆధార్ బయోమెట్రిక్ వల్ల పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని, రేషన్ సరుకులు సక్రమంగా అందడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో మరోవైపు పౌష్టికాహారం లోపంవల్ల, కరవుతో పేదలు చనిపోతున్నారన్నారు. రక్తహీనతతో మాతాశిశు మరణాల సంఖ్య ఎక్కువవుతున్నాయన్నారు. మోదీ బేటీ బచావో, బేటీ పడావో అంటూ రకరకాల వాగ్దానాలు చేసి ప్రజలను ముంచేశారని ఆరోపించారు. నోట్ల రద్దువల్ల 90 లక్షల మంది ఉద్యోగులులు రోడ్డునపడ్డారన్నారు. అమిత్‌షా నిరుద్యోగులను పకోడీలు అమ్ముకోమని చెబుతున్నారని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా దేశంలో కనీసం కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. కేవలం కార్పొరేట్ కంపెనీలకు మేలుచేసే విధానాలు అవలంబించి, దేశంలో ఒక శాతం సంపన్నుల వద్ద 73 శాతం దేశ సంపద పోగుపడేలా చేశారని దావలె ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరలను రోజూ పెంచడంతో సెంచరీకి చేరువలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రధానిలా కాకుండా రాచరికం రాజులా, నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎటుచూసినా కుంభకోణాలేనని, అవినీతి పెరిగిపోయిందని, పెద్ద నోట్ల రద్దు, రాఫెల్ స్కామ్, జీఎస్టీ ఇలా ఎటు చూసినా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించి ప్రజలను నట్టేట ముంచారన్నారు.
అమిత్‌షా కొడుకు జయషా కంపెనీ ఆదాయం రూ.50వేలు ఉండగా ఏడాదిలో అనూహ్యంగా రూ.80 కోట్లకు పెరిగిపోయిందన్నారు. అక్రమాలకు పాల్పడకుండా జయషాకి ఇంత డబ్బు ఎలా వచ్చిందని దావలె ప్రశ్నించారు. బీజేపీ పాలక మనువాదులు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ మనుధర్మ శాస్త్రాన్ని ప్రజలపై రుద్దుతున్నారన్నారు. ఐద్వా జాతీయ కార్యదర్శి ఎస్ పుణ్యవతి మాట్లాడుతూ ఆశారామ్ బాపు బాలికలు, మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని దేశం కోడై కూస్తున్నా సరైన చర్యలు తీసుకున్న పరిస్థితులు లేవన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళా అధికారులపై దాడులు చేస్తున్నా చంద్రబాబునాయుడు వారి ప్రతినిధులకే మద్ధతు పలుకుతున్నారని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తహసిల్దారు వనజాక్షిపై ఎమ్మెల్యే దాడి చేసినా ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం దారుణమన్నారు. గోదావరి పక్కనే ఉన్నప్పటికీ తాగేందుకు మంచినీరు అందించలేని దారుణమైన పాలన సాగిస్తున్నారని విమర్శించారు. విలేఖర్ల సమావేశంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి, జిల్లా కార్యదర్శి పి తులసి పాల్గొన్నారు.