ఆంధ్రప్రదేశ్‌

సీవీసీ విచారణ జరిపితే కొందరు మంత్రులు ఇంటికే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 5: పోలవరం ప్రాజెక్టు సహాయ పునరావాస (ఆర్‌అండ్‌ఆర్) ప్యాకేజిలో జరిగిన అవకతవకలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)తో విచారణ జరిపిస్తే అవినీతి అక్రమాలు బయటపడి కొంతమంది మంత్రులు రాజీనామాలు తప్పవని బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడికి, పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 6,500 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ పోలవరం యాత్ర బస్సులకు సైతం తెలుగుదేశం జెండాలు కడుతున్నారని విమర్శించారు. పోలవరం యాత్ర బస్సులకు ప్రధాన మంత్రి ఫోటోలు పెట్టాలన్నారు. 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పునాది ఎందుకు వేయలేదన్నారు. 2004 తరువాత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పునాదివేశారని, ఆయన హయాంలో నిర్మాణమైన కుడి, ఎడమ కాలువలు వాడుకుంటూ నేడు చంద్రబాబు పోలవరం, సోమవారం అని డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. 2014 నుంచి 2016 వరకు అసలు పోలవరం పనులు చేయలేదని, 2017 నుంచి పనులు మొదలు పెట్టారన్నారు. పోలవరం అథారిటీని చంద్రబాబు నాయుడు లెక్కచేయడం లేదన్నారు. ప్రాజెక్టు పనులు బినామీలకు ఇవ్వాలని, ట్రాన్స్‌ట్రాయ్‌ను బొమ్మగా పెట్టి అనేక కంపెనీలను తెరమీదకు తెచ్చి భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు. పోలవరం ప్రాజెక్టును ఆదాయ వనరుగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో అవకతవకలపై విచారణ చేయాలని, దీనిపై బీజేపీ ఉద్యమం చేస్తుందన్నారు. కెఆర్‌పురం ఐటీడీఏ వద్ద ఆందోళన చేపడుతుందన్నారు. ధైర్యం ఉంటే చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో హంద్రీనీవా, తెలుగు గంగ ప్రాజెక్టులు పూర్తిచేయాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్రం 30వేల కోట్లు మంజూరు చేస్తే వాటిలో 13వేల కోట్లు కేవలం చెరువుల మట్టి తవ్వకాలకు చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఇంతకన్నా అవినీతి ఎక్కడైనా ఉంటుందా? అని వీర్రాజు ప్రశ్నించారు. మట్టిని అమ్ముకోవడం, మరుగుదొడ్లలో అవినీతి, ప్రాజెక్టుల్లో అవినీతి, చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతిలేని పథకమే లేదన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు కనుమరుగు కావడం ఖాయమన్నారు. అవినీతి సునామీలో తెలుగుదేశం కొట్టుకు పోతుందన్నారు. బీజేపీ ఆధారిత పార్టీ అధికారం చేపడుతుందని సోము పేర్కొన్నారు.

ఐటీ దాడులపై టీడీపీకి ఉలికిపాటెందుకు?
విజయవాడ: రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులపై తెలుగుదేశం పరిస్థితి గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుముకున్నట్లుగా ఉందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు ఆక్షేపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఉదయం నుంచి జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ దాడులపై టీడీపీ తీవ్రంగా స్పందించి గగ్గోలు పెడుతూ అత్యవసర సమావేశం నిర్వహించిన విషయాన్ని తప్పుబట్టారు. ఒకపక్క దాడులు జరిగినట్లు ప్రచారం జరుగుతుంటే కొందరు మంత్రులు దాడులు తమపై జరగలేదని అసత్యాలు పలుకుతున్నారన్నారు.
తమపై ఐటీ దాడులు జరగకుంటే టీడీపీ ప్రజాప్రతినిధులు, మంత్రులు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. పన్నులు ఎగగొట్టిన వారిపై ఐటీ అధికారుల దాడులను స్వాగతించాల్సి పోయి, తమపై కేంద్రం దాడులకు దిగుతుందని ఆరోపించడం చూస్తుంటే తప్పులు చేసినట్లు టీడీపీ ఒప్పుకుంటోందా అని ప్రశ్నించారు. అవినీతిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయని లక్షల కోట్ల అవినీతి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందన్నారు. దాడులను ఆపాలని కోర్టులను ఆశ్రయించినా ఉపయోగం ఉండదన్నారు. పన్నులను ఎగవేసి తప్పు చేసిన వారిని ప్రజలు క్షమించరన్నారు.
ప్రధానిగా మోదీ 2014 నుంచి అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ దేశంలో ఆర్థిక ప్రక్షాళనకు పూనుకున్నారని, పెద్దనోట్ల మార్పిడితో 3 లక్షల డొల్ల కంపెనీలను మూసివేయించారన్నారు. ప్రత్యక్ష పన్నులు చెల్లించే వారి సంఖ్యలో 50శాతం వృద్ధి కనిపిస్తోందని, బినామీ చట్టాన్ని 2016 నుంచి అమలు చేస్తున్నారని, నల్లధనం కలవారు, ప్రోత్సహించేవారు జైల్లో కూర్చోవాల్సిందే అన్నారు. రాజకీయ పార్టీ అండతో అవినీతి నుంచి బయటపడాలని ప్రయత్నిస్తే ప్రజలు తగిన బుద్ది చెబుతారని అన్నారు. అవినీతి చేసేవారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటే సంతోషించాల్సింది పోయి తప్పించుకోవాలని ప్రయత్నించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. టీడీపీ అక్రమాలు, అవినీతిపై చర్యలు తీసుకునేలా భాజపా ప్రజల్లోకి వెళ్తుందని హెచ్చరించారు.