ఆంధ్రప్రదేశ్‌

టాస్క్ఫోర్స్ సిబ్బందిపై స్మగ్లర్ల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, అక్టోబర్ 11: చిత్తూరు జిల్లా రేణిగుంట మండల పరిధిలోని కరకంబాడి, తిరుపతి మార్గమధ్యంలోని ఎల్‌ఐసీ భవనం వెనుక అడవిలోకి ప్రవేశిస్తున్న స్మగ్లర్లను అడ్డుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బందిపై స్మగ్లర్లు దాడికి యత్నించారు. దీంతో టాస్క్ఫోర్స్ సిబ్బంది ఆత్మరక్షణ కోసం రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక స్మగ్లర్‌ను అరెస్ట్‌చేసిన సంఘటన బుధవారం తెల్లవారుజామున కరకంబాడి వద్ద జరిగింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పోలీస్ వ్యవస్థ మొత్తం అక్కడే ఎక్కువ శాతం విధులు నిర్వహించడంతో ఈ సమయాన్ని అదనుగా చేసుకొని తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు కరకంబాడి వైపు ఉన్న అటవీ ప్రాంతం నుంచి శేషాచల అడవిలోకి వెళ్లి ఎర్రచందనం దుంగలను నరికి అక్రమరవాణాకు ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది కరకం బాడి అటవీ ప్రాంతం వద్ద కాపుకాయగా బుధవారం అర్థరాత్రి 40 మంది ఎర్రచందనం కూలీలు అడవుల్లోకి వెళ్లడానికి గుర్తించారు. వారిని పట్టుకోడానికి ప్రయత్నించే ప్రక్రియలో స్మగ్లర్లు టాస్క్ఫోర్స్ సిబ్బందిపై రాళ్లతో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో ఆత్మరక్షణలో భాగంగా రెండు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపామని, అప్పటి వరకు అడవిలోకి వెళ్లేందుకు ఉన్న స్మగ్లర్లు వారి వద్ద ఉన్న బియ్యం, కూరగాయలు, ఆహార పదార్థాలు, వంటకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, గుట్కాప్యాకెట్లు, బీడీలు, దుస్తులు పారివేసి అడవి నుంచి బయటకు పారిపోయారు.