ఆంధ్రప్రదేశ్‌

బాబు మళ్లీ సీఎం కావాలని... మంత్రి జవహర్ పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాళ్లపూడి, నవంబర్ 14: రాష్ట్రాన్ని జగన్, పవన్ అనే దుష్టగ్రహాల నుండి రక్షించాలని, రాష్ట్రాన్ని ముందుకు నడిపించే సత్తాగల చంద్రబాబునాయుడే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ బుధవారం ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలో ప్రారంభమైన ఈ యాత్ర మూడు రోజుల అనంతరం ద్వారకాతిరుమల చేరుకుంటుంది. బుధవారం ఉదయం అన్నదేవరపేటలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కొఠారు వెంకట్రావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఎంపీ మురళీమోహన్ జెండా ఊపగా మంత్రి పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో మంత్రికి ఎక్కడికక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎత్తయిన జెండాను పట్టుకుని మురళీమోహన్ పాదయాత్రలో పాల్గొని ఆకర్షణగా నిలిచారు. వేగేశ్వరపురంలో టీడీపీ అభిమాని వెంపా నాగేశ్వరరావు దంపతులు మంత్రి జవహర్‌కు, కొవ్వూరు మున్సిపల్ ఛైర్మన్ రాథారాణికి హారతులిచ్చి స్వాగతం పలికారు. కొన్ని చోట్ల మంత్రికి అభిమానులు పాదాభివందనం చేశారు. గ్రామగ్రామన పాదయాత్రలో ఎదురైన ప్రతివారిని మంత్రి పలకరిస్తూ హుషారుగా ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, మాజీ ఎంపీపీ కొప్పాక కోట్నేష్, కాకర్ల వంశీ, అనపర్తి పరమేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షుడు నాయుడు హనుమంతరావు, నామన పరమేశ్వరరావు పాల్గొన్నారు.