ఆంధ్రప్రదేశ్‌

రైతుకు పరిహారం చెల్లించేందుకు తహశీల్ కార్యాలయం వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లచెరువు, నవంబర్ 14: రైతుకు పరిహారం చెల్లించేందుకు ఏకంగా తహసీల్దార్ కార్యాలయానే్న వేలం వేసిన సంఘటన అనంతపురం జిల్లా కదిరిలో బుధవారం జరిగింది. కదిరి డివిజన్‌లోని నల్లచెరువు తహసీల్దార్ కార్యాలయాన్ని కదిరి సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో బుధవారం వేలం వేశారు. రూ.10.20 లక్షలకు దీన్ని ఓ వైకాపా నేత సొంతం చేసుకున్నారు. సంచలనం రేపిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లచెరువు మండలం పల్లెవాండ్లపల్లికి చెందిన రైతు రామిరెడ్డి 1988లో పేదలకు ఇళ్ల పట్టాల కోసం తన వద్ద ఉన్న 5.26 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. ఎకరాకు రూ. 10 వేలు పరిహారం ఇచ్చేలా అప్పట్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే అధికారులు ఎకరాకు కేవలం రూ. 3,600 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ రైతు కోర్టును ఆశ్రయించాడు. దాదాపు 30 ఏళ్ల పాటు రామిరెడ్డి కోర్టు చుట్టూ తిరిగారు. రామిరెడ్డికి మిగతా సొమ్ము చెల్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రైతు తిరిగి కోర్టును ఆశ్రయించాడు. దీంతో తహసీల్దార్ కార్యాలయాన్ని నవంబర్ 14న వేలం వేసి రైతుకు పరిహారం చెల్లించాలని కదిరి కోర్టు గత నెల 5వ తేదీ ఆదేశాలు జారీ చేసింది. అయినా అధికారుల్లో ఎలాంటి స్పందన లేకపోవడంతో బుధవారం సాయంత్రం కదిరి సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో నల్లచెరువు తహసీల్దార్ కార్యాలయం వేలం పాట నిర్వహించారు. ఇందులో ఆరుగురు పాల్గొనగా నల్లచెరువుకు చెందిన వైకాపా నేత దశరథరామయ్య నాయుడు రూ. 10.20 లక్షలకు కార్యాలయాన్ని దక్కించుకున్నారు. ఇన్నాళ్లకు తమకు న్యాయం జరిగిందని బాధితుడు రామిరెడ్డి అన్నారు.
తహశీల్దార్ రంగప్ప వివరణ
కోర్టు తీర్పుపై నల్లచెరువు తహసీల్దార్ రంగప్ప వివరణ ఇస్తూ రైతు రామిరెడ్డికి చెల్లించాల్సిన పరిహారంపై కోర్టు ఉత్తర్వుల మేరకు కలెక్టర్‌కు నివేదిక పంపామన్నారు. దీంతో స్పందించిన కలెక్టర్ బాధితుడికి ఇచ్చేందుకు రూ.1.34 లక్షలకు చెక్కు పంపారన్నారు. ఆ చెక్కును గత శుక్రవారమే స్థానికంగా బ్యాంకులో జమచేశామన్నారు. అయితే సర్వర్ సమస్య వల్ల బ్యాంకులో ఆ మొత్తం జమ కాలేదన్నారు. దీంతో బుధవారంలోగా బాధితుడికి డబ్బు అందించలేకపోయామన్నారు. బ్యాంకులో డబ్బు జమ కాగానే కోర్టు ద్వారా బాధితుడికి సొమ్ము అందజేస్తామని ఆయన వివరించారు.