ఆంధ్రప్రదేశ్‌

పల్లెటూర్లు... ప్రగతి రహదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 15: పల్లెటూర్లను ప్రగతి రహదారులుగా తీర్చిదిద్దాలని, రాష్ట్రంలో రహదారి లేని ఊరు ఉండకూడదనేది తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. గ్రామీణ బీటీ రోడ్ల మరమ్మతులను 2568 కోట్ల రూపాయలతో, 3576 కోట్ల రూపాయలతో కొత్త రోడ్లను నిర్మించేందుకు నిర్ణయించామని ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిధులతో గ్రామాల్లోని 22,283 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లకు మరమ్మతులు చేపడుతామని తెలిపారు. ఏఐఐబి నిధులు 3576 కోట్ల రూపాయలతో 4826 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లను నిర్మించనున్నామన్నారు. ఈ మేరకు 50 ప్యాకేజీల్లో 15 ప్యాకేజీల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, డిసెంబర్ మొదటి వారంలోగా మిగిలిన పనుల బిడ్డింగ్ పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు.
రూ.216 కోట్లతో అన్ని గ్రామాల్లో వైఫై సౌకర్యం
వెలగపూడి సచివాలయంలో ఏపీ ఎల్‌ఈడీ ప్రాజెక్టు, రూరల్ వైఫై, స్వచ్చ్ధారా, ఎన్టీఆర్ జలసిరి, ఉపాధి హామీ పథకాలపై కూడా మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో ఉచితంగా వైఫై సౌకర్యం కల్పించాలన్నారు.
ఫైబర్ గ్రిడ్‌తో అనుసంధానం చేసుకుని అన్ని గ్రామాలకు ఈ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. వివిధ శాఖలు వైఫై సౌకర్యం వినియోగించుకునే వీలు ఉంది కనుక, అన్ని శాఖలను సమన్వయం చేయాలన్నారు. మొదటి దశలో 12,918 గ్రామాలకు మార్చి 2019 నాటికి పూర్తి చేయాలన్నారు. రెండో దశలో 450 గ్రామాలకు జూన్ 2019 నాటికి పూర్తి చేయాలన్నారు. వచ్చే జనవరి నాటికి రాష్ట్రంలో 23.9 లక్షల ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. సీసీఎంఎస్ బాక్స్‌లను ఏర్పాటు చేసి డ్యాష్ బోర్డుకు అనుసంధానం చేయాలన్నారు. అలర్ట్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించాలన్నారు. బల్బు వెలగడం లేదన్న ఫిర్యాదు రాగానే యుద్ధప్రాతిపదికన పరిష్కరించే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. నేషనల్ రూ-అర్బన్ మిషన్ కింద 529 కోట్ల రూపాయలతో పనులు చేపట్టగా, ఇప్పటి వరకూ 3668 పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. మిగిలిన పనులు కూడా వచ్చే జనవరి నాటికి పూర్తి చేయాలన్నారు. కర్నూల్, కడప నుంచి ఉపాధి కోసం వలస వెళ్తున్నారని తెలుస్తోందని, దీనిని పరిశీలించి, ఉపాధి కల్పించాలన్నారు.
20 లక్షల రూపాయల కంటే తక్కువ చేసిన గ్రామాలకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. వచ్చే మార్చి నాటికి 20 లక్షల కన్నా తక్కువ ఉపాధి పనులు చేసిన గ్రామాలు ఉండకూడదని స్పష్టం చేశారు. 3 స్టార్ కంటే తక్కువ రేటింగ్ ఉన్న 574 గ్రామాల అభివృద్ధికి కార్యాచరం సిద్ధం చేయాలని ఆదేశించారు. మియావాకి విధానంలో ప్రతి గ్రామంలో 10 ఎకరాల్లో మొక్కలు పెంచాలని స్పష్టం చేశారు.