ఆంధ్రప్రదేశ్‌

పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 17: ధాన్యం కొనుగోళ్లలో తలెత్తుతున్న ఇబ్బందులపై రైతుల నుంచి వచ్చిన వినతుల పట్ల రాష్ట్రప్రభుత్వం సానుకూలంగా ఉందని, పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టంచేశారు. శనివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మంత్రి పుల్లారావు మాట్లాడారు.
ధాన్యాన్ని గత విధానం ద్వారానే కొనుగోలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని, మిల్లర్ల సమస్యలను పరిష్కరిస్తామని, మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం లేదని ప్రకటించారు. సీఎంఆర్ కింద రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి బియ్యం పంపేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం లేదన్నారు. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న బిల్లింగ్ పాలసీకారణంగా మిల్లర్లపై ఆర్థికభారం పడుతుందని, మిల్లర్ల వినతిమేరకు రూ.15 నుంచి 10 రూపాయలకు బిల్లింగ్ పాలసీ తగ్గించాలంటూ కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని, రాష్ట్రంలోని ప్రతి రైతు సంతోషంగా ఉండాలనేదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తావివ్వకుండా రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో కొన్ని నిబంధనలను ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. వాటివలన ఇబ్బందులు తలెత్తుతున్న విషయాన్ని రైతులు తమ దృష్టికి తీసుకురావడంతో సీఎం సానుకూలంగా స్పందించి రైతుల శ్రేయస్సు దృష్ట్యా నిబంధనలను సడలించారన్నారు. పాత పద్ధతిలోనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ధాన్యం అమ్మకాల సమయంలో రైతులు ఉండాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టంచేశారు. గత ఏడాది మాదిరిగా జిల్లాను యూనిట్‌గా తీసుకుని ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని, గత ఏడాది కంటే వరికి 200 రూపాయలు అధిక ధర చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు నష్టపోకూడదనే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు అందజేస్తున్నామని, 2014 నుంచి రాష్టవ్య్రాప్తంగా 25 లక్షల కార్డులు పంపిణీ చేశామన్నారు. గత ఆరునెలల్లో 3.50 లక్షల కార్డులు, గత నెలలో 2.35 లక్షల కార్డులు అర్హులకు అందించామన్నారు. నూతన కార్డులకు డిసెంబర్ నుండి సరుకులు అందిస్తామని మంత్రి పుల్లారావు తెలిపారు.