ఆంధ్రప్రదేశ్‌

వ్యవస్థలపై నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, నవంబర్ 17: దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి కోరారు. శనివారం అనంతపురం జిల్లా మడకశిరలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమవేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సమ్మతి పత్రాలను ఉపసంహరించుకోవడం ప్రధాని నిర్వాకం వల్లే జరిగిందన్నారు.
ఇందుకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి దేశ ప్రజలందరికీ రాజ్యాంగ వ్యవస్థపై నమ్మకం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం కొన్ని వ్యవస్థలను ఆట వస్తువులుగా మార్చుకుని అనవసరమైన వ్యక్తిగత దాడులు చేయిస్తూ కక్ష సాధింపు చర్యలు కొనసాగించడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. రాఫెల్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. దీనికి దేశంలోని అన్ని పార్టీలు కలిసి రావాలన్నారు. అలా రాని పార్టీలు బీజేపీ ప్రభుత్వానికి బానిసలుగా భావించాల్సి వస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్ జగన్‌పై దాడి సంఘటనకు సంబంధించి పోలీసు దర్యాప్తు నిరాకరించడం వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఏఐసీసీ కార్యదర్శి మునియప్ప మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ బలోపేతానికి గ్రామస్థాయి నుండి బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.
2019లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే ఎపీకి ప్రత్యేక హోదాపై మొదటి సంతకం చేస్తామని ఇప్పటికే రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో పొత్తుల గురించి ఎక్కడా చర్చలు జరగలేదని, 2019లో అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే విధంగా నేతలు, కార్యకర్తలు సన్నద్ధం కావాలన్నారు. ఈ సందర్భంగా ఎఐసీసీ కార్యదర్శి మునియప్పను స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, నాయకులు అక్రంఖాన్, ఈశ్వరప్ప, నాగేంద్ర, నారాయణప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు.