ఆంధ్రప్రదేశ్‌

19న నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11 రాకెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, డిసెంబర్ 2: రెండు వారాల వ్యవధిలోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈనెల 19న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టే జీశాట్-7ఏ ఉపగ్రహం ఆదివారం షార్‌కు చేరింది. బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుంచి రోడ్డు మార్గాన పోలీస్, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది భారీ భద్రత నడుమ ప్రత్యేక వాహనంలో శ్రీహరికోటకు తీసుకొచ్చారు. ఉపగ్రహాన్ని శాటిటైల్ క్లీన్‌రూమ్‌లో పెట్టి తుది పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రయోగ వేదిక వద్దకు తీసుకెళ్లి రాకెట్ శిఖర భాగాన అమర్చనున్నారు. కమ్యూనికేషన్ రంగానికి చెందిన ఈ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో రెండు వారాల వ్యవధిలోనే ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ఈసారి నెల వ్యవధిలోనే మూడో ప్రయోగానికి ఇస్రో సన్నద్ధమవడం విశేషం. నవంబర్ 14న జీఎస్‌ఎల్‌వీ మార్క్3-డీ 2, నవంబర్ 29న పీఎస్‌ఎల్‌వీ-సీ 43 ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. మళ్లీ పక్షం రోజులకు మరో ప్రయోగం చేపట్టేందుకు శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేస్తుండటం విశేషం.