ఆంధ్రప్రదేశ్‌

గోబెల్స్‌ను మించిన జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 22: అవాస్తవ..అసత్య ప్రచారాలలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ అండ్ కో గోబెల్స్‌ను మించిపోయారని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ తన అసత్య ప్రచారాల కోసం గోబెల్స్‌ను ప్రయోగించాడని అదే తరహాలో దుష్ప్రచారాలతో టీడీపీపై వైసీపీ బురదజల్లుతోందని శనివారం ఒక ప్రకటనలో యనమల ధ్వజమెత్తారు. అయితే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయి హిట్లర్‌తో పాటు గోబెల్స్ ఆత్మహత్యకు పాల్పడిన చందంగానే వచ్చే ఎన్నికల తరువాత జగన్ ఆయన ప్రచార సాధనాలు కనుమరుగు అవుతాయని వ్యాఖ్యానించారు. ప్రజల్లో అపోహలు సృష్టించాలనే జగన్ కుట్రలు ఇకపై సాగవన్నారు. బీజేపీ పంచన చేరిన జగన్ టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జాతీయ రాజకీయాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మామూలుగా చర్చించిన దానికి చిలువలు పలువలుగా ప్రచారం చేయడం హేయమన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఏకం చేయగలిగిన శక్తి తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందన్నారు. ఇదే అంశం చరిత్రలో రుజువైనప్పటికీ జగన్ అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారని ఆరోపించారు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్‌ల ఏర్పాటు వెనుక టీడీపీ ప్రధాన భూమిక వహించిందని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల అనంతరం ప్రధానమంత్రిని నిర్ణయించేది కూడా తమ పార్టీయే అన్నారు. 2019 తరువాత కేంద్రంలో ఏర్పడేది నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ప్రభుత్వంగా చెప్పారు. తమ పార్టీకి ఎవరి పంచన చేరాల్సిన అగత్యం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు. అది గ్రహించే జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ చుట్టూ, ప్రధానమంత్రి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నదెవరో ప్రజలకు తెలుసన్నారు. తండ్రి అంత్యక్రియలు జరక్కుండానే సీఎం పదవి కోసం సోనియా కాళ్లు పట్టుకున్నారని, తరువాత జైలుకు వెళ్లి బెయిల్ కోసం మరోసారి మోకరిల్లారని ఇప్పుడు బీజేపీ పంచన చేరారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో తమ పార్టీ తెగదెంపులు చేసుకుందని స్పష్టంచేశారు. పెళ్లిళ్ల ప్రస్తావన చిత్తచాంచల్యంతోనే చేస్తున్నారని విమర్శించారు. పెళ్లిళ్ల గురించి, పెళ్లాల గురించి జగన్‌కే తెలియాలన్నారు. నేర చరిత్ర కలిగిన ఆయనకు టీడీపీని, ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు.