ఆంధ్రప్రదేశ్‌

ఆదివాసీలను ఆదరించిన బోథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి
===========
బోథ్ నియోజకవర్గం 1967లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా బోథ్ నియోజకవర్గం
ఎస్టీలకు రిజర్వుడ్ అయింది. ఇందులో 1967 నుండి 1972 వరకు జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవుషా గెలుపొందగా 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అమర్‌సింగ్ తిలావత్ గెలుపొంది మంత్రిగా కొనసాగారు. 1983లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జోహర్ల కాశిరాం గెలుపొందారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బోథ్ నియోజకవర్గం 1985లో ఏర్పాటైనా తెలుగుదేశం పార్టీ రాకతో బీటలు వారింది. 1985లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిడాం భీంరావుపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన గొడం రామారావు విజయదుందుబి మోగించారు.
1994 వరకు గొడం రామారావు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవిలో కొనసాగారు.
ఇచ్చోడ, నవంబర్ 14: బోథ్ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గంలోని ఓటర్లు ఆదివాసీలకే అందలం ఎక్కిస్తూ వచ్చారు. ఈ నియోజకవర్గం 1962లో ఆవిర్భవించగా అప్పట్లో బోథ్ అసెంబ్లీ జనరల్ స్థానం కావడంతో ఇక్కడి నుండి నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి సి.మాదవ్‌రెడ్డి మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆతర్వాత ఈ నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడ్ అసెంబ్లీ స్థానంగా గుర్తించడంతో తొమ్మిదిసార్లు ఆదివాసీ గోండు తెగకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు. ఆతర్వాత రెండుసార్లు లంబాడా సామాజిక వర్గం నుండి అభ్యర్థులు నియోజకవర్గంలో గెలుపొందారు. బోథ్ నియోజకవర్గం 1967లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా బోథ్ నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వుడ్ అయింది. ఇందులో 1967 నుండి 1972 వరకు జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవుషా గెలుపొందగా 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అమర్‌సింగ్ తిలావత్ గెలుపొంది మంత్రిగా కొనసాగారు. 1983లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జోహర్ల కాశిరాం గెలుపొందారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బోథ్ నియోజకవర్గం 1985లో ఏర్పాటైనా తెలుగుదేశం పార్టీ రాకతో బీటలు వారింది. 1985లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిడాం భీంరావుపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన గొడం రామారావు విజయదుందుబి మోగించారు. 1994 వరకు గొడం రామారావు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవిలో కొనసాగారు. అనంతరం 1994లో బోథ్ గొడం రామారావు తనయుడు గొడం నగేష్ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయ ప్రవేశం చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నుండి గొడం నగేష్‌కు టికెట్ దక్కడంతో ఆయన రెండుసార్లు నియోజకవర్గం నుండి గెలుపొంది మంత్రిగా కొనసాగారు. దాదాపుగా 20 సంవత్సరాల పాటు బోథ్ నియోజకవర్గాన్ని గొడం కుటుంబం పాలించింది. 2004లో జరిగిన ఎన్నికల్లో నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి సోయం బాపురావు పోటీచేసి తెలుగు దేశం పార్టీ అభ్యర్థి గొడం నగేష్‌ను ఓడించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావానికి ముందు టిడిపికి కంచుకోటగా ఉన్న బోథ్ టీఆర్‌ఎస్ రాకతో టిడిపి పార్టీ పట్టుకోల్పోయింది. బోథ్ నియోజకవర్గం నుండి గెలుపొందిన సోయం బాపురావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించిన సోయం బాపురావుకు టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ లంబాడా సామాజిక వర్గానికి చెందిన అనిల్ జాదవ్‌కు టికెట్ ఖరారు చేసింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి పోటీచేసిన గెడం నగేష్ కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ జాదవ్‌ను ఓడించారు.
2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా రాథోడ్ బాపురావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనిల్ జాదవ్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సోయం బాపురావు మధ్య హోరా హోరి పోటీ కొనసాగింది. ఈ ఎన్నికల్లో తెరాస పార్టీ నుండి పోటీ చేసిన రాథోడ్ బాపురావు గెలుపొందగా కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ జాదవ్, టిడిపి అభ్యర్థి సోయం బాపురావులకు దాదాపుగా సరిసమాన ఓట్లు పోలయ్యాయి. బోథ్ నియోజకవర్గంలో ఆదివాసీ గోండు అభ్యర్థులకే ఓటర్లు పలుమార్లు పట్టం కడుతూ రాగా మారుతున్న పరిస్థితులు, రాజకీయాలతో ఈ ట్రెండ్ మారింది. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారో వేచి చూడాల్సిందే.