రాష్ట్రీయం

హోదా వస్తుందన్న ఆశతోనే ఉన్నాం: గంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 30: రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందన్న ఆశతోనే ఉన్నామని, రాని పక్షంలో ఏం చేయాలన్న విషయమై ఆలోచిస్తామని మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం నీతి అయోగ్ పరిశీలనలో ఉందన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పార్లమెంట్‌లో ప్రకటించారన్నారు. కొన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న అభ్యర్థనల నేపథ్యంలో కీలక నిర్ణయం ప్రకటించడంలో జాప్యం జరుగుతోందని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాని పక్షంలో ఏ విధంగా చేస్తే రాష్ట్రానికి మేలు చేకూరుతుందో ఆలోచిస్తామన్నారు. ఇక బాక్సైట్ తవ్వకాల విషయంలో ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. బాక్సైట్ తవ్వకాల వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలు, ఇతర అంశాలతో పాటు, ఆర్థికంగా వచ్చే ప్రయోజనాలపై విస్తృతంగా చర్చించనున్నట్టు ఆయన వెల్లడించారు.