సబ్ ఫీచర్

కథ చెప్పటం ఓ కళ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలకు కథలు చెప్పటం అనేది సీరియస్‌గా తీసుకుని చేయాలి. అపుడే వారి విద్యాభివృద్ధికి, భాషాభివృద్ధికి దోహదం చేస్తుందని అంటున్నారు దీపాకిరణ్. హైదరాబాద్ నగరానికి చెందిన ఈ దీపాకిరణ్ అనే ఆన్‌లైన కథకురాలికి జాతీయ స్థాయి అవార్డు (2015-16) సంవత్సరానికి దక్కింది. కన్సార్టియం ఆఫ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ సంస్థ కథకులకు ఏటా పోటీ నిర్వహిస్తుంటారు. ఈ పోటీకి దీపాకిరణ్ తన వీడియోను పంపారు. ఈ పోటీల్లో ఆమెను బెస్ట్ ఈ సెంటర్ ప్రోగ్రామ్ విభాగంలో అవార్డు వరించింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ.. ఈ వీడియోను మూడు విభాగాలుగా చేసి పంపానని అన్నారు. తరగతి గదుల్లో పిల్లలకు పాఠాలతో పాటు నోటితో కథ చెప్పటం ఒక భాగమైతే.. పిల్లలకు కథలు చెప్పటం వల్ల వారిలో భాషాభివృద్ధికి టీచర్ ఏవిధంగా దోహదం చేస్తుందో మరొక భాగంగా చెప్పటం జరిగిందని దీపా వివరించారు. భరతనాట్యం, కూచిపూడి కళాకారిణి అయిన దీపా తన కథలలో పాటలు, నృత్యాలు జోడించి పిల్లలకు కథలు చెప్పిన తీరు పిల్లలకు నచ్చింది. ఈ వీడియోను ఇఎఫ్‌ఎల్‌యు క్యాంపస్‌లో రూపొందించారు. అంతేకాదు బీ.ఇడి, ఎం.ఇడీ విద్యార్థులకు దీపా గెస్ట్ లెక్చరర్‌గా వెళ్లి వారికి కథ ఎలా చెప్పాలో పాఠాలు బోధించారు. అంతేకాదు టీవీ షోల్లో సైతం విద్యార్థులకు కథలు చెప్పే విధానంపై ఎన్నో ప్రోగామ్స్ చేశారు. స్టోరీ ఆర్ట్స్ ఇండియా సంస్థను ఏర్పాటు చేసి ట్రైనీ టీచర్లు, కార్పొరేట్ ఉద్యోగులకు నేర్పుతుంది. ఇలా పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, వారిలో నైతిక, ధార్మిక విలువలను పెంపొందించేలా కథలు చెప్పటం ఒ కళ అని, దీనిని సీరియస్‌గా తీసుకుని చేయాలని దీపా అంటారు. బిడ్డకు తల్లే తొలి గురువు అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. పిల్లల్లో నవ్వులు పూయిస్తూ.. ఆ ఇంటిని ఆనందాల హరివిల్లుగా మార్చటం ఆధునిక తల్లి చేయాల్సిన బాధ్యతను ఈ వీడియో గుర్తుచేస్తుంది. ఇలాంటి వాతవరణాన్ని పిల్లల్లో సృష్టిస్తున్న దీపాకిరణ్ అనే ఈ యువతికి జాతీయ స్థాయి అవార్డు దక్కటం ఆమెకు కృషికి నిదర్శనంగా చెప్పవచ్చు.

చిత్రం:పిల్లలకు కథలు చెప్పటంపై రూపొందించిన వీడియో