చిత్తూరు

చిగురువాడ సమీపంలోని స్వర్ణముఖి నదిలో విద్యార్థి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే నా బిడ్డను బలిగొంది: తల్లిదండ్రుల ఆరోపణ
రామచంద్రాపురం, డిసెంబర్ 18: ఈత సరదా 13 సంవత్సరాల వయస్సు కలిగిన ఓ విద్యార్థి జీవితానికి శాపంగా మారిన సంఘటన శుక్రవారం దుర్గసముద్రంలో జరిగింది. ఓ రైతు కుటుంబానికి కడుపుకోత మిగిల్చింది. ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణాలను బలిగొందని విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి దుర్గసముద్రంకు చెందిన కోదండరామిరెడ్డి, శ్రీదేవి రైతు దంపతుల కుమారుడు సాయికుమార్ (13) స్థానిక ఉన్నత పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లాడు. మధ్యాహ్న భోజనం ముగించుకొని పాఠశాల నుంచి తనతోటి విద్యార్థులు ఆరుగురితో కలిసి చిగురువాడ సమీపంలో స్వర్ణముఖి నదిలోని ఈతకు వెళ్లాడు. ఈత కొడుతూ లోతు ప్రదేశంలోకి వెళ్లి ఊపిరాడక మునిగిపోతుంటే తోటి విద్యార్థులు కాపాడడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. వెంటనే కేకలు వేస్తూ పాఠశాలకు వెళ్లి ప్రదానోపాధ్యాయులు ఈశ్వరయ్యకు విషయం తెలిపారు. బోధన సిబ్బందితో కలిసి నది వద్దకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని ఎమ్మార్ పల్లి పోలీసులకు కూడా సమాచారంను అందించారు. స్థానికులతో కలిసి నదిలో వెతికిన సాయికుమార్ మృతదేహం కనపడలేదు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే తన కుమారుడిని బలిగొందని సాయికుమార్ తల్లిదండ్రులు రోదించారు. ఈ సంఘటన చూసిన వారికి కంటతడి పెట్టింది. ఎంఆర్‌పల్లి సిఐ మధు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.