Others

గాయాల ఆనవాళ్లు మందులతో మాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెగిన గాలిఫటాన్ని చూస్తూ ఆ పిల్లవాడు దానిని పట్టుకొనే ప్రయత్నంలో తన డాబాపైనుండి పక్క డాబాపైకి దూకాడు. ఏం కానంతవరకూ అంతా బానే వుంటుంది. ఇప్పటిదాకా బాగుంది, ఇకపై కూడా బాగుంటుందని అనుకొని దూకేడు. విధి చిన్న ట్విస్ట్ ఇచ్చింది. కాలు జారింది. ముఖంమీద పడి ముక్కు మూడు ముక్కలుగా విరిగింది. అవ్వడానికి అవ్వకపోవడానికి కేవలం నిమిషం చాలు.
ముఖానికి తగిలే దెబ్బలు
ఎకిమోసిస్ (Ecchymosis): బలంగా చర్మానికి తగిలినపుడు కొన్నిసార్లు పైచర్మానికి ఏం కాదు కాని ఆ చర్మం కింద వున్న రక్తకణాలు చిట్లి ఆ రక్తం పక్క ప్రదేశాల్లో ఇంకుతుంది. రక్తకణాలలోంచి బయటికి వచ్చిన రక్తానికి ఆక్సిజన్ అందక అది ఎరుపు రంగు కోల్పోయి నల్లగా మారుతుంది. అందుకే ఈ తరహా గాయాలు చూడడానికి నల్లగా కనిపిస్తాయి.
చికిత్స:ఏ చికిత్స అవసరం లేదు. ఆ రక్తం శరీరంలో ఇంకిపోగానే ఆ గాయం మానిపోతుంది. సుమారు వారం పది రోజులు పడుతుంది.
చర్మం చీలుకుపోవడం(ABRASION) ఈ తరహా గాయంలో చర్మం నేలకి రాసుకుపోవడం మూలాన పై చర్మం చీలుకుపోయి కింది చర్మం తెల్లగా కనిపిస్తుంది.
చికిత్స:మలాం రాస్తే వారం పది రోజులలో గాయం తగ్గి కొత్త చర్మం రావడం మొదలవుతుంది. కొత్త చర్మం పూర్తిగా రావడానికి మూడు వారాలు పడుతుంది. వచ్చిన చర్మం పక్క చర్మంకన్నా నల్లగా ఉండేందుకు ఆస్కారం ఉంది. అలా ఉంటే కంగారు పడాల్సిన పనిలేదు. మూడు నుంచి ఆరు నెలలో అది మామూలు రంగుకి వచ్చేస్తుంది. అప్పటికి రాని పక్షంలో డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.
కోసుకుపోవడం (LACERATION) ఈ తరహా గాయం పదునుగా ఉండే వస్తువుల వల్ల, గాలిపటం ఎగరేయడానికి వాడే మాంజా (దారం)వల్ల కలుగుతుంది. చర్మం పైనుంచి లోపలి వరకు కోసుకుపోతుంది.
చికిత్స:కుట్లు వేయవలసి వుంటుంది. వేసిన కుట్లు వారానికి తీసేస్తారు. గాయం మానాక గాటులా ఎత్తుగా నల్లగా కనిపిస్తే కొన్ని క్రీములు రాయవలసి ఉంటుంది. గాటు చాలా అందవికారంగా కనిపిస్తే స్పెషలిస్ట్‌ని కలిసి చికిత్స చేయించుకోవడం ఉత్తమం. కుట్లు సరిగా వేయని పక్షంలో గాయం గాటుగా మారేందుకు ఆస్కారం ఉంటుంది.
ఎముకలు విరగడం: చాలా బలంగా నేలపై కాని ఏదైనా వస్తువుపై కాని పడితే అప్పుడు ముఖంలోని దవడ ఎముకలు కాని, బుగ్గ ఎముకలు కాని, ముక్కు ఎముకలు కాని విరిగేందుకు ప్రమాదం ఉంది. ఈ తరహా గాయంలో కొన్నిసార్లు చర్మానికి పెద్దగా గాయం ఏం తగలకపోవచ్చు కాని లోని ఎముక విరిగి ఉండవచ్చు. ఎక్స్‌రే తీసి ఎముక విరిగిందా లేదా అన్నది నిర్థారించుకోవాలి. గాయం తరువాత మనం పళ్లు సరిగా కొరకలేకపోయినా, మింగడం, నోరు తెరవడం కష్టంగా ఉన్నా దవడ ఎముక విరిగిందేమోనన్న సందేహం కలగాలి. డాక్టర్‌కి చూపించుకొని ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకొని దానికి తగిన చికిత్స పొందాలి.
చికిత్స: ఏ ఎముక విరిగింది, ఎంత ఎక్కువగా విరిగింది అన్నదానిపై చికిత్స ఆధారపడి ఉంటుంది. చిన్న చిన్న విరుగుళ్లకి ఆపరేషన్ చేయనవసరం లేదు. ఆ విరిగిన ఎముకపై ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా, మెత్తటి ఆహారం మూడు లేక నాలుగు వారాలు తింటే సరిపోతుంది. ఇది చదివి చికిత్స అవసరమా అక్కర్లేదా అని మీ సొంత నిర్ణయాలు తీసుకోకండి. స్పెషలిస్టుని సంప్రదించి తను ఇలాంటి సూచన ఇస్తే పాటించండి. పరీక్షించిన స్పెషలిస్ట్‌దే తుది నిర్ణయం. ఎక్కువగా విరిగిన ఎముకలని వైర్ల ద్వారా లేక ప్లేట్, స్క్రూ ద్వారా శరీరానికి పూర్తి మత్తు ఇచ్చి అతికిస్తారు. ఈ ఆపరేషన్లు కొంచెం పెద్ద ఆపరేషనే్ల. ముఖానికి వాపు, నోరు తెరుచుకోకపోవడం- ఇలాంటివి ఓ వారం పది రోజులు ఉంటాయి. క్రమేపీ తగ్గుతాయి. వేసిన కుట్లు వారానికి తీసేస్తారు. ఎముకలు అతికించడానికి వాడిన వైర్లు, ప్లేట్లు ఇంక స్క్రూలు సాధారణంగా తీసే అవసరం రాదు. ఒక వేళ ఏ కారణం చేతనైనా తీయాల్సి వస్తే చిన్న ఆపరేషన్ చేసి తీయాల్సి ఉంటుంది.
చాలామందికి గాలిపటాలు ఎగరేయడం కంటే పట్టుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది. ‘‘బస్తీ మే సవాల్’ అనే టైప్‌లో ఉంటారు. ‘‘పోటీనా! ఆ గాలిపటం నేను పడతా’’ అంటే ‘‘లేదు నేను పడతా’’ అనేదాకా వారి వ్యవహారం నడుస్తుంది. గాలిపటం పట్టిన వాడి జోరు, హుషారు ఇక అడగక్కర్లేదు. వాడి వయసుకి, వాడి ఆలోచనకి వాడికి అదే ఆస్కార్, అదే వరల్డ్‌కప్. ఇలానే పోటీలోకి దిగిన ఆ పిల్లవాడు వాళ్ళ తాత మాట వినకుండా తెగిన గాలిపటాన్ని పట్టుకోవడానికి రోడ్డుమీద పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఎదురొచ్చిన వాహనాలని చూసుకోకుండా, కళ్లు ఆకాశానికి అతికించేసి ఉరుకులు పరుగులు పెడుతున్నాడు. ఆ గాలిపటం నేరుగా వచ్చి ఓ వైర్‌కి చుట్టుకుంది. ‘‘లేపరా, నన్ను లేపు’’ అని తనతోనే ఉన్న తన స్నేహితుడ్ని అడిగాడు. ఏం ఆలోచించకుండా ఆ అబ్బాయి ఈ పిల్లాడి లేపాడు. వైర్‌కి చుట్టిన దారాన్ని తీస్తూ ఆ వైర్‌ని ముట్టుకున్నాడు. అది హైటెన్షన్ కరెంట్ వైర్. అంతే ఇద్దరూ కాలిపోయారు. ‘సవాల్’ చేయడం మంచిదే కాని అది మన ‘జీవితానే్న సవాల్’ చేసేదిగా ఉడకూడదు.