సబ్ ఫీచర్

‘సంక్షేమం’ ఇక పారదర్శకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి దశాబ్దాల తరబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాలీనా లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అయితే, పేదరికం నిర్మూలన అనేది మిధ్య గానే మారింది. దీనికి ప్రధాన కారణం పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలలో అధిక శాతం అనర్హుల చేతిలోకి వెళ్ళడమే. సంక్షేమ పథకాలు అనర్హులకు అందకుండా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్’ (డిబిటి)ను అమలు చేయడం ప్రారంభించింది. వాస్తవంగా ఈ పథకాన్ని 2013లో అప్పటి యుపిఎ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. వరుసగా కుంభకోణాలు బయటకు రావడం, ఎన్నికలు సమీపించడంతో ఆ ప్రభుత్వం ఈ పథకం అమలు పట్ల అంత శ్రద్ధ చూపించలేదు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాత డి.బి.టి. అమలుకు ప్రత్యేక శ్రద్ధ చూపారు. దీంతో గత మూడు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సుమారు 50 వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం కాకుండా నిరోధించగలిగినట్లు కేంద్ర ప్రభుత్వం అంచనా. ప్రస్తుతం దేశంలో 64 మంత్రిత్వశాఖల కింద 533 సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయి. వీటిలో 17 మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 84 పథకాలను మాత్రమే ‘డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్’ కిందకు తీసుకువచ్చారు. ఈ 84 పథకాల అమలులోనే గత మూడు సంవత్సరాలలో 50వేల కోట్లు దుర్వినియోగం కాకుండా నిరోధించగలిగారంటే, 533 సంక్షేమ పథకాలకు కూడా డిబిటిని అమలుచేస్తే సంక్షేమ ఫలాలు అనర్హుల చేతిలోకి వెళ్ళే ప్రసక్తే ఉండదు. దీనివల్ల పేదరికం నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల పేదలకు మరింత ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.
డిబిటిని అమలు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అనర్హుల చేతిలో ఉన్న 2.33 కోట్ల రేషన్‌కార్డులను రద్దుచేశారు. దీంతో 14వేల కోట్ల రూపాయలు ఆదా అయింది. అదే విధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 7633 కోట్ల రూపాయలు దుర్వినియోగం కాకుండా నిరోధించగలిగారు. పహాల్ స్కీమ్ (ఎల్.పి.జి. గ్యాస్) ద్వారా ప్రభుత్వానికి 26,408 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. రానున్న ఆర్థిక సంవత్సరం నుంచి ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన్, అటల్ పెన్షన్ యోజన్, పి.ఎం.సురక్ష భీమా యోజన్, పి.ఎం. జీవన్ జ్యోతి బీమా యోజన్, పి.ఎం.క్రాప్ ఇన్స్యూరెన్స్ స్కీమ్, పి.ఎం.గ్రామీణ ఆవాస్ పథకాలను కూడా ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్’ పరిధిలోకి తీసుకురానున్నారు. సంక్షేమ పథకాలకన్నింటినీ డైరెక్ట్‌బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పథకంలోకి తీసుకురావడం ద్వారా, పేదరికం నిర్మూలనలో తనదైన శైలిని నిరూపించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారు.

- పి.భర్గవరామ్