సబ్ ఫీచర్

చూపులేకపోయనా చదువులో మిన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దర్శన’- పేరు బాగున్నా ఆమె అన్నింటినీ చూడలేదు. చిన్న వయసులోనే కంటి చూపు మసకబారింది. ఏది స్పషంగా చూడలేదు. పాఠం చదవాలంటే తప్పనిసరిగా బూతద్దం చేతపట్టుకుని ఒక్కొక్క లైను చదువుకుంటూ వెళుతుంది. చూపులేకపోతేనేమి ఆమె ఆత్మస్థయిర్యాన్ని చూసి ఆ చదువుల సరస్వతి కరుణించి నాలుకమీద కొలువుతీరింది. అందుకే సిబిఎస్‌ఇ పనె్నండవ తరగతి పరీక్షలో దేశంలోనే మూడవ ర్యాంక్ సాధించింది.
‘‘నాకు మూడవ ర్యాంక్ రావటం చాలా సంతోషంగా ఉంది.’’ అని అంటుంది తమిళనాడు కృష్ణగిరికి చెందిన దర్శన. ఆమెకు రెండు కళ్లలో చూపు మందగించింది. శుక్లాలు వచ్చాయి. కుడి కన్ను అసలు కనబడదు. ఎడమ కన్ను పాక్షికంగా కనిపిస్తుంది. కనీకనిపించని ఈ ఒక్క కంటితోనే ఆమె పుస్తకంపై బూతద్దం పెట్టుకుంటూ చదువుతుంది. నలంద ఇంటర్నేషనల్ పాఠశాలలో దర్శన 12వ తరగతి చదువుతుంది. కళ్లు లేకపోయినా ఆమె చదువుపట్ల చూపుతున్న శ్రద్ధను గమనించిన టీచర్లు, తల్లిదండ్రులు నిరంతరం ప్రోత్సహించేవారు. పరీక్షలలో కష్టపడి చదవాలని నిర్ణయించుకుని శ్రద్ధ కనబరిచింది. అందుకే మూడో ర్యాంక్ సాధించగలిగింది. కర్నాటక సంగీతం నేర్చుకుంటున్న దర్శని భవిష్యత్తులో చెన్నైలో బీకాం పూర్తిచేసి వ్యాపార రంగంలోకి అడుగుపెడతానని చెబుతుంది. అంతేకాదు కర్నాటక సంగీతం నేర్చుకుంటానని తెలియజేస్తోంది.