సబ్ ఫీచర్

ఆలయాలపై సర్కారు ఆధిపత్యం ఎన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో లౌకికవాదం గురించిన చర్చ అంతా అల్పసంఖ్యాక వర్గాలవారి హక్కుల గురించి, వారి వ్యక్తిగత చట్టాలు పరిరక్షణ గురించి, వివిధ మతాలవారు కలిసి జీవించటం గురించి మాత్రమే జ రుగుతోంది. హిందూ ధార్మిక సంస్థలు, దేవాలయాలపై ప్రభుత్వాలు చేస్తున్న పెత్తనం గురించి ఈ చర్చ ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. ఇతర మతాలవారి విషయాల్లో ప్రభుత్వ జోక్యం లేదు. హిందూ ఆలయాలు, ధార్మిక సంస్థల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం అవసరమా? జోక్యం ఉంటే ఎంతమేరకు ఉండాలి? ఏ పరిస్థితులలో ఉండాలి? అన్న దానిపై చర్చ అవసరం. ఇటీవల ఏపీ దేవాలయ, ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ- అసలు ప్రభుత్వాలు, దేవాలయాలు నిర్వహించటం ఎంతవరకు సబబు? లౌకికవాద ప్రభుత్వం దేవాలయాలను నిర్వహించవచ్చా’ అన్న చర్చకు తెరదీశారు. కీలకమైన ఆర్థిక, పారిశ్రామిక రంగాలనుండే ప్రభుత్వం తప్పుకుంటున్నపుడు ధార్మిక సంస్థల, దేవాలయాల నిర్వహణ నుండి కూడా ప్రభుత్వం తప్పుకోవటం అనివార్యం. ప్రసిద్ధ న్యాయకోవిదులు నారీమన్, రాజీవ్ ధావన్‌లు ప్రభుత్వమే నేరుగా దేవాలయాల నిర్వహణకు పూనుకోవటం, ధర్మకర్తల మండళ్ళను నియమించటం, దేవాలయ భూములను, నిధులను ధార్మికేతర కార్యక్రమాలకు వినియోగించడం మతస్వేచ్ఛకు, మత ప్రమేయం లేని రాజ్య భావనకు వ్యతిరేకమే కాకుండా, ఇది హిందూ దేవాలయాల జాతీయకరణ మాత్రమేనని వ్యాఖ్యానించారు.
గతంలో హిందూ రాజులు మత విషయాల్లో జోక్యం చేసుకున్నమాట నిజమే. అనేక దేవాలయాలను వారు నిర్మించి, వాటి నిర్వహణకు ఉదారంగా భూములను ఇచ్చారు. పూజారులకు, యాత్రికులకు వసతులు కల్పించారు. నిత్య ధూప దీప నైవేద్యాలకు లోటు లేకుండా పోషించారు. ఆగమ శాస్త్ర ప్రకారం రోజువారి కార్యక్రమాలు సక్రమంగా జరిగేటట్లు అజమాయిషీ చేశారు. అయినా దేవాలయాల నిర్వహణను భక్తులకు, పండితులకు, మత పెద్దలకు వదిలివేశారు. ముస్లిం దురాక్రమణదారులు అనేక దేవాలయాలను ధ్వంసం చేసి కొల్లగొట్టినా, మిగిలిన దేవాలయాల నిర్వహణ విషయాన్ని స్థానికులకే వదిలివేశారు. ఈస్టిండియా కంపెనీవారు 1810, 1817లలో తీసుకుని వచ్చిన చట్టాల ద్వారా ధార్మిక సంస్థలపై అజమాయిషీ అధికారాలను రెవెన్యూ బోర్డుకు అప్పగించారు. వారు హిందూ ముస్లిం సంస్థలను ఒక్కటిగానే చూశారు. అలనాడు ధార్మిక సంస్థలపై ప్రభుత్వ పర్యవేక్షణను చాలామంది స్వాగతించారు. 1863లో తిరిగి ధార్మిక సంస్థలపై ప్రభుత్వ అజమాయిషీకి వీలు కల్గిస్తూ ఒక సమగ్ర చట్టాన్ని తీసుకొని వచ్చారు. 1919లో వచ్చిన ఇండియా చట్టం ద్వారా కేంద్ర, రాష్ట్ర విధాన సభల ద్వారా భారతీయ ప్రతినిధులే తమకున్న పరిమిత అధికారాలను ఉపయోగించుకొని కొన్ని అంశాలపై చట్టం చేసే అవకాశం కల్పించారు. దాని ఫలితంగా హిందూ దేవాలయాలు, ధార్మిక సంస్థలకే పరిమితమైన ఒక చట్టాన్ని 1927లో మద్రాసు శాసనసభ తీసుకొని వచ్చింది. దేవాలయాల పర్యవేక్షణకు, అజమాయిషీకి ఒక కమిషనర్ల బోర్డును ఏర్పాటుచేసి, విశేషమైన అధికారాలను కట్టబెట్టారు. ఏ దేవాలయమునైనా తమ అధీనంలోకి తెచ్చుకొనే అధికారం ఈబోర్డుకు ఇచ్చారు. హిందూ దేవాలయాల జాతీరుూకరణ ప్రక్రియ ఈ చట్టంతోనే ప్రారంభమైంది.
రెండు దశాబ్దాల తర్వాత కొత్త రాజ్యాంగాన్ని వ్రాసుకొని, అమలులోకి తెచ్చుకొన్నపుడు హిందూ దేవాలయా ల, ధార్మిక సంస్థల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆనాటి పెద్దలు భావించలేదు. 1951లో మద్రాసు ప్రభుత్వం తీసుకొని వచ్చిన హిందూ దేవాదాయ, ధర్మాదాయ చట్టం హిందూ ధార్మిక సంస్థలపై విశేష అధికారాలను రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెట్టింది. హిందూ సంస్థలపై అజమాయిషీకి ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఒక దేవాదాయ శాఖను ఏర్పాటుచేశారు. పర్యవేక్షణకు మాత్రమే పరిమితం కాకుండా దేవాలయాలకు సం బంధించిన అన్ని వ్యవహారాల్లో తలదూర్చే విశేష అధికారాలు ప్రభుత్వానికి దఖలు చేసింది. ఆ చట్టంలోని కొన్ని సెక్షన్లను రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30 వేలకు పైగా దేవాలయాలను నిర్వహిస్తున్నది. వేలాది ఎకరాలు దేవాలయ భూములను ప్రభుత్వం కాపాడలేకపోతున్నది. వాటికి నామమాత్రం కౌలుకు ఇస్తున్నారు. వామపక్షాలు వారు కౌలుదారులకే వాటిమీద హక్కు కల్పించాలని ఉద్యమాలు చేశారు. ఎన్‌టి రామారావు ప్రభు త్వం చల్లా కొండయ్య కమిషన్‌ను నియమించి ఆలయ భూముములను బహిరంగ వే లం ద్వారా అన్యాక్రాంతం చెయ్యటానికి పూనుకొంది. ఏ కారణంగానో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. నాస్తికులను, హైందవేతరులను, అవిశ్వాసులను, పాలకపక్ష కార్యకర్తలను, వారు వీరు అని తేడా లేకుండా దేవాలయ ధర్మకర్తలుగా నియమిస్తూ వ చ్చారు. మత పెద్దలకు, పీఠాధిపతులకు, భక్తులకు, దాతలకు పాలక మండళ్ళలో ప్రాధాన్యత లేదు. రాజకీయాలకు, కులానికే ప్రాధాన్యత. అన్ని దేవాలయాల్లోనూ వ్యాపార సరళిని పెంచి పోషిస్తున్నారు. దర్శనానికి, అర్చనలకు భక్తులనుండి ముక్కు పిండి రుసుములు వసూలు చేస్తున్నారు. ఆగమ ధర్మ శాస్త్రాలకు విరుద్ధంగా దేవాలయాలను నిర్వహిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించేందుకు కూడా వీలుకాని పరిస్థితి. చర్చిలు, మసీదుల నిర్వహణలో జోక్యం చేసుకోవడానికి ఏ మాత్రం సాహసం చేయని ప్రభుత్వాలు హిందూ దేవాలయాలపై ఎందుకు ఇంత పెత్తనం చేస్తున్నాయి? ఇది కచ్చితంగా మతానికి, రాజ్యానికి మధ్య ఉండవలసిన సూత్రబద్ధమైన దూరానికి వ్యతిరేకం.
జాతీయం చేసిన పరిశ్రమలను, రంగాలను సంస్కరణల పేరుతో ప్రైవేటుపరం చేస్తున్న ప్రభుత్వాలు హిందూ దేవాలయాల, ధార్మిక సంస్థల పెత్తనం నుండి తప్పుకోవాలి. హిందూ సంస్థలను హిందువులకే అప్పగించాలి. జాతీయం చేసిన హిందూ దేవాలయాలను హైందవీకరణ చెయ్యాలి. హిందూ సంస్థల పట్ల కొనసాగుతున్న వివక్షకు ముగింపు పలకాలి. మన వేళ్ళతో మన కళ్ళు పొడుచుకునే ధోరణికి చరమగీతం పాడాలి.

-డా బి.సారంగపాణి