సబ్ ఫీచర్

అండాపై అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్డు పెంకులపై అద్భుతాలను సృష్టిస్తున్నాడు ఈ యువకుడు. గుడ్డుఆరోగ్యానికే కాదు అందమైన ఆకృతులను తయారుచేయవచ్చు అని నిరూపిస్తున్నాడు. గుడ్డును వాడిన తరువాత పెంకులను పడేస్తుంటాం. కాని శంషుద్దీన్ షేక్ మాత్రం పదిలంగా దాచి అందమైన ఆకృతులతో మళ్లీ ప్రాణం పోస్తున్నాడు. గుడ్డుపై చేస్తున్న ఆర్ట్‌తో ఈ బెంగుళూరు యువకుడు ప్రపంచ రికార్డులు సృష్టించాడు. ఇప్పటివరకు పదిహేను ప్రదర్శనలు నిర్వహించాడు. మూడేళ్ల క్రితం హాబీగా నేర్చుకున్న ఈ కళ ఇపుడు అతన్ని ఉన్నత శిఖరాలకు చేర్చటమే కాదు పర్యావరణ అభిమానిగా మార్చివేసింది. ఇంటర్నెట్‌లో చూసి ఆసక్తిగా నేర్చుకున్న కళను అంతే సహనంతో ఆకృతులను మలుస్తున్నాడు. గుడ్డుపై అద్భుతమైన ఆర్ట్ వేయాలంటే సామాన్య విషయం కాదు. ఆసక్తితో పాటు ఛాలెంజ్‌గా తీసుకోవాలంటాడు. అంతేకాదు సహనం, ఖచ్చితంగా ఆర్ట్ వేయాలనే దృక్పధం ఉండాలని చెబుతుంటాడు. గుడ్లతో పొడవైన టవర్‌ను తయారుచేస్తాడు. జఠిలమైన ఆర్ట్‌ను సైతం బాతు గుడ్లపై వేసేయ్యటం శంషుద్దీన్‌కు వెన్నతో పెట్టిన విద్య. గుడ్డు పెలుసుగా ఉండి పగిలిపోతుంటాయి. కాని ఎంతో సహనంతో వేస్తాడు.బాతు, కోడి, నెమలి, ఈమూ గుడ్లపైనే కాదు చిన్న చిన్న పిట్లల గుడ్లపై కూడా ఆకట్టుకునే విధంగా ఆర్ట్ వేస్తాడు. సాధారణమైన టెక్నిక్స్‌తో చెక్కటానికి అనువైన హైస్పీడ్ డ్రిల్లింగ్ సాధనంతో అందాలకు మెరుగులు దిద్దుతానని, యాక్రిలిక్ పెయంట్స్‌ను వాడతానని చెబుతున్నాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహాంతో ఈ కళను ఇలా మెరుగులు దిద్దుకుంటున్నానని చెబుతూ.. పిల్లలకు, పెద్దలకు, యువకులకు నేర్పటానికి సంసిద్ధత వ్యక్తంచేస్తున్నాడు. అంతేకాదు దీనిపై పుస్తకాన్ని రాయటమే కాకుండా త్వరలో ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటుచేస్తానని చెబుతున్నాడు.

...................
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03
.......................................

శంషుద్దీన్ షేక్