సబ్ ఫీచర్

ఒత్తిడికి గురైతే తల్లికి రోగాలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తక్కువ బరువుతో పిల్లలు పుట్టినా... కడుపుతో ఉన్నపుడు ఒత్తిడికి గురైనా అటువంటి తల్లులకు భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు అధికం. ఈ సమస్యలు దీర్ఘకాలం బాధిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రసవం అయ్యేవరకు గర్భిణీ ప్రశాంతంగా జీవించాలి. అంతేకాదు తనకూ, పుట్టబోయో బిడ్డకు అవసరమైన పోషకాలను అందించాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. ఈ సమయంలో పోషకాహారం తీసుకుంటే పండంటి బిడ్డను కనగలుగుతారు. దురదృష్టవశాత్తు ఆర్థికలేమి, కుటుంబ సమస్యల కారణంగా మనదేశంలో గర్భిణీలు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని ప్రభావం భవిష్యత్తులో వారి ఆరోగ్య సమ్యలకు కారణమవుతోంది. అడ్రినల్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం, గుండెకు సంబధించిన సమస్యలు తలెత్తటం, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవటం తదితర బాధలు మహిళలు ఎదుర్కొనే అవకాశం ఉందని మెల్‌బోర్న్ యూనివర్శిటీ పరిశోధకరాలు చియాంగ్ చెబుతున్నారు. గర్భిణీలు తీసుకుంటున్న పౌష్టికాహారం, రక్తసరఫరా, ఆక్సిజన్ అందటం తదితర వాటిని పరిగణనలోకి తీసుకుని పరిశోధన చేశారు. ఒత్తిడికి గురైనపుడు హార్మోన్ల సమతుల్యత లోపించినట్లు గుర్తించారు. అంతేకాకుండా గుండె, రక్తనాళాలకు సంబంధించిన ఇబ్బందులను కనుగొన్నారు. కిడ్నీలపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని చియాంగ్ అంటున్నారు. గర్భధారణ సమయంలో మహిళలు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చియాంగ్ సూచిస్తున్నారు.