సబ్ ఫీచర్

నో మెన్ ప్లీజ్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడుగడుగున ఉగ్రవాదులు చర్యలతో వణికిపోయో కాశ్మీర్‌లో మహిళలు అడుగు బయటకుపెట్టడానికి భయపడుతుంటారు. ఉగ్రవాదులుగా ముద్రపడిన కుటుంబాల స్ర్తిల ఇంటికి వెళ్లి వారికి అండగా నిలబడిన తొలి మహిళా నాయకురాలు మెహబాబా ముఫ్తీ. అలాగే భర్త ఉన్నాడో లేదో తెలియని సందిగ్ధస్థితిలో జీవచ్ఛవంలా బతుకుతున్న వేలాది వితంతువుల మహిళల కోసం తొలిసారి గళమెత్తిన నాయకురాలు కూడా మెహబూబానే. అందుకే కాశ్మీర్ మహిళకు మెహబూబా ఆపద్బాంధవి. ఆమె తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే కాశ్మీర్ విద్యార్థినులకు రక్షణ కల్పిస్తూ వారికి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటుచేశారు. ఈ బస్సులు మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయట! యూనివర్శిటీ విద్యార్థినులకు ఈ బస్సు సర్వీసులు సౌకర్యవంతంగా ఉన్నాయని చెబుతున్నారు. యూనివర్శిటీకి వెళ్లాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. నిలబడేందుకు కూడా స్థలం దొరికేది కాదు. మమ్మల్ని తాకుతూ మగ ప్యాసెంజర్లు ఉండేవారు. ఇపుడు ఆనందంగ వెళుతున్నామని హసన్ అనే విద్యార్థిని ఆనందంగా చెబుతోంది. ప్రస్తుతం కాశ్మీర్ యూనివర్శిటీ విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన ఈ బస్ సర్వీసులను మరింత విస్తరించే యోచనలో ముఖ్యమంత్రి మొహబూబా ఉన్నారు. ఉన్నారు.
*