సబ్ ఫీచర్

మధ్యయుగపు బుద్ధుల్లో మార్పు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమారు అరవై మంది కరసేవకులు అతి కిరాతకంగా హత్య చేయబడ్డారు ఇదే గోద్రా సంఘటన. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు దోషులను బంధించి న్యాయస్థానానికి అప్పగించాలి. వారికి ఐదు లేక పది సంవత్సరాలు జైలుశిక్ష విధింపబడవచ్చు. దానిపై వారు అప్పీలు చేసుకోవచ్చు. చట్టం అమలుచేయడం అంటే ఇదే. ఈ దారుణం జరిగిన మరునాడు గుజరాత్‌లో మారణహోమం జరిగింది. ఇది కరసేవకుల హత్యకు ప్రతీకారం. తాత్కాలిక ఆవేశాలలో ప్రజలు న్యాయస్థాన తీర్పులకు ఎదురుచూడలేరు. అంత ఓర్పు సహనం వారికి ఉండదు. ఆ సమయంలో పోలీసులు వారిని అదుపుచేయలేరు. కరసేవకులను ఎంత కిరాతకంగా హత్య చేసినదీ పత్రికలు ప్రకటించవు. కాని వాస్తవాలు ప్రజలకి తెలుస్తాయి. వెంటనే జరిగిన అల్లర్ల విషయం పతాక శీర్షికలతో వెలువడతాయి. మొదటి దుశ్చర్య మరుగునపడిపోతుంది. ఆ సమయంలో గుజరాత్ ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకుని మారణకాండను ఆపలేదని మోదీ హిందూ మతాభిమాని అని అల్లర్లను పరోక్షంగా ప్రోత్సహించాడని అసత్య ప్రచారాలు విరివిగా పెరిగిపోయాయి. మోదీ స్థానంలో అక్కడ ఎవరున్నా ఆ మారణహోమం ఆపడం వారి తరం కాదు. పోలీసులు హింసను అదుపుచేయడానికి తీవ్ర ప్రయత్నంచేశారు. ఇంతటి మారణకాండలో దోషులను పోలీసులు ఎలా గుర్తించగలరు? కరసేవకులను పథకం ప్రకారం హత్యచేశారు. కాని ఇది వార్తకాదు. ప్రతీకారం జరిగిన గుజరాత్‌లో మాత్రం పథకం ప్రకారం హత్యలు చేయబడ్డాయి అని పత్రికలు ప్రకటిస్తాయి. అటువంటి సమయాలలో పథకాలుండవు. ఆవేశంలో ఏ పని అయినా చేస్తారు. ఇందిరాగాంధీ హత్యానంతరం దేశవ్యాప్తంగా సిక్కుల ఊచకోత జరిగింది. ఆవేశంలో కనిపించిన ప్రతి సిక్కుపైనా విరుచుకుపడ్డారు. తమ ప్రియతమ నాయకురాలి హత్యకు ప్రతీకారం చేశారు. కొందరు సిక్కులను హిందువులు రక్షించారు. మొదటి దుశ్చర్యలకు మాత్రమే పథకాలుంటాయి.
గుజరాత్ మారణహోమంలో బాధితులకు న్యాయం జరుగలేదని కొన్ని పత్రికలు విలపిస్తున్నాయి. మరణించిన కరసేవకులకు న్యాయం అవసరం లేదు. 2008వ సంవత్సరంలో ఒరిస్సాలో లక్ష్మణానందస్వామి హత్య జరిగింది. హత్య పథకం ప్రకారం ఎవరు జరిపినది ప్రధానవార్త కాదు. తరువాత జరిగిన ప్రతీకార చర్యలు మాత్రమే ఎంతో ప్రాధాన్యమైనవి. లిక్ష్మణానందస్వామిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? దీనిపై ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేస్తారు. మత విద్వేషాలు మంచివి కావు అని అందరు అంటారు. కాని ఆచరణలో జరగడం లేదు. వీటిని చూచి విసిగి వేసారిపోయిన ప్రొఫెసర్ భీష్మసహానీ హిందీలో తమస్ అను ఒక గొప్ప నవల వ్రాశారు. అందులో ఒకచోట ఇలా అన్నారు. ‘‘ఈ ద్వేషాలు పెంచి పోషించేవారి శరీరాలు ఈ శతాబ్దం తాలూకువి. కాని వీరి బుద్ధులు మధ్యయుగాలనాటివి’’ ఈ నవలను ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌గారు తెలుగులో అనువాదం చేశారు.
భారతీయులంతా ఒకటే అనీ మతాలతో నిమిత్తంలేకుండా అందరు దేశభక్తికలిగి ఉండాలనే భావం అవసరం. మైనారిటీలు అనే పదాన్ని తొలగించాలి. ఈ దేశాన్ని ఎందుకు గౌరవించాలి? జనగణమన ఎందుకు పాడాలి? వందేమాతరం అని ఎందుకు అనాలి? అని ప్రశ్నించేవారికి దేశభక్తి లేనట్లే. అలాటివారు ఈ దేశాన్ని విడచివెళ్లాలి. విశ్వవిద్యాలయాలు ధర్మసత్రాలు కావు. అక్కడ తిష్టవేసి దేశ వ్యతిరేక సంబంధమైన సమావేశాలు ఎందుకు జరపాలి? అక్కడ బీఫ్ పార్టీలు ఎందుకు జరగాలి? అందుకు అభ్యంతరం చెప్పిన వైస్ ఛాన్స్‌లర్‌ను తొలగించాలా? మత మార్పిడులకి అభ్యంతరం లేదా? ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ దురభిమానాలు దేశ సమగ్రతకి గొడ్డలిపెట్టయినాయి. ప్రాంతీయ దురభిమానం హద్దులు దాటిపోతున్నది. ఇటీవల కొన్ని పార్టీలు మతపరమైన రిజర్వేషన్లను ప్రోత్సహిస్తున్నాయి. కొందరు దళిత క్రైస్తవులను ఎస్.సి జాబితాలో చేర్చాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం న్యాయస్థానాలు రిజర్వేషను విధానం పునఃపరిశీలించాలి. జాతీయ సమైక్యతకు అవరోధంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను నిషేధించాలి.

- వేదుల సత్యనారాయణ