సబ్ ఫీచర్

పథ్యం కూర పొట్లకాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొట్లకాయను పథ్యపు కూరగా భావిస్తారు. పథ్యపు కూరగా ఉపయోగించినా ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో నీరు, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, క్లోరిన్, భాస్వరం, గంథకం, ఇనుము, ఆగ్జాలికామ్లం, స్వల్పశాతంలో కొవ్వు, పుష్కలంగా ఫైబర్, స్వల్పంగా ధయామిన్, రిబోఫ్లోవిన్, అధికంగా కెరోటిన్ లభిస్తాయి. ఇవన్నీ శరీరారోగ్యానికి మేలు చేకూర్చేవే. పొట్లకాయను ఎన్నో రకాలుగా కూరను తయారుచేస్తారు. కూటు, పెరుగుపచ్చడి, బజ్జీలు లాంటివి చేస్తారు. ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయి.
అధిక బరువును తగ్గిస్తుంది. మధుమేహ రోగులు పొట్లకాయను తినడం మంచిది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఆకలిని పెంచుతుంది. కామెర్ల వ్యాధి నివారణకు తోడ్పడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. క్రిములను సంహరిస్తుంది. త్వరగా జీర్ణమవుతుంది. రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. దేహంలోని న్యూట్రిన్ వ్యవస్థ సక్రమంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అల్స ర్ మంటకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. నీరసాన్ని పోగొట్టి శక్తిని కలిగిస్తుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. వాపులను తగ్గిస్తుంది. కఫాన్ని కరిగించే గుణముంది. వెంట్రుకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. వెంట్రుకల కుదుళ్ళు దృఢపడతాయి.

- కె.నిర్మల