సబ్ ఫీచర్

అభివృద్ధికి తర్కం ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజ్ఞాన శాస్త్రంలో 1960లో వచ్చిన ఆవిష్కరణలు మానవ సమాజంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ప్రజలలో నూతన ఆలోచనలు రేకెత్తించాయి. కొన్ని దేశాలు అన్ని రంగాల్లో ఎందుకు విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్నాయి? మరికొన్ని దేశాలు ఎందుకు వెనుకబడి పోతున్నాయి? దీనికి కారణం ఏమిటనే ఆలోచనలు మొదలయ్యాయి. కొన్ని దేశాల అభివృద్ధి ఎందుకంత మందకొడిగా ఉందని ఆర్థికవేత్తలు లారెన్స్ హరిసన్, షాంబెల్ హల్టింగ్‌సన్‌లు అనేక పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలలో ఒక దేశం నాగరికత కూడా ఆ దేశ ఆర్థిక ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుందని వీరు సూత్రీకరించారు. నాగరికత, సంస్కృతి అంటే చాలామందికి స్పష్టత ఉండదు. నాగరికత అంటే జాతీయత మాత్రమే కాదు. రేషనల్ గ్రూపింగ్స్ మాత్రమే కాదు. నాగరికత అంటే మతం కూడా కాదు. మూఢ విశ్వాసాలు అంతకంటే కాదు. జాతీయత, రంగు, ప్రదేశము, మతము యొక్క సమగ్ర రూపమే సంస్కృతి. ఒక దేశం ఆర్థిక ఎదుగుదల అయినా వైఫల్యమైనా ఆ దేశ సంస్కృతే కారణభూతవౌతుంది. సంస్కృతి స్థిరంగా ఉండదు. అది మారుతూ ఉంటుంది.
ఇంగ్లాండు, ఐర్లాండ్‌లు ఒక దేశంలోని భాగాలు. ఐర్లాండ్ ప్రగతిలో మందకొడితనాన్ని ఇంగ్లాండ్ హేళన చేసేది. కూర్చొని తింటే కరువులు ఎందుకు రావు అని ఆనాడు చర్చిల్ వ్యాఖ్యానించాడు. బ్రిటిష్ హయాంలో మన దేశ ప్రజలు కూడా కూర్చొని తినటంవల్లనే కరువులు వచ్చాయని చర్చిల్ వ్యాఖ్యానించారు. 1970లో యూరప్‌లో అన్ని దేశాలకంటే ఐర్లాండ్ జిడిపి బాగా పెరిగింది. అదే భారతదేశంలో 1973లో ఆహార కరువు వచ్చిం ది. నాగరికత ప్రభావం స్థిరంగా ఉండదు. 1960 తర్వాత సౌత్ కొరియా ఆర్థిక వ్యవస్థ భేషుక్‌గా ఉన్నదని ఆర్థిక శాస్తవ్రేత్తలు విశే్లషించారు. ఆటోమోబైల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ వ్యాపారంలో సౌత్ కొరియా వేగవంతంగా అభివృద్ధి చెందింది. గ్రీసు దేశాన్ని దాటిపోయింది. ఈ ఎదుగుదలకు కారణం ఆ దేశాలయొక్క సంస్కృతి, నాగరికతే కారణమని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. బౌద్ధమతం, సౌత్ కొరియా ఆలోచనా విధానాన్ని మార్చివేసింది. జపాన్, సౌత్ కొరియా, ఐర్లాండ్, శ్రీలంక దేశాలలో బౌద్ధమతం వలన విద్యావ్యాప్తి వేగంగా జరిగింది. ఇతర మతాలు విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. బౌద్ధమతంలో గ్రంథాలు చదవటమే ప్రధానం. అందుకే జపాన్‌లో 16వ శతాబ్దంలోనే సంపూర్ణ అక్షరాస్యతను సాధించారు. బౌద్ధమతానికి తర్కం ప్రధానం కాబట్టి ఆ దేశాలయొక్క అభివృద్ధికి అదే కారణమైందని పలువురు ఆర్థికవేత్తలు విశే్లషించారు. జపాన్ దేశంలో అమెరికాకన్నా రెండున్నర రెట్లు పుస్తకాలు ముద్రించబడ్డాయి. జపాన్ అభివృద్ధి వెనుక అక్కడ బౌద్ధమతం, పుస్తకాలే కారణం. మతం, నాగరికత కూడా ఎలా అభివృద్ధికి దోహదపడతాయో జపాన్, ఐర్లాండ్ లాంటి దేశాలు తెలియజేస్తున్నాయి.
కొన్ని దేశాలను కర్మ సిద్ధాంతం క్రుంగదీసింది. కేవలం దైవం యొక్క అనుగ్రహంపైన అభివృద్ధి ఆధారపడి ఉంటుందని ఆయా దేశాలు భావించాయి. కానీ శాస్ర్తియమైన ఆలోచన లేకుండా అభివృద్ధి అసాధ్యం. మనిషి ఆలోచనే ఆ సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. 21వ శతాబ్దంలో ఏ దేశమైనాగాని ప్రగతి సాధించాలంటే ప్రజల ఆలోచనా విధానంలో హేతుబద్ధమైన మార్పురావాలి. రాజ్యాంగ నిర్మాణంలోనే సైంటిఫిక్ టెంపర్‌ను కలిగించాలని ఆనాడే నెహ్రూ చెప్పారు. మనిషి శ్రమ వెనుక ఆలోచనే ప్రధానం. ఆలోచనపైన కల్చర్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 21వ శతాబ్దంలో మిలటరీకోసం ఖర్చుచేయటం కంటే ప్రజల ఆలోచనా పద్ధతుల్లో రావాల్సిన మార్పులపై దేశాలు దృష్టి సారిస్తున్నాయి. హేతుబద్ధత అన్నది ప్రశ్నించటానికి మూలం అవుతుంది. ఏ మతమైతే ఇతరుల భావనలను ఎదగనీయదో అక్కడ ఆర్థిక వ్యవస్థకూడా ఎదుగదు. హేతుబద్ధత పెరగాలంటే అవగాహనాశక్తి పెరగాలి. అందుకే మన రాజ్యాంగంలో మొదటి వాక్యంలోనే దేశం భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్ణయిస్తుందన్నారు. తరగతి గది అంటే గోడలు కావు. దానివెనుక రేకెత్తించే ఆలోచనలున్నాయి.

- చుక్కా రామయ్య