సబ్ ఫీచర్

నిలిచిన సాధారణ బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి ఉద్యోగికి బదిలీ సంతోషం, ఆనందం కల్గిస్తుంది. నిర్ణీత సమయం తర్వాత క్రొత్త ప్రదేశాల్లో పనిచేయటానికి ఉవ్విళ్ళూరుతారు. ఒకే ప్రదేశంలో చాలా కాలం పనిచేస్తే ‘బోర్’కొడుతుంది. ఉద్యోగ నిర్వహణలో చురుకుదనం లోపిస్తుంది. చాలా ఏళ్ళుగా బదిలీల కోసం కోటి ఆశలు పెట్టుకున్న తెలంగాణ ఉద్యోగులకు మళ్ళీ నిరాశే మిగిలింది. మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నా బదిలీలు వాయిదా పడ్డాయి. సాధారణ బదిలీలు (జనరల్ ట్రాన్సుఫర్లు) విషయంలో తెలంగాణ సిఎం కేసిఆర్ పాజిటివ్‌గా ఉన్నారని, బదిలీల ఫైలుపై సంతకం చేస్తారని సాధారణ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. మే 25వ తేదీ నుంచి 15 రోజులపాటు నిషేధాన్ని ఎత్తివేసి బదిలీల ప్రక్రియ చేపడుతారని ప్రచారం జరిగింది. రాష్టవ్య్రాప్తంగా ఉద్యోగులందరికీ మేలుచేస్తుందనుకున్న తెలంగాణ ప్రభుత్వం ‘షాక్’ కలిగించింది. సాధారణ బదిలీలకు బదులు స్పౌజ్ (్భర్యభర్తలకు) మాత్రమే అవకాశం ఇవ్వటం ఎంతవరకు సబబు?
2010 నుంచి అన్ని శాఖల బదిలీలు జరుగలేదు. 2013లో సైతం కొన్ని శాఖల ఉద్యోగులకు మాత్రమే బదిలీ చేశారు. సీమాంధ్ర పాలనలోను, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలోను పోరాటం చేసిన ఉద్యోగులకు అప్పట్లో సర్కారు నిబంధనలవల్ల బదిలీ అయ్యే అవకాశం కోల్పోయారు. మూడేళ్ళుగా ఊరించిన బదిలీలు మళ్ళీ ‘బ్రేక్’ పడ్డాయ. ఈనెల 21న ‘స్పౌజ్’ (్భర్యాభర్తలకు) పరిమితంగా అనుమతించటంతో జనరల్ బదిలీల ప్రక్రియ ఆగిపోయింది.
కొత్త జిల్లాల విభజన విషయం సాధారణ బదిలీ ప్రక్రియకు అడ్డంకిగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 15దాక జిల్లాలు ఏర్పడనున్నాయి. ఈమేరకు సిఎం కేసిఆర్, కొత్త మండలాలు, కొత్త రెవిన్యూ డివిజన్లు, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగం పెంచారు. ఆగస్టు నెలలో కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. కాని బదిలీలు ఎపుడైనా ఏప్రిల్, మే నెలలోనే నిర్వహిస్తారు. ఉద్యోగుల పిల్లల చదువుకోసమే వేసవిలో బదిలీలు చేస్తారు.
2013కు ముందు, ఆ తర్వాత పదోన్నతి లేదా ప్రత్యేక పరిస్థితుల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు 2016లోనైనా తమ ‘ఆశలు’ నెరవేరుతాయని పడిగాపులు కాశారు. సీమాంధ్ర పాలనలో 2013లో చిట్టచివరిగా సాధారణ బదిలీలు జరిగాయి. అప్పట్లో 20శాతమే ‘లిమిటెడ్’గా ట్రాన్సుఫర్లకు ఓకే చేశారు. లాంగ్ స్టాండింగ్ ఉన్న వారికి 2013లో బదిలీ అయ్యారు. గరిష్టంగా ఐదేళ్ళు నిండిన వారికి 2013లో బదిలీ ప్రయోజనం పొందారు. 2014, 2015 సంవత్సరాల్లో బదిలీలు చేపట్టవలసి ఉండగా వివిధ రాజకీయ సమీకరణతో బదిలీ చేయలేదు.
ప్రతి వేసవిలో సాధారణ బదిలీలు చేయాలని ఉద్యోగులు కోరుకుంటారు. ప్రభుత్వాలు సైతం తప్పక ప్రతిసారి వేసవి సెలవుల్లో బదిలీల ప్రక్రియను ముగిస్తారు. ఈసారి జనరల్ ట్రాన్సుఫర్లు జరుగుతాయని ఆశపడితే భార్యాభర్తలకు మాత్రం ప్రభుత్వం బదిలీకి ఆదేశాలు ఇచ్చింది.
5 సంవత్సరాలు సర్వీస్ నిండిన వారిని తప్పక బదిలీ చేస్తారు. 2 సంవత్సరాల సర్వీస్ పూర్తిచేసుకున్న వారు ట్రాన్సుఫర్‌కోసం అప్లయ్ చేసుకొనే అవకాశం ఇచ్చారు. బదిలీలు ఆయా శాఖల్లో 50 శాతం మించకుండా చేస్తే ఎక్కువమందికి బదిలీ ప్రయోజనం అందుతుంది. వివిధ సాకులతో ప్రభుత్వాలు ఆయా శాఖల్లో 20 శాతానికి మించకూడదనే కండీషన్ పెడ్తారు. ఇందువల్ల ఎక్కువమంది అర్హులకు ప్రయోజనం చేకూరటం లేదు. ఏది ఏమైన పరిపాలనా ప్రక్రియలో సాధారణంగా చేపట్టే బదిలీ ప్రక్రియ నిలిచిపోవడం చాలా మంది ఉద్యోగులకు ఆశనిపాతంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది పరిమిత బదిలీలకే అనుమతించడం బదిలీలకోసం ఎదురుచూసే ఉద్యోగులకు నిరాశను మిగిల్చింది.

- రావుల రాజేశం