సబ్ ఫీచర్

శుభ్రతలో సిక్కిం ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఖ్యాతి గడించిన భారతదేశానికి తలవంపులు తెచ్చే అతి పెద్ద సమస్య ‘బహిర్భూమి’. స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు గడుస్తున్నా ఇంకా అనేక గ్రామాల్లో, పట్టణాల్లో బహిరంగ మల విసర్జనను నిషేధించలేకపోయాం. అవసరమైన సంఖ్యలో మరుగుదొడ్లు జనావాసాల్లో లేకపోవడం, వ్యక్తిగత మరుగుదొడ్లపై చైతన్యం కొరవడటం, ‘ఇలాంటి పెను సమస్య ఒకటుందా?’ అనే ధ్యాస అధికార యంత్రాంగంలో లేకపోవడం ఇందుకు కారణాలు. చాలా కాలం తర్వాత దేశవ్యాప్తంగా ఒక స్ఫూర్తి మొదలైంది. ‘బహిరంగ మల విసర్జన రహిత దేశం’గా భారత్‌ను చూడాలనే కాంక్ష మొదలైంది. ప్రజల్లో కాంక్ష ఉన్నా అందుకు అవసరమైన సమన్వయాన్ని సాధించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. వాస్తవానికి ఈ ఆశయం నెరవేర్చడం అంత ఆషామాషీ కాదు, అదో పెద్ద సవాలుతో కూడుకున్నదే.
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం ద్వారా బహిర్భూమిని నిషేధించాలని కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న సంకల్పించింది. ‘స్వచ్ఛ భారత్’ను ఒక సామాజిక ఉద్యమంలా దేశ ప్రజానీకం చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తేజపరుస్తున్నారు. ఇందుకు భారీగా ప్రచార కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. బహిరంగ మల విసర్జనను పూర్తి స్థాయిలో నివారించాలనే కార్యక్రమాన్ని అర్ధం చేసుకుని అమలుచేసిన రాష్ట్రాల్లో సిక్కిం అగ్రస్థానంలో ఉంది. బహిరంగ మలవిసర్జనను పూర్తిగా అక్కడ నిషేధించగలిగారు. అతి చిన్న రాష్టమ్రైన సిక్కింలో మరుగుదొడ్ల నిర్మాణం సత్ఫలితాలను ఇచ్చింది. ఆ రాష్ట్రంలో నాలుగు జిల్లాలుండగా, అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. అందుకే ‘బహిర్భూమి’ని నిషేధించిన రాష్ట్రంగా సిక్కిం సరికొత్త రికార్డును సృష్టించింది. ఇపుడు యావత్ దేశానికే సిక్కిం ఒక మార్గదర్శకంగా మారింది. సాంకేతికంగా, విజ్ఞానదాయకంగా చాలా ముందున్న రాష్ట్రాలు సిక్కింను చూసి నేర్చుకోవల్సింది చాలా ఉంది.
సిక్కిం తర్వాత ఆ విధంగా కృషి చేసిన రాష్ట్రాల జాబితాలో హిమాచల్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్నాటక ఉన్నాయి. కర్నాటకలో 30 జిల్లాలకు గానూ నాలుగు జిల్లాల్లో సంపూర్ణ మరుగుదొడ్ల కార్యక్రమం విజయవంతంగా అమలుచేశారు. రాజస్థాన్‌లో 33 జిల్లాలకు నాలుగు జిల్లాల్లో ఇంటింటా మరుగుదొడ్లు నిర్మించారు. హర్యానా, పంజాబ్, అస్సాం, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా తమ వంతు కృషి చేస్తూ కనీసం కొన్ని జిల్లాల్లోనైనా బహిర్భూమికి పోకుండా మరుగుదొడ్లను అందుబాటులోకి తెచ్చాయి. మరుగుదొడ్లను నిర్మించడంతోనే సరిపోదు, అక్కడ అవసరమైన నీటి సరఫరాను అందించగలగాలి. లేకుంటే మరుగుదొడ్ల నిర్వహణ దారుణంగా తయారైపోతుంది. మరుగుదొడ్ల నిర్మాణం జరిగిన గ్రామాల్లో స్వచ్ఛత, పరిశుభ్రత, వాతావరణ కాలుష్య నివారణ అంశాలు ప్రజల్లో మనోవికాసానికి, చైతన్యానికి దోహదం చేస్తున్నాయి. నలుగురూ కలిసి ఒక చోట కూర్చుని గ్రామాభివృద్ధి గురించి చర్చించుకునే వీలుకలిగిస్తోంది. అదే స్ఫూర్తితో దేశంలోని 29 రాష్ట్రాలూ పనిచేయాల్సి ఉంది. ప్రజలు, ప్రభుత్వం చేయి చేయి కలిపినపుడు సాధించలేనిది లేదని గతంలో అనేక అనుభవాలు రుజువు చేశాయి.

-బివి ప్రసాద్