సబ్ ఫీచర్

సానుకూల దృక్పథాన్ని పెంచుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** నేడు పసిప్రాయంలో ఉన్న పిల్లలపై అరాచకాలు ఎక్కువ అయ్యాయి. ఇది దేశానికే అరిష్టం. అసలు సృష్టికే అనాచారం. అందుకే ప్రజలంతా వారు వీరను లేకుండా అప్రమత్తత కావాలి. మృగాళ్లను ఏరి పారేయ్యాలి. అసలెందుకు ఇలాంటి అనాచారాలు ఎక్కువఅవుతున్నాయన్న దానిమీద దృష్టి సారించాలి.
----------------------------

స్కూల్స్‌లో విలువలతో కూడిన చదువులు చెప్పాలి. టీచర్లు, తల్లిదండ్రులు మారాలి. మా అమ్మాయినో లేక మా అబ్బాయినో ఫస్టు ర్యాంక్ తెచ్చుకోవాలని కాక వారు మానవత్వంతో ఎదగాలి అని అనుకోవాలి. ఆడ మగ అనే వ్యత్యాసాన్ని కాక వారిలో ఇద్దరూ సమానమే ఇద్దరూ మనుష్యులే అనే భావం ఎదగనివ్వాలి. అపుడే రాబోయే తరంలో విలువలు ఏర్పడుతాయి. లేకపోతే నేను నేను అనే భావం పెరిగి అంతర్గతంగా ఒత్తిడి ఎక్కువై మానవత్వాన్ని మరిచిపోయే సంఘటనకు కారకులు అవుతున్నారు.
ఒకరకంగా ఉమ్మడికాపురాలు లేనందువల్ల కూడా ఇట్లాంటివి చోటుచేసుకొంటున్నాయి. కనుక వీలైనంతగా ఇంట్లో పెద్దవారు ఉండేలా చూసుకొంటే వారు తీరిక సమయాల్లో వారికి మంచి కథలు చెప్పుతూ వారిలో మానవత్వాన్ని వెలికితీస్తారు.
ప్రపంచం కదిలితేనే ఆ సమస్యకు పరిష్కారం సాధ్యం.
‘ప్రపంచమంతా నేడు బాలికల వైపు ఆసక్తిగా చూస్తోంది.. అసాధ్యాలను సుసాధ్యం చేసే అద్భుత శక్తి అమ్మాయిల్లోనే ఉంది.. పేద బాలికలంతా బడిబాట పట్టినపుడే ఏ దైశమైనా అభివృద్ధి సాధిస్తుంది. బాలికల విద్య అన్నది ప్రచారం కోసం కాదని, దాన్ని ‘తీవ్రమైన ఆర్థికఅంశం’గా పరిగణించాలని సూచిస్తున్నారు.
భారత్‌లో 27 శాతం మంది అమ్మాయిలకు 18 సంవత్సరాలలోపే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ప్రపంచ సగటు 28 శాతం కావడం గమనార్హం.
మహిళలకు నైపుణ్య అభివృద్ధి కల్పించడం లాంటి కార్యక్రమాలు మహిళా సాధికారితకు తోడ్పడేవే. లింగ అసమానతల ప్రపంచంలో చదువు, ఉద్యోగం, పునరుత్పత్తి హక్కుల విషయంలో మహిళలు వివక్షకు గురవుతున్నారు.

ఈ విషయంలో భారత పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదని ఐక్యరాజ్యసమితి జనాభానిధి సంస్థ విడుదల చేసిన 2017 నివేదిక వెల్లడించింది.
కనుక మనం మారుదాం.ఆడపిల్లల బతుకులను భద్రం చేద్దాం. వారి భవిష్యత్తును బంగారుమయం చేయడానికి వారిలో అక్షరాస్యతతోపాటు అననుకూల పరిస్థితు లను ఎదుర్కొనే శక్తిని పెంచుదాం.

--జి. కళ్యాణి