సబ్ ఫీచర్

మార్పు రావాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాయితీ అనే ఆజ్యంతో
నిస్వార్థమనే సమిధలతో
కచ్చితమనే నిప్పుతో
సభ్యసమాజంలో నిత్యాగ్ని హోత్రంలా
దశదిశలా కీర్తి వెలుగుల విలువలను ప్రజ్వలింప చేయాలి.
కల్పిత బంధాలను భూస్థాపితం చేయాలి. భావితరాలకు ఆదర్శంగా నిలవాలి. అంకితమైన ప్రేమామృత వర్షాన్ని కురిపించాలి. అనుకోకుండా ఏర్పడిన బంధాలకు ఆకర్షణ ఎక్కువ. నేటి యువతరం ఈ ఆకర్షణ అనే వ్యాధిలో పడి మితిమీరిన సాహసాలతో తమ విలువైన భవిష్యత్తును దుర్భరం చేసుకొంటున్నారు. సభ్యసమాజపు మూలస్థంభాలుగా ఉండవలసిన యువత నేడు తమ సొందవారి వద్దనే సముచితమైన స్థానాన్ని కోల్పోతున్నారు. నవసమాజంలో రెపరెపలాడుతూ కీర్తిపతకంలా ఎగరవలసిన యువత నేడు ఇంటి పైకప్పు వాసంలా వ్యసనాలతో నిరాశ నిస్పృహ అంటూ వేలాడుతున్నారు.
ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని తెలిసో తెలియనకో తమ వినాశానికి సమాజ అధోగతికి ఉపయోగిస్తున్నారు. చిన్న వయస్సులోనే మానసికరోగులుగా మిగిలిపోతున్నారు. ఇలా జరగడానికి ప్రధాన కారణం ఏమిటి? అసలు ఎవరిది తప్పు? స్వేచ్ఛనిచ్చిన తల్లిదండ్రులదా? లేక విద్యాబుద్ధులు నేర్పిన గురువులదా? లేక పెరిగిన వాతావరణమా? అసలు ఎవరిది తప్పు. ప్రస్తుతం సోషల్ మీడియా వ్యవహారమా? ఇలా ఒకదానికకొకటి ఆరా తీసుకొంటూ ఆలోచించడం కూడా సరికాదేమో. యువత స్వనిర్ణయాలతో ఇష్టానుసారంగా చెడు అలవాట్లతో తమ బంగారు జీవితాన్ని చీకటి మయం చేసుకుంటున్నపుడు మరి ఎవరినో బాధ్యులుగా పరిగణన లోకి తీసుకొని వారిపై నిందారోపణ చేయడం సమజసమా?
యువతలో నేడు నిరాశ ఎక్కువైంది. మానసిక దుర్బలురు అవుతున్నారు. రోజు రోజు అపరిచితులతో నూతన స్నేహం మొగ్గలు తొడగటం, అవికాస్త ఆకర్షణగా మారి తాత్కాలిక ప్రేమబంధాలుగా ప్లాస్టిక్ పువ్వులై వికసించడం, చివరకు అవన్నీ ఒక అభూత కల్పనలని ఊహించని భూటకపు నిప్పులాంటి నిజాన్ని తెలుసుకొని జీర్ణించుకుని సున్నితమైన మనస్తత్వం గల యువత ప్రాణాలను కోల్పోతున్నారు. తల్లిదండ్రులను శోకసముద్రంలోకి నెట్టేసస్తున్నారు.
దీనికి కారణాలు కనుక్కుంటే
పరిష్కారాలు ఇవిగో..
తొందరపడి స్నేహం చేయడం , ఎప్పటికీ కలిసే ఉందామని వాగ్దానం చేసుకొని అపార్థాలతో విడిపోవడం, వాదనలు గొప్పలు గొడవలు దుఃఖాలు పగలు,విమర్శలు ఇతరుల బలహీనతలతో ఆడుకోవడం , హేళన చేయడం మోసాలను నమ్మించడం , దొంగ ప్రమాణాలను తల్లిదండ్రులను ఎదుట చేయడం, వావివరుసలు మరిచి హద్దులు దాటడం, బంగారు భవితవ్యాన్ని వినాశనం చేసుకోవడం.. చివరకు ఒంటరిగా మిగిలిపోవడం.. ప్రస్తుత సమాజంలో యువత 70% రోజురోజుకు చెడు అభిరుచులు, బలహీనతలతో విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవడం.
అందుకే మీరంతా నిజమైన స్నేహం , ప్రేమ అంటే ఏమిటో ముందు తెలుసుకోండి. స్వచ్ఛమైన నిర్మలమైన పవిత్రమైన బంధం ఏమిటో చూడండి. నిజమైన ప్రేమ, బంధం అనేవి మహాసముద్రం వంటివి. అవి గుండె లోతుల్లో ప్రేమ కెరటాలు అసూయ ఎరుగని నింగిని చేరి ఆత్మీయతానురాగాల ప్రేమామృత వర్షం నిరంతరం కురిపిస్తూనే ఉంటుంది. నిశ్శబ్దపు చల్లని చిరుగాలిలా మదిని తాకుతూ ఉత్తేజపరుస్తూ చైతన్యాన్ని కలిగిస్తుంది. మనస్సు పురివిప్పిన మయూరిలా నిత్యానంద డోళికలతో పరమానంద దాండవం చేస్తూనే ఉంటుంది.
ఆ ఆనంద తాండవం కావాలంటే క్షణకాల సుఖాల కోసం లేని కల్పిత బంధాల కోసం ఆరాటపడుతూ భవిష్యత్తును బూడిద కానివ్వకండి. ఏదైనా పొరపాటు జరిగినా దానిని దిద్దుకోండి. మరలా అటువంటి తప్పు చేయకండి. కాని ఆ తప్పు కోసం ప్రాణాలను తీసుకోకండి. ఎంతో కష్టపడి మీకీ జన్మనిచ్చి ఇంకెత్తో కష్టపడి మిమ్మల్నింత వారిని చేసిన మీ తల్లిదండ్రులను ఒక్కసారి ఆలోచించండి.

-డా.శారదారెడ్డి వకుల 9492416166