సబ్ ఫీచర్

పేద పిల్లల పంతులమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది దేశ రాజధానిలోని మురికివాడల ప్రాంతం. ఓ పాఠశాల తరగతి గదిలోకి 81 సంవత్సరాల వృద్ధురాలు చకచక నడుచుకుంటూ వెళ్లింది. పిల్లలంతా ‘గుడ్ మార్నింగ్ టీచర్’ అని పెద్దుపెట్టున విష్ చేశారు. అక్కడ ఉన్నది 12 మంది విద్యార్థులే. అందులో 11మంది బాలురు, ఒక బాలిక. గోడల నిండా సందేశాత్మకమైన రంగు రంగుల పోస్టర్లు అంటించారు. వెంటనే ఆ పిల్లలు ‘ఏ ఫర్ ఎయిర్‌పోర్టు, బి ఫర్ బ్లాక్ బెర్రి అని అరవటం ప్రారంభించారు. స్కూలు టీచర్ అంటే అరవై ఏళ్లలోపు వారు ఉంటారు. ఈ ఎనిమిది పదుల వృద్ధురాలిని స్కూలు టీచర్ అని అంటున్నారనేగా సందేహం. ఎందుకంటే టీచర్‌గా పదవీ విరమణ చేసిన విమలాకౌల్ ఇంటిలో కాళ్లుజాపుకుని కూర్చోకుండా తనకు చేతనైన మేరకు మురికివాడల పిల్లలకు చదువు చెప్పటాన్ని ఓ వ్యాపకం వలే పెట్టుకున్నారు. ఇరవై ఏళ్ల క్రితం పదవీ విరమణ పొందిన విమలాకౌల్ ఓ రోజు మురికివాడల ప్రాంతాల్లోని పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు పంచటానికి భర్తతో కలిసి వెళ్లారు. పిల్లలు వాటిని తీసుకుని తినేసి వెపర్లను పక్కన పడేశారు. ఇంతలో ఓ మహిళ వచ్చి ఇలా ఇవి తీసుకువచ్చి ఇచ్చే బదులు వారి జీవితానికి అవసరమైన ఏదైనా చేయవచ్చు కదా! అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నతో ఆమె తన సమయాన్ని వృథా చేయకుండా పేద పిల్లల కోసం ఏదైనా వ్యాపకాన్ని కల్పించుకోవాలని సంకల్పించారు. తనకు తెలిసిందల్లా విద్య నేర్పించటమే. అందుకే దీనినే కొనసాగించాలని తలించారు. ముఖ్యంగా ఢిల్లీలోని
రూరల్ ప్రాంతాలలో ఆర్థిక ఇబ్బందుల వల్ల పాఠశాలకు వెళ్లని పిల్లలకు విద్య నేర్పించాలని తలంచారు. మదనపుర్ ఖాదర్‌లో 1994లో 44మంది మహిళలకు కుట్టుపని నేర్పించటం ప్రారంభించా రు.ఈ రోజు అక్కడ 110 మంది మగవారు, ఆడవారు, పిల్లలు వృత్తి శిక్షణతో పాటు చదువు నేర్చుకుంటున్నారు. అంతేకాదు. 1995లో ఎంజిడి పార్క్‌లో ఐదుగురు పిల్లలను కొర్చోబెట్టి చదువు చెప్పటం ఆరంభించారు.
గత 15 ఏళ్ల నుంచి ఈ పార్క్‌లో ఆమె పాఠాలు బోధిస్తూనే ఉన్నారు. తరగతులకు పిల్లల్ని ఆకర్షించటానికి అవసరమైన ఆర్థిక వనరులు ఆమె వద్ద లేక ఒకనొక దశలో స్కూలను
మూసివేయాలని భావించారు. ఆ సమయంలో మదన్‌మోహన్ మాలవ్య ట్రస్ట్ సహకారంతో గుల్‌దస్త పాఠశాలను ప్రారంభించారు. గుల్‌దస్త అంటే ‘‘పువ్వుల గుత్తి’’ అని అర్థం. నాలుగు గదులతో ఓ ఫ్లాట్‌లో ఆరంభమైన ఈ పాఠశాలలో నేడు 120 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అంతేకాదు ఇప్పటికీ ఈ స్కూలుతో పాటు ఓ పార్క్ నుంచి మరో పార్క్‌కు వెళుతూ.. పిల్లలకు చదువు చెబుతూనే ఉన్నారు. తొలుత భర్త సహకారం ఉండేది.
కాని భర్త మరణం తరువాత కూడా చదువు చెప్పటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. జీవితంలో విద్య అనేది ప్రధానమైనదని, అది జీవితానే్న మలుపు తిప్పుతుందని విమల్ కౌల్ నిశ్చితాభిప్రాయం.