సబ్ ఫీచర్

నవభారత నిర్మాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తంత్ర భారతావనిలో సంస్కరణలకు ఆద్యుడిగా, ప్రజా సంక్షేమ విధానాల రూపశిల్పిగా, నవభారత నిర్మాతగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఎనలేని ఖ్యాతిని ఆర్జించారు. వివాహాలకు కనీస వయసును 12 నుండి 15 ఏళ్లకు పెంచడం, విడాకులు తీసుకున్న మహిళలకు వారసత్వ ఆస్తి హక్కు ఇవ్వడం, వరకట్నం ఆచారాన్ని చట్టవిరుద్ధం చేయడం వంటి అనేక కీలక సంస్కరణలకు నెహ్రూ శ్రీకారం చుట్టారు. న్యాయవాదిగా, పరిపూర్ణ రాజకీయ వేత్తగా, రచయితగా, దేశ తొలిప్రధానిగా ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.
ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్‌లో సంపన్న కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో మోతీలాల్, స్వరూపరాణి దంపతులకు తొలి సంతానంగా నవంబర్ 14, 1889లో నెహ్రూ జన్మించారు. ఇండియన్ సివిల్ సర్వీసులో అర్హత పొందాలనే తండ్రి కోరిక మేరకు ఇంగ్లాండుకు వెళ్ళారు. ఉన్నత చదువులు పూర్తి చేశాక న్యాయవాద వృత్తి చేపట్టారు. 1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ ఉదంతంతో కలత చెందిన నెహ్రూ దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొనాలని ఆసక్తి చూపారు. మహాత్మాగాంధీకి నమ్మినబంటుగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్ర సమరంలో 9 ఏళ్ళు కారాగార జీవితం అనుభవించారు. జైలులో ఉండగా ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’, ‘ది డిస్కవరీ ఆఫ్ ఇండియా’తో పాటు తన ఆత్మకథలను ఆయన రచించారు. 1936,1937,1946లలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. యువకునిగా ఉన్నదశలోనే వామపక్ష భావజాల ప్రభావితుడై, సంపూర్ణ స్వాతంత్య్ర సముపార్జనాసక్తుడై, గాంధీ సలహాలతో, ప్రజాకర్షణగల నేతగా, సంస్కరణ వాదిగా ఎదిగి, స్వాతంత్య్ర సంగ్రామంలో ముఖ్య భూమిక నిర్వహించారు. 1916లో కమలా కౌల్‌ను నెహ్రూ వివాహం చేసుకున్నారు. నెహ్రూ, కమల దంపతులకు ఇందిరా ప్రియదర్శిని 1917 నవంబర్ 19న జన్మించింది. 1947 నుండి 1964 వరకు దేశ ప్రధానిగా ఆయన ఎనలేని కృషి చేసి ప్రపంచ దేశాల దృష్టిని సైతం ఆకర్షించారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, స్వేచ్ఛావాదం, పేదల పట్ల ప్రేమ వంటి అంశాలు నెహ్రూను ఉన్నతంగా నిలిపాయి. వినూత్న విధానాల రూపశిల్పిగా ప్రసిద్ధి చెందిన ఆయన 74 ఏళ్ల వయసులో 1964 మే 27న తుదిశ్వాస విడిచారు. పంచశీల సూత్రానువర్తిగా, అలీనోద్యమ స్థాపకులలో ఒకరిగా ఆయన అంతర్జాతీయ స్థాయి గుర్తింపను పొందారు. చిన్నపిల్లలంటే ఆయనకు ఎనలేని మమకారం. అందుకే ఆయన ‘చాచా నెహ్రూ’గా ప్రఖ్యాతి పొందారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కుమార్తె ఇందిర, మనవడు రాజీవ్ గాంధీ ప్రధాని పీఠాన్ని అధిరోహించి ఈ దేశానికి విశిష్టసేవలను అందించారు.

(నేడు పండిట్ నెహ్రూ వర్ధంతి)

-సంగనభట్ల రామకిష్టయ్య 94405 05494