సబ్ ఫీచర్

వైను.. వైను.. రెడ్ వై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెడ్ వైన్ లేదా రెడ్ వైన్ వెనిగర్ తాగడంవల్ల ఎన్నో హెల్డ్ బెనిఫిట్స్ ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. మద్యం అతిగా తాగితే రక్తపోటు పెరగడంతోపాటు పలు రకాల కేన్సర్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అయితే రెడ్‌వైన్ పరిమితంగా సేవిస్తే పలు ప్రయోజనాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఒక గ్లాస్ రెడ్ వైన్‌లో పోషకాంశాలు ఒత్తిడిని తగ్గించడంతోపాటు హార్ట్ రేట్‌ను తగ్గిస్తాయి. అంతేకాదు హార్మోనులను నిలకడగా ఉంచుతాయి. మతిమరుపు, మాటలు అర్థంకాకపోవడం, ఆహారం తీసుకోకపోవడం వంటి లక్షణాలతో బాధపడే వారికి రెడ్‌వైన్ ద్రాక్ష, చాకెట్లు తగు మోతాదులో తీసుకుంటే ఉపశమనం ఉంటుందని, వీటిలో ఉండే రెజ్వరేట్రాల్ అనే పదార్థం దీర్ఘకాలంలో మతిమరుపును నిలువరిస్తుందని లండన్‌కు చెందిన ఆర్.స్కాట్ ట్యూనర్ బృందం పరిశోధన చేసింది. ఎన్నో రకాల టెస్టులు చేసిన తర్వాత ఈ విషయాన్ని ప్రకటించారు. రెడ్‌వైన్, డార్క్ చాక్లెట్ కాకుండా.. రెడ్ గ్రేప్స్, పీనట్స్, బ్లూబెర్రీస్ లాంటి ఫ్రూట్స్ కూడా ఈ లక్షణాలు కలిగి వుంటాయని తెలిపింది. అయితే ఈ విషయం పూర్తిగా రుజువు అయ్యేందుకు మరికొన్ని ప్రయోగాలు అవసరమవుతాయని సైంటిస్టులు తెలిపారు. వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ను అధికంగా కలిగి ఉంటుంది. అందువల్లే చర్మ సంరక్షణకు వైన్‌ను ఉపయోగిస్తాం. ద్రాక్ష విత్తనాలు పులియబెట్టి, ఉపయోగించడంవల్ల వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా శక్తివంతమైనవిగా పనిచేసి, ఫీరాడికల్స్‌కు వ్యతిరేకంగా పనిచేసి చర్మాన్ని సంరక్షిస్తాయిట.
ముఖ్యంగా టైపు-2 మధుమేహం అదుపులో ఉంటుందని భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని బెన్ గురిఒన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఒక ప్రత్యేక బృందంలోని వ్యక్తులపై పరిమితంగా మద్యం తాగడం ఏ మేరకు ప్రయోజనం అనే అంశంపై అధ్యయనం చేశారు. టైపు-2 మధుమేహం ఉన్నవారికి హృద్రోగ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఇతరులకన్నా వారి గుండెకు తక్కువ రక్షణ ఉంటుంది. వీరు ఈ కేటగిరికి చెందిన 224 మంది వ్యక్తులను ఎంపిక చేసుకున్నారు. వారందరికీ టైప్-2 మధుమేహం ఉంది. వారిని రాత్రి భోజనం సమయంలో ఐదు ఔన్సుల మేరకు మద్యం తీసుకోమన్నారు. మినరల్ వాటర్‌తో కలిపి కొందరిని డ్రై వైట్ వైన్, మరికొందరిని డ్రై రెడ్‌వైన్ తీసుకోమన్నారు. డైటీషియన్ సలహా ప్రకారం కేలరీల పరిమితి లేకుండా ఒక మాదిరిగా ఆహారం తీసుకోమన్నారు. ఆ విధంగా రెండేళ్ళపాటు వారిలో మార్పులను పరిశీలించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రశ్నావళితో సమగ్రంగా వారి గురించి అధ్యయనం చేశారుట. వారి రక్తప్రవాహం, లివర్ పనితీరు, చక్కెర స్థాయి వంటి వాటిని గమనించారు. రెడ్‌వైన్ తీసుకున్నవారి ఆరోగ్యంలో మంచి మార్పు గమనించారుట. వారిలో కొవ్వు పరిమాణంలో మంచి మార్పు కనిపించింది. వారి జీవక్రియలోనూ మంచి మెరుగుదల కనుగొన్నారు. రెడ్‌వైన్, వైట్ వైన్ ఏది తీసుకున్నా వారికి బాగా నిదురపట్టడం గమనించారు. వారి ఆరోగ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం లేదని తెలుసుకున్నారు.
ఒక గ్లాస్ రెడ్ వైన్ సేవించడం ద్వారా గంటసేపు వ్యాయామాలు చేయడం ద్వారా లభించే శక్తిని పొందవచ్చునని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. కెనడాలోని ఆల్బెర్టా యూనివర్సిటీకి చెందిన జాసన్ డైక్ బృందం ఈ అంశంపై అధ్యయనం చేపట్టింది. ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రోల్ అనే యాంటీ ఆక్సిడెంట్‌ను రెడ్‌వైన్‌లో గుర్తించిన డైక్ అండ్ కో, అది హృదయ, కండర సంబంధ కార్యకలాపాలను మెరుగుపరుస్తుందని తెలుసుకుంది. ఎర్ర ద్రాక్షలో రెస్ వెరాట్రోల్ అనే యాంటాక్సిడెంట్ ఉంది. శారీరకంగా వ్యాయామాలు చేయలేనివారికి రెడ్‌వైన్ ఎంతో సహాయపడుతుంది. రెస్ వెరాట్రోల్‌ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరం చురుగ్గా పనిచేస్తుంది. ఎముకలు, గుండె పటిష్టంగా ఉంటాయి.
గతంలో చేసిన అధ్యయనాల్లో రెడ్ వైన్‌లో ఉండే రెస్‌వెరాట్రోల్ వల్ల కాటరాక్టు రాదని తేలింది. అంతేకాదు ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. క్యాన్సర్ నుంచి కాపాడుతుంది.

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి