సబ్ ఫీచర్

శలభాసనం - సులభాసనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శలభాసనం స్ర్తీలకు మంచిని చేస్తుంది. ఇది పశ్చమోత్తనాసనానికి, హలాసనానికి వ్యతిరేకస్థితిలో ఉంటుంది. దీనివలన శరీరానికి ప్రయోజనాలు చేకూరుతాయి. అర్ధ శలభాసనం వేయడానికి మొదట నేలపై పడుకోవాలి.ఉదరం, చాతి, చుబుకం నేలను తాకుతు వుండాలి. భుజాలు చదునుగా పరచాలి.
వేళ్లను నేలపై ఉంచాలి. పిడికిలి బిగించి పైకి తీసుకురావాలి. మెల్లిగా గాలి పీల్చుకుని పది సెకన్లు బిగపట్టాలి. పూర్తిగా గాలి పీల్చుకుంటే కాళ్లు ఎత్తడానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి పూర్తిగా గాలి పీల్చుకోరాదు. ఊపిరి వదలడం మొదలుపెట్టాలి. గాలి పీల్చుతునే ఆసనాన్ని పూర్తి చేయాలి. నిశ్వాసమనేది కాళ్లు నేలను చేరేటప్పటికి పూర్తి కావాలి.
శరీరాన్ని సమతుల్యంగా వుంచడానికి చేతులు లేదా అరచేయి లేదా పిడికిలి వినియోగించాలి. పిడికిలిని కేవలం అనుభవజ్ఞులు మాత్రమే వినియోగించాలి. మెల్లగా కాళ్ల వీలైనంత ఎత్తుకు తీసుకురావాలి. నాభి వరకు ఉన్న శరీర భాగం నేలనుతాకి వుండాలి. అది కదలకూడదు.మొండెం చక్కగా వుండాలి.
కాళ్లు లేపడానికి కేవలం నాభి కింది భాగంలో వున్న ప్రాంతాన్ని మాత్రమే వినియోగించాలి. ఉదరం, ఛాతి, చేతులు, చుబుకం కచ్చితంగా ఆసనంలో వున్నంతసేపు నేలను తాకే వుండాలి. కాళ్లు ఎత్తిన స్థానంలోనే కచ్చితంగా ఉంచాలి.కాళ్లు ఎత్తే సమయంలో గానీ, తిరిగి యాధాస్థితికి చేర్చే సమయంలో కానీ మోకాళ్లు వంచరాదు.
ఉపయోగాలు: ఈ ఆసనంతో గర్భసంచి, అండాశయాలలో ఏవైనా లోపాలు వుంటే తొలగిపోతాయి.మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. కాళ్లు, చీలమండ, వాపులకు ఉపశమనం లభిస్తుంది. అజీర్తి, మలబద్ధకాలు నయమవుతాయి.ఈఆసనం జీర్ణక్రియను పెంచుతుంది. నరాల వాపు, మొలలు నివారించబడతాయి. కాలేయం వేగంగా పనిచేయడానికి దోహదపడుతుంది. కడుపుబ్బరం తగ్గుతుంది.ఉదర కోశవ్యాధులు, గాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి
*