సబ్ ఫీచర్

విజయపథం చేరువ కావాలంటే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతమంది ఇంటిని, ఇల్లాలిని, దేవుళ్లలాంటి పిల్లలు, నమ్ముకున్న ఇతర కుటుంబ సభ్యుల బాగోగులు పట్టించుకోక కేవలం ‘ధన సంపాదన’ ధ్యేయం అన్నట్టు ప్రవర్తించడంవల్ల పరిష్కరించలేని మానసిక చికాకుల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాడు. శక్తికి మించి సంపాదించాలనుకోవడం అవివేకం. పక్కవారికన్నా ఎక్కువగా ఉండాలనుకోవడం వ్యర్థమైన ఆలోచన. మనమేంటో మన సంపాదన ఏమిటో మన చదువు సంధ్యలేమిటో అని చూసుకోవడం కాదు అసలు మనకున్న అవసరాలేమిటో ముందు పరిశీలించుకోవాలి. అపుడు ఆ అవసరాలకు తగ్గట్టు సంపాదన ఉంటే చాలు. అవసరాన్ని బట్టి అవకాశమూ బుద్ధి పని చేస్తుంటాయ. కనుక తర్వాతి తరాలకు కాక ఇపుడున్న పరిస్థితులకు ఏవిధంగా ఉంటే సరిపోతుందో దాన్ని చూస్తే సరిపోతుంది.
ఇంకొంతమంది లేనిపోనివి వూహించుకుని అనవసరంగా బాధ పడుతుంటారు. ఏదో జరిగిపోతుందేమో అని ముందే బాధను వ్యక్తం చేస్తుంటారు. అంతేకాదు ఏం జరుగుతుందా అని ఆ జరగబోయేదానికి మనం ఏం చేయాలో అని ఆలోచిస్తుంటారు. ఇది కూడా వ్యర్థమైన పనులే. కనుక ఇట్లాంటివి మానేసి ఎప్పటి కయ్యది ఆ మాటలే కాదు ఆ చేతలు చేయాలి. అపుడే అందరూ సంతోషంగా కాలం గడుపుతారు. అట్లా చేయాలంటే కొన్ని నియమాలు పెట్టుకోవాలి.
ఏకాంతం
కుటుంబానికి వౌలిక వసతులు కల్పించాక
అలసిసొలసిన జీవుడికి మానసిక ప్రశాంతత ఎంతో అవసరం. ఇందుకు ఏకాంతం అనే ‘ఆశ్రమాన్ని’ ఆశ్రయించాలి.
కర్తవ్యం
మనిషి తన కర్తవ్యాన్ని మరువరాదు. ఒక క్రీడాకారుడు తనకు నైపుణ్యం వుంటేనే మైదానంలో రాణించగలడు. తన బృందాన్ని విజయంవైపు నడిపించుకోగలడు. ఇది అతని కర్తవ్యం. అలానే జన్మించిన ప్రతీ మనిషి తన కర్తవ్యాన్ని పక్కనపెట్టి జీవించడం ధర్మమార్గం కాదు.
సాయం
కొంతలో కొంత సాయం చేయాలి. అది ఎంత మందికి అని అక్కర్లేదు. అవసరమైన వారికి చేతనైనంత సాయం చేయాలి. అపుడే మనసు ప్రశాంతత చెందుతుంది. దీనివల్ల తనతోపాటు సమాజానికి మేలు చేకూరుతుంది.
మానవతావిలువలు
ప్రతి మనిషికి వినయం, అణుకవ తప్పక ఉండాలి. వినయం అంటే గొప్ప ఆత్మవిశ్వాసంతో ఉండడం, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనభావాన్ని, నిరాశా నిస్పృహలను మనస్సులోకి రానివ్వకూడదు. అపుడే ఏ పరిస్థితులు వచ్చినా మనిషిగా ప్రవర్తించాలి. అదే మానవతావిలువలతో ఉండడం.
ఏకాగ్రత
ధర్మానికి దూరమైన వ్యక్తికి ఏకాగ్రత కరువై వుంటుంది. చికాకు ఆవరించి వుంటుంది. విచ్చలవిడిగా వున్న కోరికలను త్యజించి, అహంకారాన్ని తొలగించుకొని, వినమ్రతతో, ఏకాగ్రతతో, ఉత్తముడిగా ఉన్ననాడు ఏ పోటీలోనైనా అవలీలగా విజయాన్ని సాధిస్తాడు.
ఇవన్నీ ఎవరికి వారు పరిశీలించుకుని ముందుకు పోతే విజయం సొంతం తప్పక మీదే అవుతుంది.

- శృతి