సబ్ ఫీచర్

గమ్యానికి దగ్గరి మార్గం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతీ ఉదయం నూతనమే. కొత్త విషయాలు నేర్చుకోవడంలో కొత్త పరిచయాలు పెంచుకోవడంలో మనల్ని మనం సుసంపన్నం చేసుకోవాలి.
ఏ మనిషైనా ఒక రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలంటే కనీసం పదివేల గంటలైనా కృషి చెయ్యాలన్నది ఓ శాస్ర్తియ అంచనా. ప్రతిరోజు లక్ష్యానికి అనుగుణంగా పనులు ఒక క్రమపద్ధతిలో చేస్తూ ఉంటే ఫలితాలు అనుకున్నట్టే వస్తాయ. అంతేకాని అన్న ప్రాసన రోజే ఆవకాయ అన్నం తినాలి అన్నట్టు అవుతుంది. అంటే మనలో అందరికీ గొప్పవాళ్లయ్యే అవకాశం ఉంది. మనకి ఇష్టమైన రంగంలో ప్రతిరోజూ వీలైనంత సేపు కృషి చేస్తే మనకీ చరిత్రలో సమున్నత స్థానం లభించే అవకాశం ఉంది.
మనం జీవితాన్ని ప్రతిక్షణం ఆనందంగా ఆస్వాదించాలంటే మన ఆరోగ్యం, ఆలోచనలు సరైన రీతిలో ఉండాలి. ఆరోగ్యం కోసం ప్రతిరోజూ వ్యాయామం, సమతులాహారం తప్పనిసరి ఉండేలా చేయాలి. మంచి ఆలోచనల కోసం ఉత్తమ సాహిత్యం, సంగీతం, ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన లాంటివి ఎంతగానో పనికి వస్తాయ. కనుక ప్రతిరోజు ఇవన్నీ రోజువారి పనుల్లో భాగం అయ్యేట్టు చేసుకోవాలి.
ప్రతిరోజూ ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోవాలంటే మనం కుటుంబ సభ్యులతోను, స్నేహితులతోను, ఆఫీసులో కొలీగ్స్‌తోను సత్సంబంధాలను నెలకొల్పుకోవాలి. ఇది అత్యంత అవసరమైనది. ఎవరితో పోట్లాడడమో లేక ఏదో ఒక విషయానికి మాటమాట అనుకోవడం మనస్పర్థలు రావడం కనుక జరిగితే ఎదుటివాళ్ల తప్పే ఉన్నా కూడా ఇవతల వాళ్లు కూడా కొంత బాధపడాల్సే ఉంటుంది. ఇరువురికి మానసిక సంతులనం దెబ్బతింటుంది. దాంతో చెడుఆలోచన్లు మొదలవుతుంది. మనసు అల్లకల్లో లం అవుతుంది.
ఇంటిలో కుటుంబ సభ్యులందరి మధ్య ఆప్యాయతలు అనురాగాలు పెంచుకోవాలి. ఆఫీసుల్లో కూడా పరిమితి దాటని స్నేహాన్ని చేయాలి. దాని వల్ల చేసే ప్రతి పనిని ఏకాగ్రతతో, అంకితభావంతో చెయ్యగలిగే అవకాశం ఉంటుంది. జీవితంలో స్నేహితుల ప్రభావం ఎంతో ముఖ్యమైనది. మనలో బాధని, సంతోషాన్ని చెప్పుకోవడానికి, మనం సాధించిన విజయాల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, మనం ఎదుర్కొన్న పరాజయాల్ని మరచిపోయి కొత్త ప్రయత్నాలు ప్రారంభించడానికి మన చుట్టూ ఉన్నవారు మనలను ఆశీర్వదించేవాళ్లే ఉంటారు. ఎంకరేజ్ చేసేవాళ్లే ఎక్కువ అవుతారు. ఆఫీసులో పనుల్ని సకాలంలో పూర్తిచెయ్యడానికి, టీమ్ స్పిరిట్‌తో ముందుకెళ్లడానికి కొలీగ్స్‌తో సత్సంబంధాలు తప్పనిసరి.
మంచి పుస్తకానికి మించిన మిత్రుడు ఉండడు. కనుక మంచి పుస్తకాలు చదవుడం పెద్దవాళ్ల జీవితానుభవాలను తెలుసుకోవడం, వారి జీవితచరిత్రలను చదవడం లాంటివి చేస్తే మనకు ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలో తెలుస్తుంది. ఇలా రోజూ వ్యవహరిస్తే మనలో ఉన్న ద్వంద్వ భావాలను, ఆత్మన్యూనతను, అహంకారాన్ని, అసూయని, ద్వేషాన్ని జయించగలుగుతాము.
*