సబ్ ఫీచర్

ప్రణబ్ గళంలో సమైక్యతా రాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ రాష్టప్రతి, రాజకీయ మేధావి ప్రణబ్ ముఖర్జీ నాగపూర్‌లో ఇటీవల జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సమావేశంలో దేశభక్తి, జాతీయ సమైక్యత, సంస్కృతి గురించి ప్రసంగించటం విశేషాంశం అయింది. ఆరెస్సెస్ సభలకు ప్రముఖ వ్యక్తులు హాజరు కావడం అపూర్వం కాకపోయినా, కాంగ్రెస్, భాజపాలు 2019 ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ ప్రణబ్ నిర్ణయం సంచలనం సృష్టించింది. సంఘ్ సమావేశానికి ప్రణబ్ హాజరు కావటం పట్ల కొందరు కాంగ్రెస్ నేతలు వౌనం వహించడం, ఇంకొందరు అసంతృప్తి వ్యక్తం చేసినా- ఆరెస్సెస్ కార్యకర్తలకు, బిజెపి నేతలకు కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. దాదాపు అరవై వేల శాఖలు దేశవ్యాప్తంగాను, వివిధ రంగాలలో 130 పైగా అనుబంధ సంస్థలున్న ఆరెస్సెస్ భారతీయ జనతా పార్టీకి సైద్ధాంతిక ఆశయదీప్తికి ఆలంబనంగా ఉంది.
నూరేళ్లకు పైబడి సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ భాజపాకు బలమైన ప్రతిపక్ష పార్టీ. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సహజంగా ఎదుర్కొంటున్న రాజకీయ ఒడిదుడుకుల నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రణబ్ ప్రసంగించటంలో ఎటువంటి రాజకీయ దృక్కోణం లేకపోయినా పరోక్షంగా స్ఫూర్తిదాయకం అయింది. 2019 ఎన్నికల రణరంగానికి కత్తులు నూరుకొంటున్న కాంగ్రెస్, బిజెపిలు ప్రణబ్ చేసిన ‘విభీషణ భాషణాన్ని’ సీరియస్‌గా తీసుకొంటాయా? లేదా? అనేది విభిన్నమైన అంశం. ఆరెస్సెస్ నుంచి ప్రణబ్‌కు ఆహ్వానం అందినప్పటి నుంచి ఆయనకు ఏం చెప్పాలో ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేతలకు మింగుడు పడలేదు. ఆ ఆహ్వానాన్ని తిరస్కరించవలసినదిగా ప్రణబ్ కుమార్తె స్పష్టం చేసినా ప్రయోజనం లేకపోయింది. ప్రణబ్‌కు కూడా ఈ సమావేశం కత్తిమీద సాము అయింది. అయినా ప్రశంసలు, నిందలు లేకుండా మేధావిగా జాతి సౌభాగ్యాన్ని ఆయన ఆకాంక్షించారు.
రాష్టప్రతిగా ప్రణబ్ ముఖర్జీ ముక్కు సూటిగా వ్యవహరించిన దీక్షాదక్షుడు. 2015 జనవరిలో- ‘అధికార పక్షాన్ని ప్రతిపక్షం నిలదీయవచ్చు కాని పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా చట్ట నిర్మాణాలను నిరోధించటం తగదు’ అని ఆయన మందలించారు. అదే విధంగా అధికార పక్షాన్ని- ‘అత్యవసరమయితే తప్ప ఆర్డినెన్స్‌లు ప్రవేశపెట్టడం తగద’ని హెచ్చరించారు. 2016 జనవరిలో విడుదలైన తన స్వీయచరిత్రలో అయోధ్య వివాదానికి సంబంధించిన అంశంలో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ తొలి తప్పును, తదనంతర రాజకీయ పరిణామాలలో మసీదు విధ్వంసనాంశంలో అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు వైఖరిని ప్రణబ్ తప్పుగా ఎత్తిచూపారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు- దేశ స్వాతంత్య్రానికి పూర్వం, అనంతరం కూడా భారత జాతితో 93 ఏళ్ల అనుబంధం కొనసాగుతోంది. సైద్ధాంతిక విభేదాలతో వ్యతిరేకించిన జాతినేతలు కూడా ఆర్‌ఎస్‌ఎస్ దేశభక్తిని ఎన్నడూ శంకించలేదు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసి, (అనంతరం భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడిగా పేరొందిన) శ్యామప్రసాద్ ముఖర్జీ పాకిస్థాన్‌తో సంబంధ బాంధవ్యాల కేంద్ర ప్రభుత్వ విధానాలు నచ్చకపోవడంతో రాజీనామా చేశారు. . అంతకుముందు 1915 నుంచి 1937 వరకు కాంగ్రెస్ సంస్థలో హిందూ జాతీయవాదం అంతర్భాగంగా సాంవత్సరిక సమావేశాలుండేవి. నాలుగుసార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసిన పండిత మదనమోహన మాలవ్యాకు, ఆయన మరణించిన 69 సంవత్సరాల తరువాత మోదీ ప్రభుత్వం ‘్భరతరత్న’ పురస్కారం ప్రదానం చేసింది. తొలితరం జాతీయ నేతలలో తిలక్, గాంధీ, మాలవ్యా, అరబింద ఘోష్, సావర్కార్, కె.ఎమ్.మున్షీ వంటి ఎందరో ప్రముఖులు హిందుత్వం జాతి ఐక్యతా సాధనంగా ప్రగాఢంగా జాతికి మార్గదర్శకులయ్యారు. హిందూ జాతి ఐక్యతను బ్రిటిష్ పాలకులను పారద్రోలటానికి శక్తివంతమైన శక్తిగా తొలితరం నేతలు గుర్తించి శ్రమించారు. 1920లో నాగపూర్ జాతీయ కాంగ్రెస్ మహాసభలకు వాలంటీర్ల కమిటీ కన్వీనర్, సెంట్రల్ ప్రావినె్సస్ కాంగ్రెస్ అగ్రనేత డాక్టర్ కేశవ బలీరామ్ హెడ్గేవార్ సారథ్యం వహించారు. 1904లో వీర సావర్కార్ పూణెలో ‘అభినవ భారత్’ సంస్థను స్థాపించారు. క్రమేపీ హిందుత్వ భావన బలపడింది.
ప్రణబ్ ముఖర్జీ ఇటీవల ఆరెస్సెస్ సమావేశంలో నిష్కళంక దేశభక్తునిగా ప్రశంసించిన డా.కేశవ బలీరాం హెడ్గేవార్ 1925లో రాష్ట్రీయ సేవాసంఘ్‌ను స్థాపించారు. క్రమేపీ అఖండ భారత్‌గా హిందుధర్మ ప్రతిష్ఠాపన ఆశయమైంది. వందేమాతరం రణ నినాదమైంది. హిందూ మహాసభ, సనాతన ధర్మసభ, ఆర్యసమాజ్, భారత సాధుసమాజ్ వంటి సంస్థలు అప్పటికే చురుకుగా వున్నాయి. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ముస్లిమ్‌లలో నెలకొన్న ఆగ్రహాన్ని సత్యాగ్రహోద్యమానికి వినియోగించాలనే రాజనీతిజ్ఞతతో గాంధీజీ స్వాతంత్య్ర పోరాటాన్ని నడపటం, ముస్లిమ్‌లకు అత్యధికంగా విలువ ఇవ్వటం నాగపూర్ కాంగ్రెస్ సభల్లో డాక్టర్ హెడ్గేవార్ వంటి సమరయోధులకు రుచించలేదు. 1922లో స్వాతంత్య్ర వీర సావర్కార్ హిందుత్వ ఆశయ బీజం అంకురించింది. ఖిలాఫత్ ఉద్యమ సందర్భంలో బ్రిటిష్ రాజద్రోహ నేరంపై డాక్టర్‌జీని బ్రిటిష్ ప్రభుత్వం ఒక సంవత్సరం కఠిన కారాగారశిక్షతో నిర్బంధించింది. తదనంతరం ద్విజాతి సిద్ధాంతం ఫలితంగా దేశ విభజన అనివార్యమైంది.
హిందూ రాష్ట్ర ఆవిర్భావానికి క్రమేపీ 1946-1948 మధ్య కాలంలో గాంధీజీని శత్రువుగా కొందరు పరిగణించారు. 1948లో గాంధీజీ హత్యానంతరం ఆర్‌ఎస్‌ఎస్ నేతలు గురూజీ గోళ్వల్కర్ సహా కొందరిని కేంద్రం నిర్భంధించింది. 1948 ఫిబ్రవరి 4న ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించి, 1949 జూలై 11న నిషేధం ఎత్తివేసింది. గాంధీజీ హత్యతో ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం వుందా? లేదా? అనేది వివాదాస్పదం. ఏది ఏమైనా మతోన్మాదమే గాంధీజీని పొట్టన పెట్టుకొందన్న ఆరోపణలు వచ్చాయి. సంఘ్‌కు నిశ్చితమైన సిద్ధాంతం వుంది. సుశిక్షితులైన దేశభక్తి, క్రమశిక్షణ, ఆశయదీప్తి కలిగిన బలగం వుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో నాగపూర్‌లో ప్రణబ్ ప్రసంగం చరిత్రాత్మకం.

-జయసూర్య 94406 64610