సబ్ ఫీచర్

మహానేత మార్గం శిరోధార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శసేవలో ప్రాణాలు కోల్పోయిన నేతల్ని వేళ్ల మీద లెక్కించవచ్చు. అటువంటి అద్భుతమైన మహా నాయకుల్లో డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ఒకరు. వ్యక్తిగత ప్రతిష్టకన్నా దేశహితమే ప్రధానమన్నది ఆ యన విధానం. భారత్ నుంచి జమ్ము-కాశ్మీర్ చేజారిపోకుండా ఉంచటంలో ఆయన చూపిన చొరవ జాతి గుర్తించుకోదగినది. చివరకు కాశ్మీర్ అంశంపై పోరాటంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. నేడు దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతాపార్టీకి మూలమైన భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవ స్థాపకుడు ఆయనే.
శ్యామ్‌జీ 1901 జూలై 6న కలకత్తాలో జన్మించారు. తండ్రి సర్ అశుతోష్ ముఖర్జీ గొప్ప విద్యావేత్త, న్యాయ శాస్త్ర నిపుణుడు. అశుతోష్ కలకత్తా యూనివర్సిటీకి మొదటి వైస్ ఛాన్సలర్. శ్యామ ప్రసాద్ 1921లో బీఏ ఇంగ్లీష్ లిటరేచర్‌లో ప్రథముడిగా ఉత్తీర్ణులయ్యారు. ఆంగ్ల భాషను వదిలేసి 1923లో బెంగాలీలో ఎంఏ పరీక్ష రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు అయ్యారు. న్యాయవిద్య పూర్తి చేసి కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా ప్రవేశించారు. ఆ తర్వాత విద్యా రంగంలోకి వచ్చారు. తన తండ్రి వైస్ ఛాన్సలర్‌గా పని చేసిన కలకత్తా విశ్వ విద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా శ్యామ్‌జీ 33 ఏళ్ల చిన్న వయసులో బాధ్యతలు చేపట్టి ఎనె్నన్నో సంస్కరణలు చేపట్టారు. స్వాతం త్రోద్యమంలో ప్రవేశించాక, భారతీయులంతా స్వాభిమానంతో తల ఎత్తుకొని తిరగాలని శ్యామ్‌జీ కాంక్షించారు. ఇందుకోసం ఆయన పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్‌తో మంచి సంబంధాలున్నాయి. దేశంలో నెలకొన్న అంధకార వాతావరణంలో ఆర్‌ఎస్‌ఎస్ మాత్రమే ఆశాకిరణం అన్నది ఆయన అభిప్రాయం. ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్‌చాలక్ కేశవ బలిరాం హెడ్గేవార్ (డాక్టర్జీ)ని కలిశాక ఆయన జీవితం అనుకోని మలుపు తిరిగింది.
రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాలని భావించిన శ్యామ్‌జీ అందుకు తగినట్లుగానే ఉద్యమాలు, ప్రజా పోరాటాల్లో చైతన్య వంతంగా పాల్గొనేవారు. 1946 ఎన్నికల్లో కలకత్తా విశ్వ విద్యాలయ నియోజకవర్గం నుంచి బెంగాల్ అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1941-42 లో బెంగాల్ ప్రావిన్సు మొద టి ఆర్థికమంత్రిగా పదవిని చేపట్టారు. అనతికాలంలోనే హిందువుల తరఫున మాట్లాడే వక్తగా పేరు పొంది హిందూ మహాసభలో ప్రవేశించి 1944లో ఆ సంస్థ అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత రాజ్యాంగ సభకు బెంగాల్ అసెంబ్లీ ప్రతినిధిగా ఎన్నికయ్యారు. రాజ్యాంగం, ప్రభుత్వ విధి విధానాలు ఏర్పాటు చేయటంలో ముఖ్య పాత్ర పోషించారు. విద్యావేత్తగా, న్యాయ కోవిదునిగా అప్పటికే పేరు ప్రఖ్యాతులు ఆయనకు ఉన్నాయి. ఈలోగా దేశంలో స్వార్థపూరిత రాజకీయశక్తులు విజృంభించాయి. పాకిస్తాన్ కోసం దేశ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టేందుకు ఈ స్వార్థ శక్తులు సిద్ధపడిన పరిస్థితి అది. కలకత్తా సహా బెంగాల్‌ను పూర్తిగా పాకిస్తాన్‌లో కలపాలని ప్రయత్నించారు. బెంగాల్ విభజన అనే ఆలోచననే సాధారణ బెంగాలీలు భరించలేరు. 1905లో లార్డ్ కర్జన్ ఈ ప్రయత్నం చేసి వందేమాతరం ఉద్యమంతో చేతులు కాల్చుకున్నాడు. దేశ విభజన ఏకపక్షంగా జరగకుండా, బెంగాలీలను ఏకం చేస్తూ శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రారంభించిన ఉద్యమం అటు ముస్లింలీగ్, ఇటు కాంగ్రెస్‌ను కూడా భయపెట్టింది. తాను విభజనవాదినని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దుష్ప్రచారాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టారాయన. బెంగాల్‌ను పాకిస్తాన్‌లో పూర్తిగా విలీనం చేస్తే భవిష్యత్తులో ఆ దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని హెచ్చరించారు. అలా జరిగితే పెద్దసంఖ్యలో హిందువులు ఉద్యమించి తూర్పు పాకిస్తాన్ (బెంగాల్) ను తిరిగి భారతదేశంలో కలుపుతారని స్పష్టం చేశారు. దీంతో అప్పటి బ్రిటీష్ పాలకులు ఆలోచనలో పడ్డారు. ఇటు స్వార్థ పూరిత శక్తులు కూడా వెనుకంజ వేయాల్సి వచ్చింది. ఇండియాను చీల్చి పాకిస్తాన్ ఏర్పాటు చేస్తే, పాకిస్తాన్ పుట్టక ముందే ఆ దేశాన్ని చీల్చేశారు ముఖర్జీ.
ఎట్టకేలకు దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. అయితే రాజ్యాంగం రూపుదాల్చే వరకు పరిపాలన కోసం కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. దీనికి ప్రధానమంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ, 14 మంది మంత్రులుండగా అందులో ఏడుగురు కాంగ్రెసేతరులు. వీరిలో శ్యామప్రసాద్ ముఖర్జీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు. ముఖర్జీ విద్యాశాఖను కోరుకున్నా పరిశ్రమల శాఖను అప్పగించారు. ప్రధానిగా నెహ్రూ ఎప్పుడూ ఆధిపత్య ధోరణి ప్రదర్శించేవారు. ఇది శ్యామ్‌జీకి నచ్చేది కాదు. చాలా అంశాల్లో ప్రధాని నెహ్రూతో విబేధాలుండేవి. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడలేని వ్యక్తిత్వం ముఖర్జీది. శరణార్థుల విషయంలో నెహ్రూ ధోరణిని నిరసిస్తూ కేంద్రమంత్రి పదవికి ముఖర్జీ రాజీనామా చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత ఎం.ఎస్. గోల్వార్కర్‌జీతో ముఖర్జీ లోతుగా చర్చలు జరిపారు. రాజకీయాలకు ఆర్‌ఎస్‌ఎస్ దూరం అని గురూజీ స్పష్టం చేశారు. అయితే సంఘ్ భావనలతోనే రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా శ్యామ్‌జీ అడుగులు వేశారు. భావ సారూప్యం గల నాయకులతో కలిసి 1951న ఢిల్లీలో ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించారు. ఆ పార్టీ సంస్థాపక అధ్యక్షుడిగా ముఖర్జీ వ్యవహరించారు. గోహత్య, కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 రాజ్యాంగ ప్రకరణపై జనసంఘ్ వ్యతిరేకత చూపింది. 1952 ఎన్నికలలో జనసంఘ్ పార్టీ 3 స్థానాలలో విజయం సాధించగా, అందులో ఒక స్థానం నుంచి ముఖర్జీ విజయం సాధించారు. ఇలా జాతీయ భావాలు కలిగిన ఒక రాజకీయ పార్టీ పురుడు పోసుకొంది.
జమ్మూ కశ్మీర్‌కు ఏ రాష్ట్రానికి లేని ప్రత్యేకతలు కట్టబెట్టారు. ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రధాన మంత్రి, ప్రత్యేక పతాకం, రాజ్యాంగం ఉండేలా ఒప్పం దాలు జరిగాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ప్రత్యేక చట్టాలను రూపొందింది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 రూపంలో రక్షణ కల్పించారు. ఇవన్నీ జాతీయ వాదుల మనస్సుల్ని కలచి వేశాయి. ప్రభుత్వ పోకడలను ఎదిరిస్తూ ఆందోళనకు రంగం సిద్ధం అయింది. దీనికి శ్యామ్ జీ నాయకత్వం వహించారు. 1953 మేలో ఆయన జమ్మూ యాత్రను తలపెట్టగా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ ఆయన కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించ గానే పోలీసులు అరెస్టు చేసి శ్రీనగర్ జైలుకు ఆయనను తరలించారు. ముఖర్జీ అరెస్టు వార్త తెలిశాక దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయినా నెహ్రూ ప్రభుత్వం మొండిపట్టుతో వ్యవహరించింది. చివరకు 1953 జూన్‌లో నిర్బంధంలోనే శ్యామ్‌జీ కన్ను మూశారు. ఆయన స్థాపించిన జన సంఘ్ పార్టీ తర్వాత కాలంలో దేశమంతా విస్తరించింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో ప్రజల తరపున జనసంఘ్ తీవ్రంగా పోరాడింది. అప్పటి జాతీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీని జనతా పార్టీలో విలీనం చేశారు. కానీ తర్వాత పరిస్థితుల్ని గమనించి, జనతా పార్టీ నుంచి విడిపోయి భారతీయ జనతా పార్టీ గా ఏర్పాటు చేశారు. అనంతరం భాజపా దేశవ్యాప్తంగా విస్తరిం చింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించటంతో పాటుగా అత్యధిక రాష్ట్రాల్లో పరిపాలన సాగిస్తోంది. ఇంతటి ప్రజాస్వామ్య పార్టీకి నాంది పలికిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలు చిరస్మరణీయం.

-ఎన్వీ సుభాష్ 98490 26212