సబ్ ఫీచర్

ఆలోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. వారంతా శిరీషను మెచ్చుకుంటూ తమ వంతు సాయం చేస్తున్నారు. అందులో అపర్ణ వంతు వచ్చింది. చాలా ఆశ్చర్యంగా అబ్బురంగా శిరీషను చూసింది.
‘చివరకు సాధించావన్నమాట’ అంది అపర్ణ
శిరీష పెదవులపై చిన్నగా నవ్వు విరిసింది.
‘అమ్మో ఈ చిరునవ్వు చాలా అరుదైనది అమూల్యమైనది. ఎంతో కష్ట పడిన తర్వాత వస్తున్నది’ అప్పటివరకు ప్రశాంతగా ఉన్న మనసు మళ్లీ ఆలోచన సంద్రంగా మారిపోయింది. అవును ఈ అపర్ణ చెప్పింది నిజమే. నన్ను నేను సంబాళించుకోవడానికి ఎన్నో నెలలు పట్టింది. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. నిజమేకదా శిరీష మనసు చెబుతోంది.
అంతలో ఎవరో అసలీ ఆలోచన ఎలా వచ్చింది అని అడిగారు. దానికి అపర్ణ విషయాలను సమగ్రంగా చెప్తున్నట్టు ఉంది.
శిరీష మనసు గతాన్ని స్పృశించడం మొదలుపెట్టింది.
ఆరోజు ఆఫీసు నుంచి వస్తుంటే రోడ్డుపక్కన ఆకలితో నకనకలాడుతూ ఓ ముదుసలి పడున్నాడు. ఎవరూ పట్టించుకోవడం లేదు. అమ్మా అని అడగడానికి కూడా ఓపిక లేనట్టు ఉన్నాడు. శిరీష ఆయన్ను చూడగానే మనసు తరుక్కుపోయింది. కాని అది ఇంటికి, ఆఫీసుకు మధ్యదారి. ఇంకో గంట బస్సు ప్రయాణం చేస్తే కాని ఇల్లు చేరదు. పోనీ దగ్గరలో ఏదైనా కొనిద్దామంటే అక్కడంతా పానీపూరీలు, సోడాబండ్లు తప్ప అక్కడేమీ లేవు.
శిరీష ఏం చేయకుండానే ఇంటికి వచ్చింది. కాని ఆమె మనసు పొరల్లో ఆ ముసలాయన చిక్కుకుని పోయాడు. రాత్రంతా ఇటువంటి వాళ్లను ఈమధ్య చాలామందిని చూస్తోంది. లేవడానికి శక్తి లేనివాళ్లు , కళ్లు కనిపించని వాళ్లు, రోగాలతో బాధపడుతున్నవారు చాలామంది అనాథలుగా మారి రోడ్డు పక్కన ఉంటున్నారు.
దేశమంతా ముందుకు పోతోంది. కాని కొంతమంది మాత్రం ఇంకా వెనుక బడే ఉన్నారు. అందుకే తనకు తెలిసిన అందరినీ కూడగట్టింది. ఊరికి దూరంగా ఎప్పుడో పెరుగుతుంది అనుకొని కొన్న ఫ్లాట్ ను ఆశ్రమంగా మార్చింది. అందులో అనాథలుగా మారి చూచేవారు లేక అవస్థలు పడుతున్న వారికి ఆశ్రయం కల్పించడం ఆరంభించింది.
మొట్టమొదట ఆ ముసలాయన్ను తాత అంటూ ఆ ఆశ్రమానికి తీసుకొని వచ్చింది. తానే స్వయంగా వంట చేసి అన్నం తినిపించి సేద తీర్చింది. ఆ తరువాత మెల్లమెల్లగా సామాజిక స్పృహ ఉన్న డాక్టర్లను సంప్రదించింది. వారు కూడా సామాజిక సేవ చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతినెల వచ్చి ఇక్కడ ఉన్న వారి ఆరోగ్యాన్ని చెక్ చేస్తారు. అవసరమైన మందులు వారి ఖర్చుతో తెచ్చి ఇస్తారు.
నేడు అన్ని సదుపాయాలతో ఉన్న ఆ ఆశ్రమానికి ‘మా ఇల్లు’ అన్న పేరు శిరీష పెట్టింది. అందులో ఇప్పుడు దాదాపు 50 మంది దాక ఉన్నారు. వారంతా శిరీషను మా అమ్మాయి అంటారు. వారినంతా వారి వారి వయస్సులను బట్టి తాత, అవ్వ, బాబాయి, పిన్ని అంటూ పిలుస్తుంది శిరీష.
తనకు తెలిసిన వారి సలహా మేరకు ఆశ్రమంలో ఓ డబ్బాను పెట్టింది. ఆశ్రమాన్ని చూడడానికి వచ్చిన వారి మనసుకు తోచినంత డబ్బును ఆ డబ్బాలో వేస్తారు. ఆ డబ్బును తీసుకొని మా ఇంట్లో ఉన్నవారి సదుపాయాలకోసం ఖర్చు పెడుతుంది శిరీష.
రోడ్డు పక్కన కనిపించే వారిని ఎవరైనా సరే తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో చేర్చవచ్చు, లేకుంటే వారికై వారు ఇక్కడ ఉండడానికి రావచ్చు. మా ఇల్లు లో ఉండడానికి ఏ రుసుము చెల్లించక్కర్లేదు. చేవ గలిగి చేతనైతే తనతో ఉన్నవారికి ఏదైనా సాయం చేయవచ్చు అనే బోర్డును మా ఇల్లు పైన వేలాడ దీసింది శిరీష.
శిరీష చేస్తున్న ఈ పనికి చాలామంది మెచ్చుకొన్నారు. అంతటితో ఆగకుండా ఒకరు వీరికి రోజూ వంట చేయడానికి ముందుకువచ్చారు. ఇంకొకరు వీరికి దైనందిన కృత్యాలు చేసుకోవడంలో సాయం చేయడానికి ముందుకొచ్చారు. మరికొందరు వైద్యసహాయం చేయడానికి వచ్చారు. ఇంకొంతమంది దుస్తులని ఇంకా వీరికి కావాల్సిన అన్నీ సదుపాయాలను చేయడానికి జనం వస్తూనే ఉన్నారు. ఇక్కడ చేరడానికి మనుష్యులు వస్తూనే ఉన్నారు. ఇలా సాగుతూనే ఉంది.
నేడు సాయం చేయాలని మనసు ఉండాలి కాని మార్గాలు ఎన్నో ఉంటాయి శిరీష మంచి పని చేసింది అంటూ అందరూ అనడం విన్న శిరీషకు మనసు తృప్తిగా అనిపించింది.
మనుష్యుల్లో మంచితనం, మానవత్వం ఉన్నాయి. కాని కొన్నిసార్లు అవి అణగారి పోతున్నాయి. బహుశా ఎదురౌతున్న పరిస్థితులకు అలా తయారౌతున్నారేమో అందుకే పరిస్థితులను మార్చాలి. ఒక్కరే బాగుండాలి అని కాక అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి అనుకోవాలి అందరూ అనుకొంది శిరీష.

- సౌమ్య