సబ్ ఫీచర్

మనకు మనమే... శ్రద్ధ తీసుకోవాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన సంగతి మనమే చూసుకోవాలి...
నిద్ర లేచింది మొదలుకొని ఇల్లు క్లీన్‌గా పెట్టడం, వంట చేయడం, పిల్లల్ను రెడీ చేయడం వారిని స్కూల్స్ , కాలేజ్స్‌కు పంపడం, భర్త ఆఫీసుకు రెడీ అవడంలో సహాయం చేయడం, అందరికీ టిఫిన్ బాక్స్ సర్దడం, ఇంట్లో ఉన్నవారికి కావాల్సిన సదుపాయాలు అమర్చడం, చివరకు తాను రెడీ అయి ఆఫీసుకు వెళ్లడం .. ఇలాంటి వన్నీ సహజంగా అందరి ఇండ్లల్లో జరుగుతున్నవే.
కాని ఇట్లా చేసేటపుడు భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైనా కూడా భార్య మాత్రమే ఎక్కువ పనిని చేస్తుంటుంది. దీనికి ఎన్ని కారణాలు చెప్పుకున్నా తక్కువే. అలవాటు ప్రకారం నిద్ర లేచింది మొదలుకొని తిరిగి పడుకునేదాకా ప్రతి మహిళా ఏదో ఒక పనిలో నిమగ్నమై కనిపిస్తుంది. కాని, ఊరికినే బాతాఖాని కొట్టడమో, లేక ఉబుసుపోక టీ తాగుతూనో సిగరెట్ ఊదుతూనే పక్కవారితో కాలక్షేపం చేసే ఆడవాళ్లు మచ్చుకు కూడా కనిపించరు.
ఈ రకంగా పనిచేయడం ముందునుంచి ఉన్నదే. ఇంకా ఇప్పుడు ఫలానా ఫలానా సంస్థలకు వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేయడం, అక్కడున్న బాస్ ల మాటలు వింటూ వారిని మెప్పించేలా ఉద్యోగాలు చేయడం కొత్తగావచ్చినవి.
కొన్నాళ్లక్రితం వరకు భర్తసంపాదనను పొదుపుగావాడితే ఆ ఇల్లు నందనవనం అవుతుందని ఆ ఇల్లే సర్గసీమను అని అనేవారు కాని ఇపుడు ఆ ఇంతి ఇంతింతై వటుడింతయై అన్నట్టుగా అటు ఉద్యోగమూ ఇటు ఇంటి బాధ్యతలనూ మోస్తోంది.
ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని, ఆర్థికభారాన్ని అన్నింటినీ తన అదుపులో ఉంచుకుంటుంది. అందరికీ అన్నీసౌకర్యాలను అందించడంలో తాను కర్పూరంగా కరిగిపోతుంది కూడా.
కాని తన ఆరోగ్యాన్ని మాత్రం తాను చూసుకోదు. రాత్రిళ్లు తినేటపుడు వండిన ఆహారం తక్కువగా ఉన్నా ఫర్వాలేదులే అని సర్దేసుకుంటుంది. ఒక్కోసారి కడుపునిండా తిండి కూడా తినదు. తలనొప్పి అయినా ఒంటి నొప్పి యైనా ఏదో అయోడెక్స్ లాంటివి పట్టించుకుని పనిలో లీనమైపోతుంటుంది మహిళ.

--జి.కల్యాణి