సబ్ ఫీచర్

విద్యా ప్రమాణాలు పెరగాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత 21వ శతాబ్దంలో అద్భుత ప్రయోగాలు జరిగాయి. చిన్న చిన్న దేశాలు ఏర్పడ్డాయి. మలేషియా నుంచి సింగపూర్ విడిపోయింది. వనరులన్నీ మలేషియాలో ఉండేవి కానీ, ఈనాడు ప్రపంచంలో అమెరికాతో సమానంగా సింగపూర్ ‘జీడీపీ’ ఉంది. ఉత్తర కొరియాలో వనరులన్నీ ఉన్నాయి. కొరియా విడిపోయాక దక్షిణ కొరియా శరవేగంగా అభివృద్ధి చెందింది. స్వీడన్ ఒకనాడు ప్రపంచానికి గడియారాలిచ్చింది. కానీ, ఫిన్లాండ్ ప్రపంచంలో పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నది. పోలెండ్ వంటి చిన్న చిన్న దేశాలు ఏర్పడగానే అక్కడి ప్రజల సంకల్పబలమే ఆ దేశాల అభివృద్ధికి కారణాలుగా నిలిచాయి. మానవ వనరులు లేవని ఆ దేశాలు నిరుత్సాహపడలేదు.
స్వీడన్‌తో ఫిన్లాండ్ ఏ రంగంలోనూ పోటీ పడలేదు. ఇది పోటీల కాలం కాదని, ఇది సహకార యుగమని ఫిన్లాండ్ విద్యా శాఖ మంత్రి స్వీడన్‌కు వెళ్లి అక్కడి విద్యారంగాన్ని పరిశీలించారు. అందరికీ విద్యావకాశాలను సమకూర్చటమే స్వీడన్ అభివృద్ధి రహస్యంగా ఆయన కనుగొన్నారు. విద్యా ప్రమాణాలు పెరగటానికి ఎక్కువ గంటలు పనిచేసేవారు. పిల్లలకు ఎక్కువగా పరీక్షలు నిర్వహించేవారు. హోంవర్క్‌లు ఎక్కువగా ఇచ్చేవారు. ఫిన్లాండ్ దేశం స్వీడన్‌లోని మంచి సంస్కరణలు ఆదర్శంగా తీసుకున్నది కానీ పిల్లలపై భారం మాత్రం వేయలేదు. కొత్త ప్రక్రియను అవలంబించారు. వయోజన విద్యపైన ఎక్కువ దృష్టిని కేంద్రీకరించారు. పెద్దలు చదివితే చిన్న పిల్లలపై ఆ ప్రభావం పడి రెట్టింపు శ్రద్ధతో చదువుతారని వయోజన విద్యను బాగా అమలు జరిపారు. ఫలితంగా ఉన్నత ప్రమాణాలు గల టీచర్లు దొరికారు. ఈనాడు అన్ని వృత్తులకన్నా ఉపాధ్యాయ వృత్తిపై ప్రజలు ఆకర్షించబడ్డారు. ఫిన్లాండ్‌లో చాలామంది ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం తమ దేశభక్తికి నిదర్శనమనుకుంటారు. జీతాలు పెంచటం వల్ల వారు ఉపాధ్యాయ వృత్తిలోకి రాలేదు. తమ తర్వాతి తరం వారు అభివృద్ధి చెందాలంటే పౌరుల మొదటి ప్రాధాన్యత ఉపాధ్యాయ వృత్తి అనుకున్నారు.
నేను ఫిన్లాండ్ వెళ్లినపుడు అక్కడి టీచర్లు ఎందుకు ఉపాధ్యాయ వృత్తి స్వీకరించారో అడిగి తెలుసుకున్నాను. ‘రాబోయే రోజుల్లో దేశం అభివృద్ధిలో కీలకపాత్ర విద్యార్థులది కాబట్టి, విద్యారంగం పని భవిష్యత్తు నిర్మాణానికి మెట్టు’ అని అక్కడి టీచర్లు అన్నారు. చిన్నపిల్లలున్న కేజీ తరగతుల్లో మహిళా టీచర్లు ఉన్నారు. పోస్టుగ్రాడ్యుయేషన్ చదివినవారు టీచర్లుగా పనిచేస్తున్నారు. అక్కడ విద్యా ప్రమాణాలు పెరగటానికి ఎంతో కృషి జరిగింది. వయోజనుల ఆదర్శాలు పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరగటానికి తోడ్పడింది. కొందరికే కాదు, అందరికీ ఉన్నత ప్రమాణాలు గల చదువును ఇవ్వగలిగారు. పెద్దలు చూపిస్తున్న శ్రద్ధ చిన్న పిల్లలకు స్ఫూర్తి అవుతుంది. అనతి కాలంలోనే ఉన్నతమైన ప్రమాణాలు తీసుకువచ్చి ఫిన్లాండ్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 10 సంవత్సరాల ఎస్‌ఎస్‌సి కోర్సును 9 సంవత్సరాలలోనే కొందరు పిల్లలు పూర్తిచేశారు. విద్యా ప్రమాణాలలో ఎలాంటి రాజీ లేదు. దీనివల్ల వారు ఇతర దేశాలకు ఆదర్శమయ్యారు. ఈనాడు ఫిన్లాండ్ ప్రపంచానికే ఆదర్శమైంది.
సౌత్ కొరియా, సింగపూర్ దేశాలు ఫిన్లాండ్ పద్ధతులను ఆచరించి విద్యారంగంలో ఉన్నతమైన ప్రమాణాలు పెంచుకున్నాయి. అక్కడ స్కూళ్ళ మధ్య ఎలాంటి పోటీ లేదు. ఒక స్కూలు ఇంకో స్కూలుకు సహకరిస్తుంది. తక్కువ ప్రమాణంగల స్కూళ్లను ఇతర స్కూళ్లకు సమానంగా తేవడం అన్నది అందరి బాధ్యతగా స్వీకరిస్తారు. ఈనాడు ప్రపంచ పటంలో ఫిన్లాండ్‌కు ఏ స్థానమున్నదో చూడవచ్చు. విద్యాప్రమాణాలను పెంచేది ప్రజల సంకల్పం, ఉపాధ్యాయుల దీక్ష. ఈ ఆశయాలతో మనం చిన్న రాష్ట్రాలను ఏర్పర్చుకున్నాం. పాఠశాలల మధ్య పోటీకన్నా సహకారంతో విద్యా ప్రమాణాలు పెంచే అవకాశం వున్నదని చాలా దేశాల వారు విద్యాయాత్రలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఇటీవల ఫిన్లాండ్‌కు ఓ బృందం పోయి వచ్చింది. ఈనాడు విద్యను ఆర్థిక రంగానికి శక్తిని ప్రసాదించే స్థాయికి తీసుకురావాల్సి వుంది. విద్యా ప్రమాణాలను పెంచేది ప్రజలు, ఉపాధ్యాయుల ఉమ్మడి బాధ్యత. ఆర్థిక వ్యవస్థకు స్కూళ్ళు ఊపిరితిత్తులు.

-చుక్కా రామయ్య