సబ్ ఫీచర్

అధిక కొవ్వును ఆవిరిచేసే అవిసె గింజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజువారీ ఆహారంలో అవిసె గింజల్ని భాగం చేసుకుని తినేవారు ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతారు. పూర్వకాలంలో అవిసె గింజలతో చిట్కా వైద్యాలు ఎన్నో చేశారు మన పెద్దవాళ్లు. ఎముకల అరుగుదల, జాయింట్ పెయిన్స్‌తో బాధపడేవారు అవిసె గింజలను ఆహార పదార్థాలతోపాటు తీసుకుంటే ఈ రోగాలనుండి ఉపశమనం లభిస్తుంది. వీటిలో ఉండే ఒమేగా యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా కొలెస్ట్రాల్ స్థాయిలు చాలావరకు తగ్గుతాయి. మనిషి శరీరంలో అధికశాతంలో ఉండే కొవ్వుని కరిగించడానికి ఉపయోగపడే ఒకే ఒక్క మందు ‘అవిసె గింజలు’ అని, ప్రపంచంలో ఈ అవిసెగింజలు తప్ప వేరే ఏ మందు అయినా సరే బాడీలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో 100 శాతం సక్సెస్ అవ్వలేకపోయాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అవిసె సన్నని కాడలతో 1.2 మీటర్లు పొడవుగా, నిటారుగా మొక్క చివర్లు 20-40 మీటర్లు పొడవు, 3 మీటర్లు వెడల్పు కలిగి ఉంటుంది. పూలు స్వచ్ఛమైన నీలం రంగులో ఉండి పండు గుండ్రంగా, ఒక చిన్న యాపిల్ మాదిరిగా ఉంటుంది. దీనిలోని గింజలు గోధుమ విత్తనాల రంగులో ఉంటాయి. ఆకులు ముదురాకుపచ్చ రంగులో ఉండి వాటిలో గ్లూకోజ్ పిండి పదార్థం ఆయుర్వేద పరంగా ఉపయోగపడుతుంది.
అవిసె గింజలు మనకు ప్రకృతి ఇచ్చిన ఒక వరం. దీర్ఘకాలిక గుండె జబ్బులు, కీళ్ళనొప్పులు, ఆస్తమా, మధుమేహం కలిగించే వాపులు తగ్గించడానికి, ముఖ్యంగా క్యాన్సర్లలో కీలకమైన కోలన్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా శరీరానికి రక్షణ కవచంలాగా సహాయపడుతుంది. అక్రోట్లతో, చేపలతో ఈ గింజలను కలిపి తీసుకుంటే, అవిసె గింజలు నిజమైన సహాయాన్ని అందిస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవటంవలన మీరు కొద్ది ఆహారం తీసుకున్నా, మీ ఆకలి తీరిన పూర్తి అనుభూతి పొందుతారు. బ్లడ్‌షుగర్ స్థిరంగా ఉంటుంది. ప్రేగుల పనితీరు బాగుంటుంది. నిత్యం ఫ్లాక్స్ సీడ్స్‌ను తీసుకోగలిగితే షుగర్ అదుపులో ఉంటుంది. అవిసె గింజలు పిండని ఇడ్లీ దోసె పిండిలో తగు మోతాదులో కలుపుకోవచ్చు. అవిసె నూనెను ఉపయోగించిన వంటలు లేదా అవిసె ఆకును ఆహారంగా తీసుకుంటుంటే తలనొప్పి మటుమాయం అవుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించే ఫ్లాక్స్ సీడ్స్‌లో వుందని రుజువు అయింది. అవిసె గింజల పిండిని చపాతి పిండిలా కలుపుకుని తినవచ్చు. ఫైబర్ తినే కోరికలను అణచివేయడానికి సహాయపడుతుంది. వీటిని ముడిగా నీటితో రోజూ తీసుకున్నందువల్ల మీ జీర్ణ వ్యవస్థను కొనసాగటానికి ఫైబర్‌ను అవసరమైన మొత్తంలో అందిస్తుంది. వీటిని వేయించి తింటే ఈ విత్తనాలు కరకరలాడుతూ రుచికరంగా ఉంటాయి.
కాల్చిన అవిసె విత్తనాల పొడిని ఉడికించిన అన్నంతో తింటారు. పూర్వం రోజుల్లో గ్రామాల్లో వీటిలో కొద్దిగా ఉప్పు, నీరు వేసుకుని కూడా తినేవారు. అవిసె విత్తనాలు చాలాకాలం నిలవ వుండే గుణం కలిగి ఉన్నందున వీటిని కాలానుగుణంగా కూడా వినియోగించుకోవచ్చు. ఫ్యాబ్రిక్, అద్దకం, కాగితం, మందులు, జుట్టుకోసం వినియోగించే జల్‌లు, రకరకాల సబ్బులు చేయడానికి అవిసె గింజలు ఉపయోగిస్తారు. అవిసె విత్తనాలనుండి ఉత్పత్తయ్యే నూనెను వంటకు ఉపయోగిస్తారు. ఈ నూనెలో ఎలర్జీని నివారించే గుణం ఉంది. ఆయుర్వేద వైద్య విధానంలో అవిసె చెట్టు వేరు, ఆకులు, విత్తనాలు, బెరడు మొదలైన అన్ని భాగాల్లోను ఔషధ గుణాలు ఉండటం చేత దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది.

-తరిగొప్పుల విఎల్లెన్‌మూర్తి