సబ్ ఫీచర్

మేలుమేలు సమతులమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య చిన్న పిల్లల్లో కూడా మతిమరుపు కనిపిస్తోంది. పూర్వం అయితే అరవై దాటితే మరిచిపోతున్నాను అనేవాళ్లు కాని ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మరుస్తున్నారు. ఇది కేవలం కొద్దిసేపు మాత్రమే అయితే ఫర్వాలేదు. వైద్యులు మాత్రం మరిచిపోవడం అంటే ఆ విషయం గురించి ఏకాగ్రత లేకపోవడం అంతగా దాన్ని పట్టించుకోకపోవడం వల్లే మరుపు వస్తుంటుంది అని అంటారు. మరుపు అందరిలో కనిపించడానికి కారణం తినే తిండి ప్రభావం కూడా ఉంటుందంటున్నారు. అందుకే మరుపును దూరం చేయడానికి ఏమేమి తినవచ్చో చూద్దాం. మరుపును దూరం చేయడమే కాక జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఈ ఆహారపదార్థాలు మంచి మేలును చేస్తాయంటున్నారు. ఒమేగా -3 ఫాటీ అమ్లాలు మెదడుకు మేలు చేస్తాయట. ఇందులో సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో ఈ ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు లభిస్తాయి. ఈ ఒమేగా -3 కేవలం గుడ్టులోను, వాల్‌నట్స్‌లోకూడా ఉంటుంది. కనుక ఇవేవి తినని వాళ్లు వాల్‌నట్స్ తినడం మంచిది. అట్లాగే గ్రీన్ టీ, స్ట్రాబరీ, బ్రకోలి, క్యారెట్, వెల్లుల్లి ఇంకా ఇతర తృణ ధాన్యాల్లో లభించే యాంటి ఆక్సిడెంట్స్ మెదడును ప్రీరాడికల్స్ నుంచ కాపాడుతాయట. లావు తగ్గడానికే కాక మెదడు చురుకుగా ఉండడానికి కూడా పైబర్ ప్రధాన పాత్ర వహిస్తుంది. కనుక కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అందులో ఖర్జూరాలు, బీన్స్ లాంటి వాటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక వీటిని ఎక్కువగా తీసుకొంటే అటు ఊబకాయం నుంచి విముక్తిని, ఇటు జ్ఞాపక శక్తి పెరుగుదలను కాపాడుకోవచ్చు.
ఒక్కోసారి మన శరీరంలో నీరు తక్కువ అయి పోయినా కూడా మెదడు శక్తిని కోల్పోతుంటుంది. కనుక నీరు ఎక్కువగా తాగాలి. నీరు తీసుకోవడం వల్ల జీర్ణశక్తికూడా మెరుగు అవుతుంది. విటమిన్స్, మినరల్స్ అనేవి శరీరానికి ఎంతో ముఖ్యమో మెదడుకూ అంతే ముఖ్యం కనుక సమతులాహారం తీసుకోవడమే అన్నింటికీ మంచిది.

- కీర్తి