సబ్ ఫీచర్

ఆమె శిక్షణ అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వృత్తిపరమైన ఆటల్లో సాధారణంగా మహిళా జట్లకు కూడా పురుషులే కోచ్‌గా వ్యవహరించడం మనందరికీ తెలిసిన విషయమే.. కానీ అత్యంత బలమైన బ్రెజిల్ జూడో జట్టుకు ముప్పై ఐదు సంవత్సరాల మహిళ ప్రధాన కోచ్‌గా మారిందంటే.. ఆమె ఎంతటి ఉక్కుమహిళ అయ్యుండాలి! పురుషాధిక్య క్రీడా ప్రపంచంలో కూడా తనకంటూ గుర్తింపును తెచ్చుకుని అందరిచేతా సలాములు కొట్టించుకుంటున్న జూడో మొట్టమొదటి మహిళా ప్రధానకోచ్ యూకో ఫుజీ గురించి కాసేపు..
ముప్పై ఏళ్ల క్రితం అంటే ఫుజీ ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జపాన్‌లో మొదటిసారి జూడో ప్రాక్టీస్ కోసం వెళ్లినప్పుడు యూకో ఫ్యూజీని ఓ చిన్నపిల్లాడు కింద పడేశాడట.. ఆ సంఘటన తర్వాత ఆమె మరెప్పుడూ మార్షల్ ఆర్ట్స్‌కు వెళ్ళకూడదని నిర్ణయించుకుందట. కానీ తల్లి బలవంతంతో శిక్షణను కొనసాగించింది. మార్షల్ ఆర్ట్స్ అంటేనే భయపడే ఫూజీ ఇవాళ బ్రెజిల్ పురుషుల జూడో టీమ్‌కు మొదటి మహిళా ప్రధాన కోచ్. పురుషాధిక్య క్రీడా ప్రపంచంలో.. అదీ అత్యంత బలిష్టంగా ఉండే బ్రెజిల్ పురుషుల జూడో జట్టుకు ఒక మహిళ ప్రధాన కోచ్‌గా పనిచేయడమన్నది ఎవరికీ ఊహకందని విషయం. ప్రొఫెషనల్ క్రీడల్లో సాధారణంగా మహిళల టీమ్‌లకు కూడా పురుషులే కోచ్‌లుగా ఉండడం మనమందరం గమనిస్తూనే ఉంటాం. నిజానికి బ్రెజిల్‌లో మహిళలు క్రీడల విషయంలో చాలా వివక్షను ఎదుర్కొంటారు. ఫుట్‌బాల్‌కు పేరుగాంచిన బ్రెజిల్‌లో మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులకు పెద్దగా ప్రోత్సాహం ఉండదు. అందుకే ఆ దేశంలో ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారిణి అయిన మార్తావైరా డా. సిల్వాను చాలా తక్కువమంది గుర్తుపడతారు. బ్రెజిల్ జాతీయ మహిళా ఫుట్‌బాల్ టీమ్‌కు కోచ్‌గా పనిచేసిన ఒక్కగానొక్క మహిళా కోచ్ అయిన ఆమెను ఏడాదిలోపే ఆ పదవి నుంచి తొలగించారు. అందుకే ఫూజీ మహిళా ప్రధాన కోచ్ నియామకం చాలా సంచలనంగా మారింది. దీని గురించి జూడో సమాఖ్య ప్రతినిధి విల్సన్ మాట్లాడుతూ.. ‘మహిళలకు క్రీడల్లో లభిస్తున్న గుర్తింపుకు ఫూజీ మంచి ఉదాహరణ. అదీ మహిళలు అత్యంత తక్కువగా పాల్గొనే జూడోలో ఫూజీ ఈ స్థాయికి చేరుకోవడం చాలా విశేషం’ అన్నారు.
బాల్యంలో ఎన్నడూ మళ్లీ జూడో జోలికి వెళ్ళకూడదు అనుకున్న ఫూజీ తన తల్లి బలవంతంపై శిక్షణ కొనసాగించకుంటే తను ఈ రోజు ఇంత ఉన్నతస్థాయికి చేరగలిగేవారు కాదు. నిజానికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి తాను విదేశాలకు ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఆమెకు ఈ కోచింగ్ ఆలోచన వచ్చింది. తన జూడో నైపుణ్యాలతో ఆమె మొదట బ్రిటన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ బాత్‌లో అవకాశం సంపాదించారు. మొదట్లో కోచింగ్ ఇవ్వడం ఆమెకు చాలా కష్టంగా ఉండేది. జూడో పట్టులో ఉన్న వ్యూహాల గురించి పిల్లలు ప్రశ్నించినప్పుడు ఆమె వారికి సరిగా వివరించలేకపోయేవారు. వారి ప్రశ్నలతో ఆమె ఆ క్రీడను మరింత సాంకేతికంగా, లోతుగా పరిశీలించారు. నాటి నుంచి జూడో కోచింగ్ ఆమెకు ఇష్టమైన పనిగా మారిపోయింది. 2012 ఒలపింక్స్‌లో బ్రిటన్ టీమ్‌కు కోచింగ్ ఇచ్చాక ఆమె దృష్టి బ్రెజిల్ టీమ్‌పై పడింది. ఆమెను పురుషులు, మహిళల టీమ్‌లు రెండింటికీ అసిస్టెంట్ టెక్నికల్ కోచ్‌గా బ్రెజిల్ నియమించుకుంది. అప్పుడే ఆమె రియో ఒలంపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన రాఫెలా సిల్వాకు శిక్షణ ఇచ్చారు. అయితే పురుషుల ప్రధానకోచ్‌గా ఫూజీని నియమించినప్పుడు తాను ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించగలనా అని ఆమె సందేహించారట.
నేను మొదట ఒక్కో అథ్లెట్‌కు విడివిడిగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించాను. శిక్షణలో నేను అన్ని వివరాలు తెలుసుకుని, వారికున్న నైపుణ్యాలకు మెరుగుదిద్దడం మొదలుపెట్టాను. అలా క్రమక్రమంగా నాకు వాళ్లమీద, వాళ్లకు నా మీద నమ్మకం కుదిరింది అని వివరించారు. మగవాళ్లైనా, ఆడవాళ్లైనా.. నైపుణ్యం ఉంటే వాళ్లకు అవకాశం లభించి తీరాలని అంటారామె. ప్రధాన కోచ్‌గా ఎంపికైన తర్వాత ఫూజీకి దేశంలోని మహిళా క్రీడాకారుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అప్పుడు కానీ తాను సాధించిన విజయం ఎంత పెద్దదో, క్రీడల్లో మహిళలకు ఎంత తక్కువ ప్రాధాన్యత ఉందో ఆమెకు అర్థం కాలేదు.
ఇటీవల ఫూజీ రియో ఒలంపిక్ పార్క్‌లో బ్రెజిల్ నలుమూలల నుంచి వచ్చిన యువ జూడోకాలకు శిక్షణా శిబిరం నిర్వహించారు. దానిలో పాల్గొన్న అభ్యర్థులందరినీ ఆమె పల్టీ కొట్టించి, మ్యాట్‌పై పడేశారు.
ఒక్కొక్క జూడో క్రీడాకారుడి బలాలు, బలహీనతల ఆధారంగా ఫ్యూజీ శిక్షణ ఉంటుంది. ఆమె ఈ క్రీడను ఎప్పుడూ స్ర్తీ , పురుషుల మధ్య పోటీగా చూడదు. ఆ విషయం ఆమె వద్ద శిక్షణ పొందుతున్న వారందరికీ నచ్చుతుంది. ఫూజీ వద్ద శిక్షణ పొందుతున్న వారిలో జెఫర్సన్ సాంటోస్ ఒకరు. సాంటోస్ 73 కిలోల విభాగంలో పోటీ పడుతున్నారు. క్రీడాకారుల విషయంలో ఆమె అత్యంత శ్రద్ధ వహిస్తారని, ఒక కోచ్‌గా ఆమె ప్రజ్ఞాపాటవాలు అసాధారణమని అంటాడు సాంటోస్. ఆమె తమ ప్రధాన కోచ్‌గా వస్తోందని తెలిసినప్పుడు తాము థ్రిల్‌గా ఫీలయ్యామని చెబుతుంటారు అక్కడ శిక్షణ పొందుతున్నవారు.
శిక్షణ పొందే ప్రతి ఒక్కరికీ ఫూజీ చెప్పే మొట్టమొదటి సూత్రం ఇదే.. ఎవరి బలహీనతలు వారు తెలుసుకుని వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. అధిగమించాలి అంటుంటారు ఫూజీ.
ఆట మొదలుపెట్టినప్పుడు నీ ప్రత్యర్థి చేతులలోని ఏ భాగం బలహీనంగా ఉందో గుర్తించాలి. అక్కడ పట్టు పట్టి, వాళ్లపై ఆధిక్యత సాధించాలి అని సూచిస్తుంటారు ఫూజీ.
పురుషాధిక్యత ఉన్న బ్రెజిల్ క్రీడారంగంలో ఒక మహిళ పురుషుల జూడో టీమ్‌కు ప్రధాన కోచ్‌గా మారడమన్నది పరిస్థితులు మారుతున్నాయనడానికి సూచన. భవిష్యత్తులో మరింత ఎక్కువమంది మహిళలకు ఇలాంటి అవకాశాలు రావచ్చు.

- ఉమా మహేశ్వరి