సబ్ ఫీచర్

ఎవరు విజేత..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని శక్తులనూ ఒక అంశంపై కేంద్రీకరిస్తేనే శ్రేష్ఠత ఏర్పడుతుంది. ఆ శ్రేష్ఠత రావటానికి ప్రభుత్వం విద్యాలయాలను ఏర్పాటు చేసింది. అది ఒక రోజుతో కాదు. దాని వెనుక అవిరళ కృషి దాగి ఉంటుంది. ఆ కృషి జరిగిన తర్వాతే ప్రపంచం గుర్తిస్తుంది. అప్పుడు విద్యార్థికి ఆనందం కలుగుతుంది. ఆనందం శ్రమ చేసేటప్పుడు ఉండదు. అప్పుడూ శక్తంతా పనిమీదనే ఉంటుంది. పనిచేసేటప్పుడు ఆనందం స్ఫురణకువస్తే ఏ విద్యార్థి అయినా జారిపడతాడు. డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు కీర్తి, ప్రతిష్ఠల కన్నా అతని మనసంతా శస్తచ్రికిత్సపైనే ఉంటుంది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఆనందపడతాడు. హిమాలయాలను ఎక్కుతున్నప్పుడు పిల్లల శక్తంతా కూడా పైకిపోయే మార్గం మీదనే ఉంటుంది. అప్పుడు ఆనందపడితే ఏ లోయలోనో పడిపోతారు. విజేతకు ఆనందం గెలుపుతర్వాతనే ఉంటుంది. గెలుపు వేరు, ఆనందం వేరు. విజేత తన సర్వశక్తులను పనిచేసే సమయంలో ఏకాగ్రతతో కేంద్రీకరిస్తాడు. అది అందరూ నడిచే మార్గం కాదు. సులువైన మార్గం కనపడని దారి అది. పనిలోనే మార్గాన్ని వెతుక్కుంటూపోయే పథకాన్ని రచించుకోవాలి. తన దృష్టి అంతా, శక్తినంతా పనిమీదనే ఉంచితేనే విజయం వరిస్తుంది. తర్వాత తనకు వచ్చేది ఆనందం. ఫలితాన్ని ముందుపెట్టి శ్రమను వెనకపెడితే- బండిముందు పెట్టి, గుర్రం వెనుక ఉన్నట్టుంటుంది. మా ఐఐటి విద్యార్థులకు చెప్పే మాట ఇదే. ఎవరు విజేత? అని ప్రశ్నిస్తే- ఎవరి పనిమీద దృష్టి నిలిచి గెలుస్తాడో ఆ వ్యక్తే విజేత అని చెప్పాలి.
ఆలోచనలకు పునాది...
‘పెద్దయ్యాక నువ్వు నువ్వేమవుతావ్..?’ అని అచ్చు కొడుకు సోమేల్‌ను అడిగాను. ‘తాతా.. మా స్కూల్‌లో సమాజానికి ఉపయోగపడే ఏ వస్తువులను తయారు చేయాలో చెప్పరు. మాకు లెక్కలు, ఇంగ్లీషు తదితర సబ్జెక్టులు చెబుతారు. ప్రతి వేసవిలో పిల్లలు కొన్ని ట్రైనింగ్‌లకు పోతారు. కొందరు హాస్పిటల్‌లలో, ఫ్యాక్టరీలలో పనిచేస్తారు. ప్రతి విద్యార్థి అమెరికాలో ఇంటర్న్‌షిప్‌కు వెళతారు. స్కూల్‌లో చెప్పే విషయాలతో వస్తువుల తయారీలో నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఇంటర్న్‌షిప్ జరుగుతుంది. దాని ద్వారా విద్యార్థి తాను ఏం చేయాలో లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అమెరికాలో 12వ తరగతి తర్వాత విద్యార్థి తన లక్ష్యాన్ని ఎంచుకుంటాడు. 12 సంవత్సరాల స్కూలు ఎడ్యుకేషన్ పూర్తయ్యాక, వేసవిలో ఇంటర్న్‌షిప్ ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాక, భవిష్యత్‌కు దారివేసుకుంటారు. స్కూలు చదువుకేవలం వృత్తి కోసం కాదు, ఒక ఆలోచన కోసమని 8వ తరగతి చదువుతున్న నా మనుమడు సోమైల్ చెప్పిన పాఠం ఇది.
విద్యకు మూలం...
మానవుల మధ్య సత్సంబంధాలే సమాజ శ్రేయస్సుకు మూలం. ప్రతితరం తమ జీవన విధానాన్ని మెరుగుపరచుకోవటానికి ఆలోచించటం విద్యకు మూలం. ఒక మనిషి తననొక మనిషిగా గుర్తుంచుకోవటం ఇతరుల వల్ల జరుగుతున్నది. తన అస్తిత్వాన్ని సమాజం వలన గుర్తించుకో గలుగుతున్నాడు. ఈ రెండు విషయాలే తరగతి గది ఏర్పడడానికి, కాలక్రమేణా అదొక పాఠశాలగా రూపొందించటానికి, దానిని ఆదరించే సమాజం ఏర్పడటం, సమాజ క్రమంలో వచ్చిన పరిణామం. మానవ అవసరాలు పెరుగుతున్నకొద్దీ కొత్త భావాలేర్పడతాయి. ఈ ఆలోచనల సమూహంలో ఏర్పడిన తరగతి గదులే పాఠశాలలు. పిల్లలలో కలగలిసిన ఉపాధ్యాయులు తరగతి గదులు. ఇందులో తల్లిదండ్రులు నేరుగా భాగస్వాములు కాదు. కానీ- వారు ఉత్ప్రేరకులే. స్కూల్ అనగా దాని నిర్వహణ, దానికి కావల్సిన యంత్రాంగం, పాలనాయంత్రాంగం చర్చనీయాంశాలైనాయి. స్కూల్‌తో సమాజం నేరుగా భాగస్వామి కాదు. కానీ సమాజానికి కావల్సిన నైపుణ్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి సమాజంలోని వివిధవర్గాలు అనగా పాలకులు, మతాలు, పోలీసులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారస్థులు, శ్రమజీవులు వీళ్లందరూ పాఠశాల శ్రేయోభిలాషులు. తరగతి గది, స్కూలు, శ్రేయోభిలాషుల సంగమమే విద్యాక్షేత్రం. వీటి మధ్య సత్సంబంధాలే సమాజ ఉన్నతికి దోహదపడతాయి. ఈ మూడింటిలో దేనిలో లోపం వచ్చినా విద్యారంగం కలుషితవౌతుంది.
సామాజిక న్యాయం- తరగతి గది...
తరగతి గదికి, సామాజిక న్యాయానికి బలమైన సంబంధం ఉంది. ప్రతిభే ముఖ్యమని అనుకునే కాలంలో ఉపాధ్యాయుడు మార్కులు ఎక్కువగా వచ్చే పిల్లల్నే ప్రేమించటం, వారినే ఆదరించటం జరిగేది. కానీ, పిల్లలందరికీ అత్యధిక మార్కులు ఎందుకు రావటం లేదని ఇప్పుడు ఉపాధ్యాయుడు ఆలోచనలు సాగిస్తున్నాడు. విద్యార్థి, ఉపాధ్యాయుడి యోగ్యతలే కాకుండా విద్యార్థి పరిసరాలు, విద్యార్థి జెండర్, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి, వారిచ్చిన కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ వంటివి కూడా ప్రభావం చూపుతాయని గుర్తించవలసిన కాలం వచ్చింది. సామాజిక న్యాయాన్ని పరిగణనలోనికి తప్పక తీసుకోవాలి. సమాజం సమానత్వాన్ని కోరినట్లే- అన్ని వర్గాల విద్యార్థుల ప్రేమను, ఆదరణను ఆకళింపు చేసుకుంటేనే తరగతి గది వికసిస్తుంది.

--చుక్కా రామయ్య