సబ్ ఫీచర్

వెనుకబాటూపాఠమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలంతో పాటుగా పరిగెత్తే శక్తిలేక చాలామంది జీవితపథంలో వెనుకబడిపోతున్నారు. విద్యార్థులు, రైతులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, గృహిణులు, చిన్నా చితకా ఉద్యోగాలు చేసే మహిళళు ఇలా ఒక్కరేమిటి ఎవరూ దీనికి అతీతులు కారన్నట్టు అనుకొన్నవాటిని సాధించడంలో వెనుకడుగు వేస్తున్నారు.
నిజమే కావచ్చు.. కానీ పడిన వెనకడుగు చావుకు దారితీయకూడదు. జీవిత అంతానికి చుక్క పెట్టకూడదు. ఇపుడు విజయపథంలో ఉన్నత శిఖరాన నిలబడిన వారూ ఒకప్పుడు అపజయాన్ని చూచినవారే. వారు నిలదొక్కుకోగలమా అని బాధపడినవారే. కాని వారిలో ఉన్న ఆత్మవిశ్వాసం వారిని వెనుకడుగు పడినా దాన్ని ముందుకు తీసుకొని వచ్చింది. ఎన్ని అపజయాలు ఎదురొచ్చినా సరే విజయానికి అవి అన్నీ మెట్లుగా గుర్తించాలి.
పొరపాట్లను పదేపదే అనుకోవడమే కాక వాటిని మళ్లీ తిరిగి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
చేసేపని కుదరక వ్యాకులత ఏర్పడినపుడు దాన్ని గురించి ఆత్మీయులతోనో, లేక స్నేహితులతోనో అదీ కాకపోతే ఆ రంగంలో నిష్ణాతులుంటే వారితోను మీ బాధను పంచుకోవాలి. ఒకవేళ మీరే మొదటివారు అయతే మరేంఫర్లేదు. ఇపుడు ఇట్లా కాకపోతే మరొకలా విజయం సాధించవచ్చు అనుకుని మరో మార్గానికి దారి తెరవాలి.
అదే పనిగా ఆలోచిస్తూ అటు ఆహారం తీసుకోకుండా ఇటు నిద్రపోకుండా కాలాన్ని అడపకూడదు. దానివల్ల ఆరోగ్యసమస్యలు చుట్టుముడుతాయ. అందుకే హాయగా నిద్ర పోవాలి. అపుడు మంచి ఆలోచనలు కూడా వస్తాయ. స్థలమార్పు కూడా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కనుక టైము తీసుకొని ఇష్టమైన ప్రదేశాలను చుట్టిరావాలి. చేసే పనిని కాసేపు పక్కన పెట్టి వేరే వ్యాపకాన్ని కలిగించుకోవాలి. తిరిగి ముందు చేస్తున్న పనిని మొదలు పెట్టితే తప్పకుండా గెలుపు మీదే అవుతుంది. ఆహారం లో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసం, చిక్కుళ్ళు, కార్బోహైడ్రేట్లు వంటివి తీసుకోవడం వల్ల మనసు కుదురుగా ఉంటుంది.

--కూచిభట్ల వెంకటలక్ష్మి