సబ్ ఫీచర్

ఖర్చుపై అదుపు ... పొదుపునకు మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన నిత్య జీవిత పొదుపు ప్రగతికి సోపానం. ప్రతి వ్యక్తి జీవితంలో పొదుపు తప్పనిసరి. ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు. ఆ అవసరానికి పొదుపు ఆపద్భాంధవుడిగా వ్యవహరిస్తుంది. పొదుపు ఎక్కడెక్కడ చేయవచ్చో చూద్దాం...
బజారులో చూసే ప్రతి వస్తువు బాగుంది అనిపిస్తుంది. అనిపించిన వస్తువులు కొనాలనే ఉంటుంది.ఇక్కడే పొదుపుకు మార్గాన్ని వెతుక్కోవాలి. ఏ వస్తువు ఎంత అవసరమో అని మనకు మనం బేరీజు వేసుకొని తెలుసుకోవాలి. ఉదాహరణకు సెల్‌ఫోను అవసరమైందే కాదనను కానీఅవి చాలా ఖరీదులోను, తక్కువగా ను ఉన్నాయి. కాని సెల్ ఫోనును ఉపయోగించే దాన్ని బట్టి కొనుక్కోవాలి కానీ పక్కవారికి ఉందనో లేక కొత్తది వచ్చిందనో కొనుక్కోకూడదు. మిక్సీలు, గ్రైండర్స్, వాషింగ్ మిషన్స్, రకరకాల వంటకాల తయారీ మిషన్స్, అవెన్స్ లాంటి ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా కుటుంబానికి అవసరమైనవి తీసుకోవాలి కానీ పక్కింటివాళ్లు కొన్నారనోలేక బజారులో కొత్తది చీపుగా వచ్చిందనో చౌకగా దొరుకుతుందనో కొనుక్కుంటే మాత్రం అది వృథా ఖర్చే. అసలు ఎలక్ట్రానిక్స్ ఏదీ ఎక్కువ కాలం పనిచేయవు. కనుక అవసరమైనంతవరకే కొనుక్కోవాలి. కొత్త వస్తువులను పిల్లల దగ్గర నుంచి పెద్దలు దాకా కావాలనుకొంటారు. ఏ వస్తువునైనా సరే అవసరానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు అమ్మాయిలు పెళ్లికి ముందే ఉద్యోగం చేస్తున్నారు. కానీ వారి జీతం అంతా ఇలాంటివి కొనుక్కోవడంలో ఖర్చు చేసేస్తూ పోతే పప్పులో కాలేసినట్టే. ఇక్కడే కాస్త నిదానంగా ఆలోచించి పొదుపుకు మార్గాలు వేసుకోవాలి. మొదటి జీతం అందుకున్న దగ్గర నుంచి పొదుపు గురించి ఆలోచించాలి. ఏవిధంగా డబ్బు దాచాలో చూడాలి. ఎక్కడా వేస్టు చేయకుండా చూసుకోవాలి.
బంగారం కొనడం కూడా పొదుపు చేసినట్టు అవుతుంది. కానీ బంగారం వస్తురూపేణా కొనుక్కుంటే మాత్రం అందులో తరుగుఅని కొన్నాళ్ల తరువాత ఆ మోడల్ మారిపోయ తిరిగి వేరేవి చేయంచాల్సి వచ్చి ఇలా ఖర్చు పెరుగుతుంది కానీ పొదుపు కాదు. కనుక బంగారాన్ని బిస్కెట్లరూపంలో కొనుక్కొంటే మంచిది.
ఇపుడు బ్యాంకులు పొదుపు చేసుకోవడానికి అనేక మార్గాలు చూపుతున్నాయ. బ్యాంకు తరఫున చిన్న చిన్న మొత్తాలను వేరే వారికి ఋణంకింద ఇవ్వచ్చు. దాని ద్వారా వడ్టీలు రాబట్టుకోవచ్చు. రికరింగ్ డిపాజిట్స్ చేసుకోవచ్చు. అవి బ్యాంకులే కాక పోష్టాఫీసులు కూడా రికరింగ్ డిపాజిట్స్ పైన వడ్డీరేటు మహిళలకు అదనంగా ఇస్తున్నారు. కనుక ఇలాంటి వాటిల్లో పొదుపు చేసిన మొత్తాలను చేర్చుకుంటే ఏదైనా అనుకోకుండా ఖర్చు వస్తే బాధపడకుండా ఖర్చు చేయడానికి ఈ పొదుపు మొత్తాలు పనికి వస్తాయ.
కేవలం పొదుపు అంటే డబ్బులే కాదు ఆహారపదార్థాల్లో ను పొదుపు ఉంటుంది. వంటిట్లో వండిన పదార్థాలు ఖర్చుకు మించి అంటే తినేవారిని బట్టి కాక ఉంది కదా అని వండేస్తే వృథా అయనట్టే గదా. అంతేకాక తింటారనుకోని వండినా వాటిని అనుకొన్న వారు తినకపోయనా అవి వృథాఖర్చు కిందకే వస్తాయ. కనుక వంటకాల్లో పొదుపు చేసుకోవాలి. ఎంతమంది తింటారు ఎంత తింటారు అన్న నియంత్రణ ఉండి తీరాలి. అయనా ఫ్రిజ్ ఉంది కదా అనుకొంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఫ్రిజ్ అనేది పచ్చి ఆకుకూరలు, పాలు ఇవన్నీ పెట్టుకోవాలి కాని వండిన ఆహారపదార్థాలను పెట్టుకోకూడదు. ప్రిజ్ ఉన్నాకూడా మిగలకుండా ఉండేట్టుగా చేసుకోవాలి. చేసిన వంటకాలు ఏపూటకాపూట తినేయాలి. కాని మరుసటి రోజుకు దాచడం సంప్రదాయం కాదు ఆరోగ్యమూ కాదు.
అట్లానే కరెంటు ఆదా చేయడం. గదులన్నింటిలో ఫ్యాన్, బల్బులు అవసరం ఉన్నా లేకపోయనా వాడేయడం వృథా ఖర్చే. ఇవి తగ్గించుకోవాలి. బట్టలు ఆరబెట్టడానికి, తినేవస్తువులు చల్లారడానికి కొంతమంది ఫ్యాన్ ఉపయోగిస్తుంటారు.వీటిని తగ్గించుకుంటే కరెంటు ఆదా చేసినట్టే ఈ కరెంటును పొదుపు చేసినందువల్ల దేశానికి కూడా మేలు చేసినట్టు అవుతుంది.
బట్టలు తదితరాలు కొనుక్కొనేటపుడు కూడా పొదుపు పాటించాలి. డిస్కెంట్లు ఉన్నాయనో ఒకటికి రెండు ఇస్తున్నారనో బట్టలు కొనుక్కోకూడదు. కేవలం అవసరాన్ని బట్టి కొనాలి కాని బీరువాల నిండా బట్టలు నింపి నా దగ్గర మూడు బీరువాల నిండా చీరలున్నాయ అని చెప్పుకోవడం గొప్పకాదు. వేస్టు ఖర్చు ఎంత పెడుతున్నారో అక్కడే తెలుస్తుందన్నమాట. అవసరానికి మించి గొప్ప కోసం కొనుక్కుంటే అది వ్యర్థమే.అట్లాంటి కొన్నాళ్లతరువాత అవసరానికి పనికిరావు.
కూరగాయలు ధరతక్కువ ఉన్నాయనో, డిస్కౌంటు ఇస్తున్నారనో రోజు పనికి వస్తాయ కదా అనుకొంటే అది వేస్ట్ కిందకే వస్తుంది. అలా తెచ్చిన ఆకుకూరలు, కూరగాయలు కుళ్లిపోవడమో, లేక ఎండిపోవడమో జరుగుతుంది. అందుకే ఎంత అవసరమో రెండు రోజులకు మించి తెచ్చుకోకూడదు. ఎక్కడ పొదుపు చేయాలో అక్కడ చేయాలి కానీ అన్నిచోట్ల చేయకూడదు. పొదుపుకు విజ్ఞత అవసరమే
పొదుపు అందరికీ తెలిసినవిషయమే అయినా ఇంటిల్లిపాది పొదుపు చేస్తే అది ఫలవంతం అవుతుంది. ఒకరు పొదుపు చేస్తే మరొకరు ఖర్చు చేస్తే లాభమేమీ ఉండదు.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి