సబ్ ఫీచర్

బడి ఎంపికే అసలు పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలానుగుణంగా సమాజ వైఖరిలో వచ్చిన మార్పువల్ల కాస్త పెద్దగా కనిపించే ప్రతి ఊరిలో నేడు ఒకటి కన్న ఎక్కువ స్కూళ్లు కనపడుతున్నాయి. ప్రతి స్కూలును బేరీజు వేసుకునే అవకాశం రావటం సముచితమే. కానీ, తల్లిదండ్రుల ‘ఆప్షన్ల’ మేరకు పిల్లలు స్కూళ్లకు వెళుతున్నారు. ధనవంతుల పిల్లలు ఒక దగ్గరకు, పేదల పిల్లలకు మరో ఒక స్కూలు వెళ్తున్నారు. ఈనాడు విద్య వ్యాపారంగా మారింది. ఇలాంటి సమూహంలోనే స్కూల్ యజమాన్యాలకు కఠిన పరీక్ష ఎదురైంది. స్కూళ్లకు సంబంధించి నైతిక విలువలు పిల్లలపైన, విద్యారంగంపైన ప్రభావం చూపిస్తాయి. తల్లిదండ్రులు ఏ స్కూలును ఎంచుకోవాలన్నా అది మొదటి పరీక్ష. తల్లిదండ్రులకు సరైన మార్గదర్శకాన్నీ చూపించే ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఈ సందర్భంగా నాకు ఒకనాటి సంఘటన జ్ఞాపకం వస్తోంది. ఒక విద్యార్థిని పిలిచి- ‘నువ్వు నాణేలు పోగుచేస్తావు కదా! రేపు తీసుకొస్తావా?’ అన్నాను.
‘తప్పకుండా తెస్తాన’ని ఆ విద్యార్థి సమాధానం చెప్పాడు. అప్పుడు నేను గణితం సహా సైన్స్ చెప్పేవాణ్ణి. ఆ నాణేలను డబ్బాలలో వేసి ‘కరెంట్’ ఉన్న దగ్గరకు తీసుకుపోయాను. ఆ నాణేలు కదలటం మొదలుపెట్టాయి. కొన్ని బైటకు వచ్చాయి. అవి ఎలా బైటకు వచ్చాయని ప్రశ్నించాను. ‘కరెంట్ గుంజింది కదా అందుకే నాణేలు బైటకు వచ్చాయని’ పిల్లలు చెప్పారు.
కొన్ని నాణేల్లో విద్యుత్ ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. కొన్నింట్లో తక్కువగా ఉంటుందని పిల్లలు చెప్పారు. వెండి నాణేలు బైటకు రావటానికి కారణం- వెండిలో విద్యుత్ ప్రవాహం ఎక్కువగా ఉంటుందని కూడా విద్యార్థులు చెప్పారు. ఆ డబ్బాలో ఇంకా రాగి నాణేలు కూడా ఉన్నాయి. కొన్ని ధాతువుల్లో విద్యుత్ ప్రవాహం ఎక్కువగా ఉంటుందని ఆ పాఠం సారాంశం.
పిల్లలను ‘మీరు కరెంట్ దగ్గరకు రాగలరా?’ అని అడిగాను. అందుకే మేం చెప్పులు వేసుకున్నాం. చెప్పుల్లోకి విద్యుత్ ప్రవాహం రాదు అని పిల్లలు చెప్పారు. కొన్నింటిలో విద్యుత్ ప్రవాహం జరుగుతుంది, మరి కొన్నింటిలో జరుగదు. వెండిలో విద్యుత్ ప్రవాహం ఎక్కువగా జరిగితే, రాగిలో దానికన్నా తక్కువ విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. విద్యుత్ తీగల్లో రాగి ఉంటుంది. పాఠం కంటే ముందుగా విద్యార్థుల ఉత్సాహం చూస్తుంటే ఉపాధ్యాయునికి, తరగతి గదికి ఎంత ఉత్సాహం ఉంటుందో ఆలోచించండి. అందుకే సైన్స్ పాఠం స్కూల్‌కు ప్రాణవాయువు.
సాధన.. శక్తి ప్రదాత
సాధన వల్ల మానవునికి శక్తి లభిస్తుంది. ఈ శక్తే మనిషికి విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందుకే చామ్‌స్కీ సాధనలో ఉండే శక్తిని వివరించారు. అందులో మొదటి శక్తి- భాష. ఎవరితో ఎట్లా మాట్లాడాలి? అన్నది భాష వల్ల తెలుస్తుంది. భాష ఆలోచనకు మూలం. అదే మనిషిని జంతువుల నుంచి వేరుచేస్తుంది. సాధన కారణంగా బాధ్యత వస్తుంది. అది ఎప్పుడో కాదు. ప్రాథమిక స్థాయిలోనే ఏర్పడుతుంది. 10 నుంచి 12 సంవత్సరాల వయస్సు వచ్చే నాటికి పిల్లల్లో లక్ష్యాలు ఏర్పడాలి. సాధనతో లక్ష్య నిర్ణయం జరుగుతుంది. యుక్తవయస్సు వచ్చేవరకు ఒక విజన్ ఏర్పడుతుంది. యవ్వన దశ రాగానే ఆ లక్ష్యాన్ని సాధించే అనుకూల సమాజం కోసం పాటుపడటం, అనగా ప్రజాస్వామిక వ్యవస్థ నిర్మాణం కోసం కృషి చేయడం అలవడుతుంది. మానవ హక్కుల కోసం పోరాటం చేయడం ఇందులో భాగమే. ఈ లక్షణాలున్నాయి కాబట్టే సాధనను ఒక శక్తిగా భావిస్తారు. సాధించే మనిషిని ప్రపంచం ఆరాధిస్తుంది. సమాజంపై తగిన ముద్ర వేస్తే ఆ వ్యక్తి శాశ్వతంగా జీవిస్తాడు. సాధన జీవితాంతంవరకు జరగవలసిన ప్రక్రియ. సాధన పాఠశాలలో చిగురిస్తుంది. దానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం నుంచి చేయూత ఉంటుంది. సాధన అన్నది మానవునికి శక్తిప్రదాత అని చామ్‌స్కీ అంటాడు.
రాపిడుల మధ్య...
నేను ప్రతిరోజూ ఏదో ఒక స్కూలుకు పోవడం, నేను మాట్లాడేది సమంజసంగానే ఉన్నదని అనిపించడం మామూలే. కానీ పాఠశాలల్లో మీరనుకునే పరిస్థితి లేదు. అధికారులు స్కూలుకురాగానే ఈ రిజల్సు ఎంత? స్కూలుకు ఎన్ని ‘ఏ ప్లస్ ర్యాంకులు’ వచ్చాయి? నూటికి నూరు శాతం రిజల్టు ఉందా? తల్లిదండ్రులు టీచర్ కనిపిస్తే- ‘మా పిల్లలకు మంచి కాలేజీలో సీటు రావాలి సార్. నేను డొనేషన్ కట్టలేను. ఏ కాలేజీకి వెళ్లినా డొనేషన్ అడుగుతారు. ఏ ప్లస్ ర్యాంకు లేనిదే ఫ్రీ సీటు రాదు. ఎట్టగన్నాచేసి మా పిల్లలకు ఏ ప్లస్ ర్యాంకు వచ్చేటట్లు చేయండి’ అని అడుగుతారు. ఇది అధికారుల వైపునుంచి, తల్లిదండ్రుల వైపునుంచి ఒక ఆశ కనిపిస్తుంటుంది.
మీరేమో కలిస్తే ప్రవచనాలు చెబుతారు. పిల్లలకు సబ్జెక్టు రావాలంటారు? ఆలోచనలు కలిగించాలంటారు? క్రియేటివ్ థింకింగ్‌పైన వ్యాసాలు రాస్తారు. కానీ ఆచరణలో మీలాంటి వాళ్లకు, మార్కులు, ర్యాంకులు ప్రధానమనేది వారి మధ్యన మేం నలిగిపోతున్నామని ఉపాధ్యాయులంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏంచేయాలో చెప్పండని ఉపాధ్యాయులు నన్ను ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయులు చెప్పేది కరెక్టే. మన దేశంలోనే కాదు, అన్ని దేశాల్లోకూడా మార్కెట్, కార్పొరేట్ శక్తులు విద్యారంగాల్ని ఈ దశకు తీసుకవచ్చాయి.

--చుక్కా రామయ్య