సబ్ ఫీచర్

అతి అనర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యాయామం చేయమని ప్రతివారు చెబుతుంటారు. కొద్దిపాటి వ్యాయామం శరీరానికే కాదు మనసుకు, మెదడూ మంచి కలిగిస్తుంది. అరవైఏళ్లు దాటిన వారు సామాన్యంగా ఎక్కడ పెట్టిన వస్తువులను మర్చిపోతుంటారు. వారికి ఏదైనా విషయం చెబితే అది కూడా మేము విననేలేదు అనేస్తుంటారు. ఇది వారి మతిమరుపు మాత్రమే.
ఇటువంటి వారుకూడా కాస్త వ్యాయామం కూర్చోవడం, లేవడం, లేక అరగంట పాటు నడవడం లాంటివి చేస్తే వారి మెదడులో చురుకుదనం వస్తుందంటున్నారు నిపుణులు. అరవై దాటిన వారు క్రమం తప్పకుండా కనీసం అరగంట పాటు నడిస్తే వారి మతిమరుపు అడ్డుకట్ట వేయచ్చట..
అట్లానే వారిలో కనబడే కీళ్లనొప్పులు, మోకాళ్లు నొప్పులు, కండరాల పట్టేయడం లాంటివి కూడా వ్యాయామం వల్ల తగ్గుముఖం పడుతాయి అని అంటారు.
అయితే వయస్సులో ఉన్నవారు,యువత కూడా తప్పని సరిగా వ్యాయామం ప్రతిరోజు చేయాల్సిందే. ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరమ్మాయలు సన్నగా నాజుగ్గా కనిపించాలని అతిగా వ్యాయామాలు చేస్తుంటారు. గంట పైగా వ్యాయామం చేయడానికి వారు ఉత్సాహం చూపిస్తారు. అంతేకాక చెమటలు కారిపోయినా, తలనొప్పి వచ్చినా వారి వ్యాయామాన్ని వారు ఆపకుండా చేస్తుంటారు. తిండి విషయంలో కూడా అతిగా కేలరీస్ లేని ఆహారానే్న తీసుకొంటాం అంటారు. ఒక్కోసారి ఉపవాసాలు కూడా చేసేసి కడుపు మాడ్చేస్తుంటారు.
ఇది అసలు మంచిది కాదు అంటున్నారు వైద్యులు.
అతి ఎక్కడా పనికిరాదు. వ్యాయామంలోను అంతే ఎక్కువ చెమటలు కారిపోతుంటే భలే తగ్గిపోతున్నాం అనుకోకండి. వెంటనే శక్తి నిచ్చే ఏదైనా పానీయాలు తాగండి. కొబ్బరినీళ్లు, సూప్ ఇలా ఏదైనా వెంటనే శక్తినిచ్చే పానీయాలు తీసుకోవాలి. లేకుంటే బి.పి. లెవల్స్, చక్కెర స్థాయిలో రాకూడని మార్పులు రావచ్చు.
అంతేకాక కొద్దిమంది వ్యాయామం చేసేటపుడు కండరాలు పట్టేసినా బలవంతంగా వ్యాయామాన్ని చేస్తుంటారు. వామప్ ఎక్సర్‌సైజులు చేయకుండానే ఒకేసారి కేలరీస్ ఖర్చు అయ్యే వ్యాయామాలు ఎక్కువ చేసేస్తుంటారు. ఇలా ఎప్పుడూ చేయకూడదు. మెల్లమెల్లగా రోజుకు కొద్ది కొద్దిగా సమయాన్ని పెంచుకుంటూ మాత్రమే ఎక్సర్‌సైజులు చేయాలి. ఒకేసారి ఎక్కువ కాలెరీస్ బర్న్ అయి పోయి తలనొప్పి కూడా వచ్చేస్తుంటుంది. ఇటువంటపుడు వెంటనే వ్యాయామాన్ని ఆపి కాసేపు అయినా విశ్రాంతి తీసుకోవాలి. ఒత్తిడి ఉన్నప్పుడు వ్యాయామం మంచిదే కానీ అతిగా చేయకూడదు.
క్రమం తప్పకుండా సుమారు అరగంట నుంచి 45 నిముషాల వరకు వ్యాయామం చేస్తే చాలు.
కేవలం వ్యాయామాలే కాకుండా సమతులాహారం తీసుకోవడం కూడా మర్చిపోవద్దు. అదేపనిగా తిండి మానేయడమో లేక అతి కొద్దిగా తీసుకోవడమో చేస్తుంటారు. ఇట్లా చేయకూడదు. అల్పాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. కొవ్వు పెరుగుతుందని కొంతమంది నెయ్య , నూనెలను తీసుకోరు. ఇది మంచి పని ఏమీ కాదు స్వచ్ఛమైన నెయ్య బరువును నియంత్రణలో ఉంచడానికి దోహదం చేస్తుంది. రిఫైండ్ ఆయల్స్ కాక కొబ్బరి, బాదంలాంటి నూనెలను తీసుకోవడమే శరీర ఆరోగ్యానికి మంచిది. ఆహార విషయంలో కూడా మితంగా ఉండడమే మంచిది.

--చివుకుల