సబ్ ఫీచర్

వరాలనిచ్చే లక్ష్మీదేవికి నివేదనలు ....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

**వరాలనిచ్చే వరలక్ష్మీ దేవి పూజచేసుకొన్న స్ర్తిలంతా అమ్మవారి ప్రీతికోసం 21 రకాల పిండి వంటలు చేసి నివేదన చేస్తారు. ఇన్ని చేయలేనివారు వారి శక్తి మేర 9, లేక ఐదు రకాలు చేసి నైవేద్యాలిస్తారు. కొత్త పెళ్లి కూతురు మాత్రం తప్పనిసరిగా తొమ్మిదిరకాల పిండివంటలు చేసి అమ్మవారికి నివేదన చేయడం ఆచారం గా తెలుగునాట భావిస్తారు**
కొందరు కేవలం మైదాపిండి, బెల్లం ఉపయోగిస్తూ తొమ్మిదిరకాల పిండివంటలను తయారు చేసిన గవ్వలు, కాజాలు, పూరీలు, పాల పూరీలు, మడతకాజాలు, గాలి మరలు, గులాబీలు, బెల్లం పూరీలు, గోరుమీటీలు, కోవాపూరీలు ఇలా తొమ్మిది రకాలు చేసి అమ్మవారికి నివేదన చేస్తుంటారు. ఆవుపాలు, కొబ్బరి, బియ్యపు పిండి, నువ్వులు, పప్పులు, బెల్లం ఇవి లక్ష్మీదేవికి ప్రీతి కనుక వీటితో ఈరోజు రకరకాల పిండి వంటలు ఎట్లా చేసుకోవచ్చో ఈ రోజు చూద్దాం. నానిన బెట్టిన పచ్చి పెసరపప్పు (వడపప్పు) పానకం కూడా ఈ పిండివంటలతోపాటు నివేదన చేయడం ఆచారం. వీటిఅన్నింటితోపాటు జొన్నపేలాలను కూడా నివేదన చేస్తే అనుకొన్న పనులు వేగంగా పూర్తి అవుతాయని లక్ష్మీదేవి భక్తుల నమ్మకం.

క్షీరాన్నం
కావాల్సినవి: బియ్యం - కప్పులు
జీడిపప్పు- 11, బాదం -11
కిస్‌మిస్ - 11, పిస్తా- 11
యాలకుల పొడి- ఒక చెంచా
పాలు- అరలీటర్, నెయ్యి- 4స్పూన్స్
తయారీ : ముందుగా బియ్యం కడుక్కుని కాసేపునాననివ్వాలి. పాలు స్టవ్ పైన పెట్టి బాగా మరుగుతుండగా దానిలోకి బియ్యం వేయాలి. బియ్యం మెత్తగా ఉడికిన తరువాత యాలకుల పొడి చేర్చాలి. వేరే బాణలిలో నేయి వేసి అందులో ఒకదాని తరువాత ఒకటిగా బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్‌మిస్‌లు వేయించుకుని తీసిపెట్టుకోవాలి. పాలు బియ్యం బాగా ఉడికి దగ్గరగా వస్తుండగా వేయించిపెట్టుకున్న పప్పులను చేర్చాలి. మిగిలిన నెయిని వేసికుని ఉడికాక దించుకోవాలి. క్షీరాన్నం రెడీ

పూర్ణకుడుములు
కావాల్సినవి : శనగపప్పు - 2కప్పులు
బెల్లం - 2 కప్పులు
కొబ్బరి తరుగు- 2కప్పులు
యాలకులు - 6, సన్నని బియ్యపు రవ
నెయ్యి కావల్సినంత
తయారీ: శనగపప్పును బాగా మెత్తగా ఉడికించి 5 నిముషాలు ఆరబెట్టుకోవాలి. తరువాత బెల్లం తరుగును, యాలకుల పొడిని కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. బియ్యపు రవను వేణ్ణీళ్లల్లో వేసుకొని ఉప్పుకోవాలి. ఈ ఉప్పిన పిండిలోకి నెయ్యిని చేర్చాలి. ఉప్పిన పిండిని ముద్దలుగా చేసుకొని గినె్నల్లాగా చేసుకొని దానిలో శనగపప్పుమిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఆ ఉప్పిన పిండిలోపెట్టుకుని మూసేయాలి. ఇలానే అన్నీ చేసుకొని ఇడ్లీపాత్రలో పెట్టి ఆవిరిలో ఉడికించుకోవాలి.

కందిపప్పు బూరెలు
కావాల్సినవి : కందిపప్పు - 2 కప్పులు
బెల్లం తరుగు- 2 కప్పులు
శనగపప్పు - అరకప్పు
ఎండు కొబ్బరి అరకప్పు - అరకప్పు
యాలకులు - 6, బియ్యపు పిండి - 1 కప్పు
శనగపిండి - 1 కప్పు, మైదా - అరకప్పు
తయారీ: రెండు రకాల పప్పులను ఉడికించి వీటిని మెత్తటి పిండిగా మిక్సీ పట్టాలి. దీనికి కొబ్బరి తురుము బెల్లం కలుపుకోవాలి. తోపుకు శనగ, బియ్యం, మైదా ఈ పిండులను జారుగా నీళ్లు కలుపుతూ బజ్జీల పిండిలాగా జారుగా కలుపుకోవాలి. పప్పు, బెల్లపు పొడి, కొబ్బరి కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ తోపులో ముంచి బజ్జీల్లాగా కాగుతున్న నూనెలో వదులుకోవాలి. బాగా ఎర్రగా కాలిన తరువాత వాటిని తీసుకోవాలి. ఇంతకుముందు కాలంలో అయితే మినపప్పు ఒకటికి రెండు బియ్యం కలుపుకుని నానబెట్టి దోసె పిండిలాగా రుబ్బుకునేవారు. ఈ రుబ్బిన పిండిలో ఈ పప్పు మిశ్రమాన్ని ముంచి కాగుతున్న నూనెలో వేసి కాల్చుకునేవారు. ఇట్లా చేసిన ప్పుడు తినడానకి ఈ బూరెలు ఎంతో రుచిగా ఉంటాయి.

కొబ్బరి పాయసం
కావాల్సినవి: కొబ్బరి పాలు - 2 కప్పులు
ఆవుపాలు - 2 కప్పులు
బెల్లం - ఒకటి న్నర కప్పులు
బియ్యం - అరకప్పు
కిసిమిస్ లు - 12, యాలకులు -6
బాదం, పిస్తా- 6
బియ్యం నేతిలో వేయించుకుని ఇందులో పాలు పోసి ఉడికించుకోవాలి. బియ్యం బాగా ఉడికినట్లు కనిపిస్తుండగా దీనిలో కొబ్బరి పాలు పోసి తిరిగి ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతుండగా పక్క స్టవ్ పైన జీడిపప్పు,కిస్‌మిస్‌లు బాదం, పిస్తా నేతిలో వేయించి ఉంచుకోవాలి. ఇప్పుడు ఉడికిన బియ్యం పాలల్లో బెల్లాని చేర్చుకుని బాగా ఉడికించుకోవాలి. స్టవ్ నుంచి దించేసి తరువాత వేయించి పెట్టుకున్న బాదం, జీడిపప్పుల్లాంటి వాటిని కలుపుకోవాలి.

బియ్యపుపిండితో పొంగనాలు
కావాల్సినవి: బియ్యపుపిండి దంచినవి - 2 కప్పులు, కొబ్బరి కోరు - అరకప్పు
బాదం పొడి - అరకప్పు
బెల్లం తరుగు - 2 కప్పు
నూనె- పావుకిలో, యాలకులు - 8
జీడిపప్పులు 24, చిటికెడు ఉప్పు
తయారీ: వేణ్ణీల్లు మరుగుతుండగా బెల్లం కరిగించుకోవాలి.ఇది లేత పాకం వస్తుండగా- బియ్యపు పిండి, కొబ్బరి కోరు, బాదంపొడి మూడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకానికి వస్తుండగా ఈ కలిపి పెట్టుకున్న మూడింటిని మిశ్రమాన్ని బెల్లానికి చేర్చాలి. ఇందులో యాలకుల పొడి, జీడిపప్పు కలుపుకోవాలి. ఉప్పు కోవాలి. ఇది గరిటజారుగా చేసుకోవాలి. దీనిని కాగిన నూనెలో గరిటతో విడిచి ఎర్రగా కాల్చుకోవాలి. లేదా నూనెలో కాల్చుకున్న తరువాత వీటికి జీడిపప్పును అలంకరించుకున్నా బాగుంటుంది.

సూజీ రవ్వ, రాగి పిండి అప్పాలు
కావాల్సినవి: సూజీ రవ్వ - 2కప్పులు
రాగిపిండి - అరకప్పు, పంచ దార - 2 కప్పులు
నెయ్యి - 5 చెంచాలు, నూనె - 250 గ్రాములు
తయారీ: రెండు కప్పుల నీరు మరగబెట్టి సూజీ రవ్వను వేసుకొని బాగా ఉడికించుకోవాలి. దీనిలో రాగి పిండిని కూడా చేర్చుకుని నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. దీనికి పంచదారను కూడా చేర్చుకుంటూ గరిటతో బాగా తిప్పుతుండాలి. ఉండలు కట్టకుండా బాగా మిశ్రమం దగ్గరయ్యేట్టుగా చేసుకోవాలి. బాగా ఉడికింది అనుకొన్నాక కిందకు దించుకుని ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చేత్తో చిన్న బిళ్లల్లాగా వత్తుకోవాలి. వీటిని కాగిన నూనెలో వేయించుకుంటే కర కరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి.
రవ్వ బొబ్బట్లు
కావాల్సినవి: ఎర్ర బన్సీ రవ్వ - 2కప్పులు
క్యారెటు కోరు - 1 కప్పు
పంచదార- 1 కప్పు
బెల్లం తరుగు - అరకప్పు
పాలు- 2 స్పూన్స్
యాలకులు 6
- 12, మైదా - 4 కప్పులు
ఉప్పు చిటికెడు, నూనె - కప్పులు
తయారీ: బన్సీరవ్వను దోరగా వేయించుకోవాలి. దీనికి క్యారెట్టు కోరు, పంచదార, బెల్లం తరుగు కలుపుకోవాలి. దీనిలో యాలకుల పొడిని కూడా చేర్చుకోవాలి.దీనికే ఉప్పును కూడా చేర్చుకోవాలి.పాలను కొంచెం కలుపుకుంటూ మెత్తగా గట్టిగా చేసుకోవాలి. ఆ తరువాత మైదాపిండిని చపాతీలకు తడుపుకున్నట్టుగా తడుపుకుని తడిగుడ్డలో 15 నిముషాలు అట్టిపెట్టాలి. తరువాత బన్సీరవ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మైదాపిండి మధ్యలో పెట్టుకుని బొబ్బట్టుగా వత్తుకుని నేయి వేస్తూ పెనం పైన కాల్చుకోవాలి.
బెల్లం గారెలు
కావాల్సినవి: మినపప్పు - 2 కప్పులు
బొబ్బర్లు - అరకప్పు, నూనె - పావుకిలో
బెల్లం తరుగు - 2 కప్పులు,
కేసరి రంగు - చిటికెడుటు
తయారీ : మినపప్పు, బొబ్బర్లు కలుపుకుని నానబెట్టి ఎక్కువ నీళ్లు వేయకుండాగట్టిగా రుబ్బుకోవాలి. బెల్లాన్ని పాకం పట్టుకోవాలి. బొబ్బర్లు, మినపప్పు కలిపి రుబ్బుకున్న పిండిని చిన్న చిన్న గారెల్లాగా చేసుకొని నూనెలో కాల్చుకోవాలి. ఇవి బాగా ఎర్రగా కాలిన తరువాత నూనె నుంచి తీసేసి వీటిని ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం పాకంలో వేసి నానబెట్టుకోవాలి. పదినిముషాలు తరువాత వీటిని అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు. ఆ తరువాత ఆహా ఏమి రుచి అని తినొచ్చు.
అటుకుల పాక్
కావాల్సినవి: అటుకులు - 2 కప్పు
బెల్లం తరుగు - 2కప్పులు
పుట్నాల పప్పు పొడి - 2కప్పులు
యాలకులు- 6, జీడిపప్పు - 2కప్పులు
నెయ్యి - 2కప్పులు
తయారీ: అటుకులను నేతితో వేయించుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. అటుకుల పొడిని, పుట్నాల పొడిని కలుపుకోవాలి. దీనికి యాలకుల పొడిని చేర్చుకోవాలి. బెల్లం తరుగును లేత పాకం పట్టుకోవాలి. దీనికి నేయిని చేరుస్తూ కలిపి పెట్టుకున్న పుట్నాల, అటుకుల పొడిని కొద్దికొద్దిగా కలుపుతూ బాగా కలుపుకోవాలి. నెయ్యిని వేసుకొంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమం గినె్ననుంచి విడవడుతున్నప్పుడూ నేతిని రాసిన పళ్లెంలో గుమ్మరించుకోవాలి. కాస్త చల్లారాక చాకుతో కావాల్సిన ఆకారంలో కోసుకోవాలి. ఇదే అటుకుల పాక్
చిట్టి అరిసెలు
కావాల్సినవి:
మెత్తని బియ్యం పిండి - 2
కప్పులు, బెల్లం తరుగు - 2 కప్పులు
నువ్వులు - అరకప్పు, యాలకులు - 6
నూనె - పావుకిలో, పాలు - అరకప్పు
తయారీ : బియ్యపు పిండి లో బెల్లం తరుగును కలుపుకొని బాగా కలుపుతూ దీనికి పాలను కూడా చేర్చుకుని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీనిలోనే యాలకుల పొడిని కూడా చేర్చుకోవాలి.దీనిలోనే నువ్వులు కలుపుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పాలకవర్ పైన అరెసల్లా వత్తుకోవాలి. నూనె బాగా కాలిన తరువాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోవాలి. ఇవి అరెసలంత పెద్దవిగా కాకుండా చిన్నచిన్నవిగా చేసుకోవాలి.

--కె.వాణీ ప్రభాకరి